ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి.
ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్‌తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి!
Comments
Please login to add a commentAdd a comment