New Gadgets
-
దీన్ని తగిలిస్తే సరి! ఎక్కడున్నా ఇట్టే దొరికిపోతుంది!!
చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.జియోథింగ్స్ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్ స్పీకర్ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
విచిత్ర త్రిచక్ర వాహనం
ముందువైపు నుంచి చూస్తే ఈ వాహనం అధునాతనమైన కారులాగానే కనిపిస్తుంది. ఈ వాహనానికి ముందువైపు రెండు చక్రాలు ఉంటాయి. వెనుకవైపు చూస్తే మాత్రం ఒకే చక్రం ఉంటుంది. ఈ విచిత్ర త్రిచక్ర వాహనాన్ని జపాన్‌కు చెందిన బహుళజాతి ఆటోమొబైల్ కంపెనీ ‘యమాహా’ ఇటీవల దీనిని ‘ట్రైకెరా’ పేరుతో రూపొందించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఇందులో డ్రైవర్ సహా ఇద్దరు కూర్చుని ప్రయాణించడానికి వీలుంటుంది. దీని డ్రైవింగ్ విధానం కారు డ్రైవింగ్ మాదిరిగానే ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, ఏకధాటిగా వంద కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 80 కిలోమీటర్లు. దీనిని త్వరలోనే జపాన్‌లో విడుదల చేయనున్నట్లు ‘యమాహా’ కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత మిగిలిన దేశాల్లో కూడా దీనిని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫోల్డింగ్ వాషింగ్ మెషిన్ ఉతికిన తర్వాత బట్టలను మడతపెట్టి దాచుకోవడం మామూలే! ఉతుకుడు పని పూర్తయ్యాక వాషింగ్ మెషిన్‌ను ఇంచక్కా మడతపెట్టి, సూట్‌కేసులో దాచుకోవడాన్ని ఊహించగలమా? ఊహాతీతమైన ఈ వాషింగ్ మెషిన్‌ను హాంకాంగ్‌కు చెందిన పీక్యూపీ డిజైన్ కంపెనీ రూపొందించింది. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు సులువుగా తీసుకుపోయేందుకు వీలుగా దీనిని తయారు చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పని చేస్తుంది. దీనిని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఇందులో ఉతకాల్సిన దుస్తులు వేసుకుని, తగినంత నీరు, డిటర్జెంట్ నింపుకొని ఆన్ చేసుకుంటే, అడుగున ఉండే వైబ్రేటర్స్ నిర్దిష్టమైన వేగంతో పనిచేస్తూ, దుస్తుల మీద ఉండే మురికిని తేలికగా వదలగొడుతుంది. పని పూర్తయిన తర్వాత దీనిలోని నీటిని బయటకు వంపేసి, నీరంతా ఆరిన తర్వాత దీనిని మడిచేసి సూట్‌కేసులో లేదా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టేసుకోవచ్చు. దీని ధర 26.97 డాలర్లు (రూ. 2,248) మాత్రమే! భలే రోబో వాక్యూమ్ క్లీనర్ ఇప్పటికే మార్కెట్లో పలు రకాల రోబో వాక్యూమ్ క్లీనర్లు ఉన్నాయి. ఇవన్నీ నేల మీద, గోడల మీద ఉన్న దుమ్ము ధూళి కణాలను సమర్థంగానే తొలగిస్తాయి. చైనాకు చెందిన బహుళ జాతి సంస్థ టీసీఎల్ తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ఈ ‘స్వీవా’ రోబో వాక్యూమ్ క్లీనర్ దుమ్ము ధూళి కణాలను తొలగించడమే కాకుండా, ఉపరితలంపై వ్యాపించి ఉన్న బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను పూర్తిగా నాశనం చేస్తుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్–సి కిరణాలను ఎలాంటి రోగకారక సూక్ష్మజీవులనైనా క్షణాల్లో నాశనం చేసేస్తాయి. ఇది గూగుల్ అసిస్టెంట్ లేదా అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పని చేస్తుంది. ‘స్వీవా’ రోబో వాక్యూమ్ క్లీనర్స్ 1000, 2000, 6000, 6500 అనే నాలుగు మోడల్స్‌లో దొరుకుతాయి. ఎంపిక చేసుకున్న వేగాన్ని బట్టి 1500పీఏ నుంచి 2700పీఏ సక్షన్ స్పీడ్‌తో పనిచేస్తాయి. మోడల్‌ను బట్టి వీటి 104.99 నుంచి 499.99 వరకు (రూ. 8,752 నుంచి రూ.41,680 వరకు) ఉంటాయి. -
Reliance JioMotive: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే!
రిలయన్స్ జియో 'జియోమోటివ్' (JioMotive) పేరుతో భారతీయ మార్కెట్లో ఓ సరికొత్త డివైజ్ లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 వద్ద లభించే ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ కారులోని సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుంది. ఈ కొత్త జియోమోటివ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జియోమోటివ్ అనేది ప్లగ్ అండ్ ప్లే 'ఓబీడీ' (On-Board Diagnostics) గ్యాడ్జెట్. ఏ కారునైనా స్మార్ట్‌గా మార్చే ఈ డివైజ్.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్తో పాటు కారులోని సమస్యలను కూడా ముందుగానే తెలియజేస్తుంది. దీంతో వినియోగదారుడు వాటిని పరిష్కరించుకోవచ్చు, తద్వారా మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ రిలయన్స్ డిజిటల్, జియో.కామ్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. జియోమోటివ్ ఫీచర్స్ రియల్ టైమ్ ట్రాకింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ కారులో ఫిక్స్ చేస్తే.. వాహనాన్ని 24 గంటలు పర్యవేక్షించవచ్చు. ఇది దొంగతనాలకు ఖచ్చితంగా చెక్ పెడుతుంది. జియో-ఫెన్సింగ్: ఈ ఫీచర్ ద్వారా మ్యాప్‌లో వర్చువల్ సరిహద్దులను(బౌండరీస్) సెట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వెహికల్ హెల్త్ మానిటరింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ ద్వారా 100 కంటే ఎక్కువ డీటీసీ అలర్ట్ పొందవచ్చు. తద్వారా సమస్య పెద్దదికాకముందే పసిగట్టి పరిష్కరించుకోవచ్చు. డ్రైవింగ్ అనలిటిక్స్: డ్రైవర్ డ్రైవింగ్ బిహేవియర్‌ని కూడా ఈ గ్యాడ్జెట్ ఎనలైజ్ క్సహిస్తుంది. ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, హార్ష్ డ్రైవింగ్- బ్రేకింగ్, హార్ష్ యాక్సలరేషన్ వంటి అంశాలపై అలర్ట్ పొందొచ్చు. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి జియోథింగ్స్ (JioThings) యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. జియో నెంబర్ ద్వారా లాగిన అయిన తరువాత '+' మీద క్లిక్ చేసి జియోమోటివ్ ఎంచుకుని, ఐఎమ్ఈఐ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కారు రిజిస్ట్రేషన్ నెంబర్, కారు పేరు (బ్రాండ్ నేమ్), మోడల్, ఫ్యూయెల్ టైప్ వంటి మీ కారు వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓబీడీ పోర్ట్‌కి జియోమోటివ్ గ్యాడ్జెట్ ప్లగ్ చేసి.. తరువాత దశలను కంప్లీట్ చేయాలి. JioEverywhereConnect నెంబర్ షేరింగ్ ప్లాన్ రూల్స్ అంగీకరిస్తున్నట్లు టిక్ చేసి, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత JioJCR1440 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వగానే మీకు జియో నుంచి యాక్టివేట్ అభ్యర్థనకు ఓకే మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేట్ కావడానికి 10 నిముషాలు కారును ఆన్‌లోనే ఉంచాలి. రిజిస్ట్రేషన్, యాక్టివేట్ వంటి వివరాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నట్లతే.. పరిష్కారం కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. -
ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్
ఏసీ ఉంటే ఆ హాయి వేరే అయినా, ఏసీని అమర్చుకోవడం అంత తేలిక కాదు. నానా తంటాలు పడితే గాని, ఇంట్లోని కోరుకున్న గదిలో ఏసీ అమర్చుకోలేం. ఏసీ అమర్చుకున్న గదిలో తప్ప మిగిలిన గదుల్లో పరిస్థితి మామూలే! ఇల్లంతటికీ ఏసీ కావాలనుకుంటే, గదికో ఏసీ చొప్పున పెట్టించుకోవాలి. దీనంతటికీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇంత ప్రయాస లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓజ్లెమ్–ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది. దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం చేస్తుంది. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఇది తిరుగుతూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చడమే కాకుండా, మనసును సేదదీర్చే పరిమళాలను కూడా వెదజల్లుతుంది. మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!) -
కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోండి!
హైక్వాలిటీ టెక్నాలజీతో 3 ఇన్ 1 రిమూవబుల్ నాన్–స్టిక్ లార్జ్ ప్లేట్స్ ఉన్న ఈ గ్రిల్.. సరికొత్త లగ్జరీ లుక్‌తో వినియోగదారులని ఇట్టే ఆకర్షిస్తోంది. ‘హై, మీడియం, లో’ అనే త్రీ లెవల్స్ టెంపరేచర్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ గాడ్జెట్‌పై.. శాండ్విచ్, వాఫిల్స్, బార్బెక్యూ స్టిక్స్.. వంటివెన్నో సిద్ధం చేసుకోవచ్చు. మన్నికైన నాన్–స్టిక్ పూత పూసిన ఈ ప్లేట్స్ తక్కువ నూనెతో కరకరలాడే రుచులని అందిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేకర్‌కు ఆహారం అతుక్కోదు. దాంతో మృదువైన తడి గుడ్డతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ మేకర్ చిన్నపాటి సూట్‌కేస్‌లా ఉంటుంది. వాఫిల్స్, శాండ్విచ్లకు 2 జతల ప్లేట్స్, గ్రిల్ చేసుకోవడానికి ఒక పొడవాటి ప్లేట్.. మొత్తంగా 5 ప్లేట్స్ విడివిడిగా లభిస్తాయి. చిత్రంలో చూపించిన విధంగా 180 డిగ్రీల దగ్గర టెంపరేచర్ సెట్ చేసుకొని దానిపైన గ్రిల్ ప్లేట్ పెట్టుకుని.. ఆహారాన్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ ముందువైపు వివరంగా ఉండటంతో దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్ మెనూలోని డెజర్ట్స్ సెక్షన్లో సాధారంగా అందరూ ఆత్రంగా వెదికేది.. తప్పకుండా కనిపించేది ఐస్‌క్రీమ్. బయటకొంటే.. కరిగేలోపు తినెయ్యాలి. కష్టపడి ఇంట్లో చేసుకుంటే.. గడ్డకట్టే దాకా ఎదురుచూడాలి. అందుకే ఐస్‌క్రీమ్ ప్రియుల కోరిక మేరకు.. నచ్చినప్పుడు, నచ్చిన విధంగా నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రోల్స్ తయారుచేసుకుని, ఆనందంగా ఆస్వాదించే అవకాశాన్ని కలిపిస్తోంది ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్. దీనికి పవర్‌తో పనిలేదు. ఇది 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంటే.. కావాల్సినప్పుడు ఐస్‌క్రీమ్ చేతిలో ఉన్నట్టే. అదెలా అనేగా మీ డౌట్? ఏం లేదు.. రెసిపీ ముందే రెడీ చేసి పక్కనపెట్టుకుని.. ఫ్రిజ్‌లోంచి ఈ మేకర్ బయటికి తీసి.. దాని ప్లేట్లో ఆ మిశ్రమాన్ని పోసి.. పలచగా అంతా పరచాలి. 6 నుంచి 8 నిమిషాల పాటు.. అలానే ఉంచి రోల్స్‌లా తీసి సర్వ్ చేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు మేకర్‌పైనే రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. గాడ్జెట్‌తో పాటు.. రెండు గరిటెలు లభిస్తాయి. వాటితోనే మేకర్ మీద అరటిపండ్లు, చాక్లెట్స్లు ఇలా వేటినైనా మెత్తగా గుజ్జులా చేసుకుని, కస్టర్డ్‌మిల్క్, ఎసెన్స్ వంటివి జోడించి టేస్టీగా ఐస్‌క్రీమ్ రోల్స్‌లా చేసుకోవచ్చు. పిల్లలు సైతం సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా పూరై్తన తర్వాత ప్లేట్ కడిగినట్లు కడిగి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అల్యూమినియం ప్లేట్‌తో రూపొందిన ఈ మేకర్ ఎర్గోనామిక్ డిజైన్, హై–క్వాలిటీ మెటీరియల్‌తో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. మరో విషయం దీన్ని 24 గంటలూ ఫ్రిజ్‌లో ఉంచడం కుదరకుంటే.. కనీసం 12 గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మేకర్స్ దీర్ఘచతురస్రాకారం లో లేదా గుండ్రంగా చాలా రంగుల్లో లభిస్తున్నాయి. క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఫోర్టబుల్–ఫోల్డబుల్ ‘ప్రయాణాల్లో హోటల్ ఫుడ్ కంటే.. స్వయం పాకాలే బెస్ట్..’ అని ఎవరైన సలహా ఇస్తే.. ‘భలే చెప్పొచ్చారు.. కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోమంటారా..?’ అని వెటకారమాడకండి. ఎందుకంటే దాన్ని నిజం చేసేసింది టెక్నాలజీ. చిత్రంలోని కుకర్ని చక్కగా చిన్న పాటి బాక్స్లా మడచి వెంటతీసుకుని వెళ్లొచ్చు. 600ఎమ్ఎల్ సామర్థ్యం కలిగిన హై–క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన మినీ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ హాట్ పాట్.. చాలా రుచులని నిమిషాల్లో రెడీ చేయగలదు. ఫుడ్–గ్రేడ్ ఆర్గానిక్ సిలికాన్‌తో తయారైన ఫ్లెక్సిబిలిటీ మేకర్లో.. వాసన లేకుండా అధిక ఉష్ణోగ్రతపై వంట చేసుకోవచ్చు. దీని 304 స్టెయిన్లెస్ స్టీల్ బేస్ తుప్పు పట్టదు. గాడ్జెట్ ముందు భాగంలో సున్నితమైన టచ్ కంట్రోల్ ప్యానెల్‌పై అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంతో రైస్, నూడూల్స్, సూప్స్, ఎగ్స్, సీఫుడ్.. ఇలా చాలానే సిద్ధం చేసుకోవచ్చు. చదవండి: Attractive Mini Charpoy Trays: నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. ఇంకా.. -
కొత్త ప్రపంచం 15th Dec 2019
-
కొత్త ప్రపంచం 10th Nov 2019
-
కొత్త ప్రపంచం 3rd Nov 2019
-
కొత్త ప్రపంచం 13th Oct 2019
-
కొత్త ప్రపంచం 28th July 2019
-
కొత్త ప్రపంచం 3rd Feb 2019
-
కొత్తప్రపంచం 20th jan 2019
-
కొత్త ప్రపంచం 30th Dec 2018
-
కొత్త ప్రపంచం 23rd Dec 2018
-
కొత్త ప్రపంచం 30th sep 2018
-
కొత్త ప్రపంచం 26th August 2018
-
కొత్త ప్రపంచం 15th July 2018
-
వీళ్లు కొంచెం ‘స్మార్ట్’
మనిషి అనేక విధాలుగా తన ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఒక వస్తువును వాడటం ద్వారా, వాడే తీరును బట్టి కూడా తనెంత ప్రత్యేకమో చాటి చెప్పవచ్చు. అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, దానితో ముడిపడిన జీవనశైలిలో కూడా ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిన సెలబ్రిటీలున్నారు. స్మార్ట్ఫోన్లను, ఇతర కొత్త కొత్త గాడ్జెట్స్‌ను వారు తమ జీవనశైలిలో భాగం చేసుకున్నారు. అదెలాగంటే... కరీనాకపూర్ వస్తువుల్లో దేన్నో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితే వస్తే.. నా ఛాయిస్ ఫోనే అంటుంది బెబో. ఫోన్, దాని ప్రాశస్త్యం గురించి కరీనా ఎంత గొప్పగానైనా చెప్పగలదు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌తో ఉన్న సౌకర్యాలకు తను బానిసను అంటుందామె. మ్యూజిక్ ప్లేయర్ గా, ఇ-బుక్ రీడర్‌గా, స్నేహితులతో ఇంట్లో వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండటానికి, అంతులేని ఎంటర్టైన్మెంట్ కోసం స్మార్ట్‌ఫోన్‌కి మించిన మార్గం లేదని.. అందుకే అదంటే తనకు ప్రాణం అని కరీనా అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. షారుక్ ఖాన్ గాడ్జెట్స్ అంటే పడిచావడమే కింగ్ ఖాన్ ప్రత్యేకత. షారూక్ దగ్గర లెక్కకు మించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి. పేరున్న కంపెనీలు విడుదల చేసే కొత్త కొత్త స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కొనడం ఈ హీరోకి హాబీ. ఎప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోందనే అంశంపై కచ్చితంగా దృష్టి నిలిపి.. తన స్నేహితులకు కూడా ఆ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడట షారుక్ ఖాన్. అభిషేక్ బచ్చన్ జూనియర్ బచ్చన్ వెంట ఎల్లవేళలా ఒక ఐ ప్యాడ్ ఉంటుంది. షూటింగ్ స్పాట్లలో ఖాళీ సమయంలోనూ, ప్రయాణాలలోనూ ఆ ఐప్యాడ్ అభిషేక్ చేతిలోకి వచ్చేస్తుంది. ఐ ప్యాడ్‌ను పుస్తకాలు చదవడానికి ఉపయోగించడం బచ్చన్ ప్రత్యేకత. ఇంటర్నెట్లో లభ్యం అయ్యే, సేవ్‌చేసి ఉంచిన ఇ-బుక్‌లను చదువుతూ అభిషేక్ టైమ్‌ను సద్వినియోగం చేస్తుంటాడు. బిపాశాబసు ఈ బెంగాళీ భామ అప్లికేషన్స్ స్పెషలిస్ట్. ప్లేస్టోర్‌లోకి కొత్తగా ఏం అప్లికేషన్స్ వచ్చాయి.. వాటిలో ఏది బెస్ట్... అనే విషయాల గురించి బిపాశా అప్ టు డేట్‌గా ఉంటుంది. తన దైనందిన జీవితం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్స్‌తో ముడివడి ఉంటుందని... అప్లికేషన్లు రొటీన్ వర్క్‌లో వినోదాన్ని మిళితం చేస్తాయని బిపాశా చెబుతుంది. మాధవన్ ఈ స్మైలీ హీరోకి ‘యాపిల్’డివైజ్‌లు అంటే మోజు. ఐఓఎస్ అంటే క్రేజ్. ఎంతగానంటే.. మాధవన్ దగ్గర లేటెస్ట్ మోడల్ ఐ ప్యాడ్, ఐ పోడ్, ఐ టచ్, ఐ ఫోన్... ఈ నాలుగు ఉన్నాయి. ఐ డివైజ్‌లకు సంబంధించి రివ్యూలు అందించగల, ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే సౌలభ్యాల గురించి సుదీర్ఘంగా ఉపన్యసించగల సమర్థుడు మాధవన్.