తమిళనాడు: కడలూరులో ఓ పాము కుక్క పిల్లలతో ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. వివరాలు.. కడలూరు సమీపంలోని బాలూరుకు చెందిన సామ్ భట్ ఇల్లు నిర్మిస్తున్నాడు. అక్కడ ఉన్న గుంతలో ఓ కుక్క 3 పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలను అక్కడే వదిలేసి ఆహారం వెతుక్కుంటూ తల్లి కుక్క వెళ్లింది.
ఈ క్రమంలో అక్కడికి ఓ నాగు పాము వచ్చింది. కుక్క పిల్లలను ఏమీ చేయకుండా అక్కడే ఉంది. కొంత సమయం తర్వాత అక్కడికి వచ్చిన తల్లి కుక్క పిల్లల పక్కనే పామును చూసి అరిచింది. పాము మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా తల్లి కుక్కను సైతం పిల్లల దగ్గరికి రానివ్వలేదు. కుక్క అరుపులతో అక్కడున్న జనం అక్కడికి వెళ్లి పామును చూశారు. సమాచారం అందుకున్న కడలూరు ఫారెస్ట్ అధికారి సెల్లా సంఘటనా స్థలానికి వెళ్లి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment