ఏసీ ఉంటే ఆ హాయి వేరే అయినా, ఏసీని అమర్చుకోవడం అంత తేలిక కాదు. నానా తంటాలు పడితే గాని, ఇంట్లోని కోరుకున్న గదిలో ఏసీ అమర్చుకోలేం. ఏసీ అమర్చుకున్న గదిలో తప్ప మిగిలిన గదుల్లో పరిస్థితి మామూలే! ఇల్లంతటికీ ఏసీ కావాలనుకుంటే, గదికో ఏసీ చొప్పున పెట్టించుకోవాలి. దీనంతటికీ ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ఇంత ప్రయాస లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓజ్లెమ్–ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది. దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం చేస్తుంది.
ఇంట్లోని ప్రతి గదిలోనూ ఇది తిరుగుతూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చడమే కాకుండా, మనసును సేదదీర్చే పరిమళాలను కూడా వెదజల్లుతుంది. మార్కెట్‌లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను ఇంకా ప్రకటించలేదు.
(ఇదీ చదవండి: Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!)
Comments
Please login to add a commentAdd a comment