దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు
అబుదాబి: దుబాయ్‌లో బుధవారం అర్థరాత్రి దాటాకా భారీ పేలుడు సంభవించింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా భారీ శబ్ధాలతో హడలెత్తినపోయారంటే పేలుడు తీవ్రత ఏం రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
#ÚLTIMAHORA Se produjo una gran explosión en el puerto de Dubai, Emiratos Árabes. Aún desconocen las causas. pic.twitter.com/OxROQzvTmP
— EL IMPARCIAL (@elimparcialcom) July 7, 2021
#BREAKING: Another Video:
— International Leaks (@Internl_Leaks) July 7, 2021
- Huge Damage
- Major explosion and fire at Jebel Ali Port, Dubai, UAE. Reports it was on an oil tanker. #BREAKINGNEWS #UAE #Dubai #SaudiArabia #MiddleEast #Israel #Iran #Iraq pic.twitter.com/W34gXzGfh5
Comments
Please login to add a commentAdd a comment