తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం | Hillary Clinton bags first honours | Sakshi
Sakshi News home page

తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం

Published Tue, Nov 8 2016 12:27 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం - Sakshi

తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం

న్యూయార్క్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తొలి విజయం సాధించారు. న్యూ హాంప్షైర్లోని డిక్స్విల్లె నాచ్లో హిల్లరీ 4-2 తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను ఓడించారు.

భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం అమెరికా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్ చేపడతారు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి ఓటింగ్ జరిగిన డిక్స్విల్లె నాచ్ ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి హిల్లరీ గెలవడంతో డెమొక్రటిక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆమెకు 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని తుది, తాజా రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement