చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.
జియోథింగ్స్ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.
ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్ స్పీకర్ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment