massive explosion
-
మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటం
సాక్షి, అనకాపల్లి, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. మధ్యాహ్నం 2.15 గంటలు.. భోజన విరామం.. ఇటు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నవారు.. అటు రెండో షిఫ్ట్ కోసం వస్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఏడంతస్తుల భవనం చిగురుటాకులా కంపించింది. చుట్టూ కిలోమీటర్ మేర దట్టమైన పొగలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. మాసం ముద్దలు.. ఒలికిన రసాయనాలు.. ఫ్లోరంతా రక్తపు చారికలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. భవనం కిందనున్నవారు చూస్తుండగానే తమ సహచరుల శరీర భాగాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. కొన్ని మృత దేహాలు యంత్రాలకు, చెట్లకు వేలాడుతున్నాయి. దట్టమైన పొగల మధ్య నుంచి బయటకు పరుగులు తీస్తున్న కార్మీకులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఎసైన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 17 మంది మరణించారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎసైన్షియా కంపెనీ ప్రధాన కార్యాలయంలో రియాక్టర్ పేలిపోవడంతో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఎందరున్నారో.. రక్తపు ముద్దలు, శరీర భాగాలు ఎవరివో తెలియని విషాద పరిస్థితి నెలకొంది. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో హెచ్‌పీసీఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మీకులు/సిబ్బంది ఈ దుర్ఘటనలోనే చనిపోయినట్లు చెబుతున్నారు. పెను విషాదం చోటు చేసుకున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమవారి సమాచారం కోసం కంపెనీ ముందు ఆతృతగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బంధువులు పేలుడు ధాటికి తునాతునకలు.. సెజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎసైన్షియాలోని మూడో ఫ్లోర్లో 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి మృతదేçహాలు తునాతునకలుగా చెల్లాచెదురయ్యాయి. చెట్ల కొమ్మలపై.. శ్లాబ్ కింద నుజ్జు నుజ్జుగా కనిపించాయి. ప్రమాదం ధాటికి ఫార్మా కంపెనీ పరిసరాల్లో భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా ముగ్గురు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో, ఒకరు ఉషాప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం కావడంతో.. ఎసైన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో గోడలు పగిలి దూరంగా పడిపోయాయి. ఫ్యాక్టరీలో రెండు షిప్ట్‌లలో 381 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భోజన విరామం కావడంతో పేలుడు సంభవించినప్పుడు ఉద్యోగులు తక్కువ సంఖ్యలో విధుల్లో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదంలో 60 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్నారు. సాల్వెంట్ మిశ్రమంలో రియాక్షన్‌తో.. అచ్యుతాపురం సెజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ సెజ్‌లోని ప్లాట్ నం 11, 11ఏ, 12, 12ఏలో 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కంపెనీలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాలు (టానిక్‌లు, డ్రాప్స్), బల్క్ డ్రగ్స్, స్పిరిట్ అండ్ సాల్వెంట్స్ తయారీ, సప్లయింగ్ చేస్తున్నారు. సాల్వెంట్‌లో రియాక్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. రసాయన మిశ్రమం కలిసే రెండో రియాక్టర్లో ఈ పేలుడు సంభవించింది. మృతదేహాలు మూట గట్టి..ముక్కలుగా చెల్లాచెదురైన మృతదేహాలను మూటగట్టి గుట్టు చప్పుడు కాకుండా కేజీహెచ్‌కు సుమారు 15 ప్రైవేట్ అంబులెన్స్‌ల్లో రాత్రి 9 గంటల తరువాత తరలించారు. మీడియా ప్రతినిధులు, బాధితుల కుటుంబ సభ్యులు లోపలకి వెళ్లకుండా సెక్యూరిటీ పెంచారు. గాయపడ్డ వారి వివరాలు తెలుసుకునేందుకు కనీసం అంబులెన్స్‌ల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుని పోలీసులను భారీగా మోహరించారు.⇒ మొత్తం మృతులు 17 మంది. 9 మంది ఆచూకీ తెలియడం లేదు.⇒ ప్రమాదం జరిగినప్పుడు అణుబాంబు పేలినంత భారీ శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 10 నిమిషాలపాటు చెవులు గింగుర్లు ఎత్తిపోయాయన్నారు.⇒ పేలుడు కంటే భవనం కూలడంతో శిథిలాల మధ్య చిక్కుకొని ఎక్కువమంది మరణించారు.మా వాళ్లేమయ్యారో..!రాంబిల్లి (యలమంచిలి): అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం నేపథ్యంలో పలువురు కార్మీకుల ఆచూకీ తెలియకపోవడంతో కంపెనీ వద్ద వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమ వారి వివరాలు చెప్పాలని పోలీసులను, కంపెనీ ప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నా కనీస స్పందన లేదని వాపోతున్నారు. బతికే ఉన్నారో.. చనిపోయారో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక, డీఐజీ గోపీనాథ్ జెట్టీ తదితరులు బయటకు వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద అడ్డుకుని బైఠాయించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలికి రాత్రి 11 గంటల సమయంలో వస్తారనే సమాచారంతో బాధితుల కుటుంబీకులు, బంధువులు ఆకలి దప్పులు మరిచి అక్కడే కూర్చున్నారు. కంపెనీ వెనుక గేటు నుంచి మృతదేహాలను రహస్యంగా తరలిస్తున్నట్లు తెలియడంతో కొందరు అక్కడకు చేరుకుని బైఠాయించారు. కనీసం మృతదేహాలను కూడా చూపలేదని, అన్నింటినీ మూటకట్టి గుట్టుగా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని బంధువులు కేజీహెచ్ ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.అమెరికాలో కంపెనీ ఏర్పాటు..ఎసైన్షియా లైఫ్ సైన్సెస్ కంపెనీ 2007లో అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో స్థాపించారు. కంపెనీ తన కార్యకలాపాలను అమెరికాతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. యాదగిరి పెండ్రి దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. యాదగిరి పెండ్రి 15 యూఎస్ పేటెంట్స్ పొందారు. ఈ కంపెనీ 2016లో విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో రిజిస్టర్ అయ్యింది. 2018లో కార్యకలాపాలను ప్రారంభించింది. వివిధ రకాల సిరప్‌లతో పాటు కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.కేజీహెచ్‌కు 13 మృతదేహాలుమహారాణిపేట (విశాఖ): ప్రమాదంలో మరణించిన 13 మంది మృతదేహాలను బుధవారం రాత్రి విశాఖపట్నం కేజీహెచ్ శవాగారానికి తీసుకొచ్చారు. ప్రమాదంలో తునాతునకలైన శరీరభాగాలను మూటలు కట్టారు. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఎవరిది ఏ కాలో.. ఎవరిది ఏ చెయ్యో తెలియడం లేదు.మృతుల వివరాలు1. నీలపు రామిరెడ్డి (49), అసోసియేట్ జనరల్ మేనేజర్/అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం2. హంస ప్రశాంత్ (34), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా3. మహంతి నారాయణరావు (34), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, అర్తమూరు, గరివిడి, విజయనగరం జిల్లా4. కొప్పర్తి గణేష్‌కుమార్ (33), సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువ్వలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా5. చల్లపల్లి హారిక (22), ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడ6. పైడి రాజశేఖర్ (23) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్, వంజంగి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా7. మారిశెట్టి సతీశ్ (31), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాశర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా8. మొండి నాగబాబు (36), అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట9. నాగేశ్వర రామచంద్రరావు (47), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, కూర్మన్నపాలెం, విశాఖ10. వేగి సన్యాసినాయుడు (53), హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి11.ఎల్లబిల్లి చిన్నారావు (27), పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా12.జవ్వాది పార్థసారధి (27), ఫిట్టర్, పార్వతీపురం13. పూడి మోహన్దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా14.జె.చిరంజీవి (25)15.బి.ఆనందరావు (35)16. ఎం. సురేంద్ర, అశ్వారావుపేట, ఖమ్మం 17. పి.వెంకటసాయి (28)అంబులెన్సులేవీ..ఎసైన్షియాలో ప్రమాదం జరిగాక సుమారు గంటన్నర వరకూ కూడా అంబులెన్స్‌లు కూడా రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి.. సరైన ఆసుపత్రిలో వైద్యం అందించి ఉంటే ఒకరిద్దరైనా బతికే అవకాశం ఉండేది. అలాగే అంబులెన్స్‌లు లేకపోవడంతో విశాఖలోని కేజీహెచ్‌కు కూడా క్షతగాత్రులను తరలించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత వచ్చిన పది అంబులెన్స్‌లు మృతదేహాలను తరలించడానికే పనికొచ్చాయి.ప్రమాదానికి కారణమిదే..రియాక్టర్లలో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కర్బన రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ జరిగింది. అంటే.. ఒక రియాక్టర్‌లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి చేరుకోవడం వల్ల ఆవిరి తీవ్రత పెరిగింది. ఈ ఆవిరి పరిమాణం రియాక్టర్లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారస్థాయికి చేరుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ప్రమాదానికి అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.నాతో ఉన్న ముగ్గురు చనిపోయారు భోజనం చేసి బ్లాక్‌లోకి వచ్చాను. అప్పుడే భారీ శబ్దం వినిపించింది. ఆ ధాటికి తూలిపోయి కింద పడిపోయాను. లేచి చూస్తే చుట్టూ పొగ.. కష్టంతో కళ్లు తెరిచి చూస్తే నాతోపాటు ఉన్న ముగ్గురు చనిపోయారు. – బి.రాజారావు, వెంకటాపురంఫ్యామిలీకి చెప్పలేదు మాది హనుమకొండ. కంపెనీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చా. పేలుడుతో ఏమైందో తెలుసుకునే లోపే శ్లాబ్ పెచ్చులు వేగంగా వచ్చి తలకు తగిలి కుడి వైపు గాయాలయ్యాయి. కంగారు పడతారని కుటుంబ సభ్యులకు ఇంకా ఏమీ చెప్పలేదు.– ప్రభాత్మా అన్నయ్య మృతదేహాన్ని చూపట్లేదుమా అన్నయ్య బీఎన్ రామచంద్రరావు (48) ఇక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే కంపెనీ దగ్గరికి వచ్చా.. అన్నయ్య జాడ తెలియట్లేదు. కంపెనీలో అడిగితే చనిపోయాడని, ఆస్పత్రికి పంపించామని చెబుతున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా చూపట్లేదు.– వెంకటలక్ష్మి, అచ్యుతాపురం కళ్లకు ఏమైందో.. మాది విజయనగరం జిల్లా ఎస్.సీతారామపురం. కంపెనీలో నిర్వహణ పనులు చేస్తుంటా. రోజులానే ఈ రోజూ కంపెనీకి వచ్చా. ప్రమాదంలో కళ్లలో ఏదో లిక్విడ్ పడి, రెండు కళ్లూ కనిపించట్లేదు. ముఖమంతా గాయాలతో రక్తపు మరకలయ్యాయి. కళ్లు కనిపిస్తాయో, లేదో కూడా తెలియట్లేదు. – కలిశెట్టి చంద్రశేఖర్సరైన వైద్యం అందట్లేదుచాలా మంది తలకు, కళ్లకు దెబ్బలు తగిలాయి. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చేర్చి చాలా గంటలైనా.. వైద్యం మాత్రం సరిగా అందట్లేదు. ఎక్కువ మంది క్షతగాత్రులందరినీ ఒకే ఆస్పత్రిలో చేర్చడంతో ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. – కె.నారాయణరావు, అసిస్టెంట్ మేనేజర్ -
AP: అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను ఆవుల వెంకటేష్, పరిటాల అర్జున్‌గా గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు.క్షతగాత్రులను మణిపాల్ ఆసుపత్రి, గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతుల బంధువులు, గ్రామస్తులు ఫ్యాక్టరీని ముట్టడించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. -
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 -
కెన్యాలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, 300 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది. News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E — Olu 🕊️ (@empror24) February 2, 2024 ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి. Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU — 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024 పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
థాయ్‌లాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్‌లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
ట్రిపుల్‌ఎఫ్ కర్మాగారంలో భారీ విస్ఫోటనం
పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ట్రిపుల్‌ఎఫ్ కర్మాగారంలో బుధవారం సాయంత్రం భారీ విస్పోటనం సంభవించింది. పరిశ్రమలో మూడంతస్తుల మేర ఉన్న ఎక్సైన్గా పిలిచే సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 9 మంది పనిచేస్తుండగా వారిలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన గుడిగంట మల్లికార్జునరావు అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు. అతడు గల్లంతైనట్టు భావిస్తున్నారు. కాగా మరో ముగ్గురు కార్మికులు తృటిలో తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న ఇద్దరిని రాజమండ్రి తరలించినట్టు ఎస్ఐ జి.సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి విస్ఫోటనంలో దగ్ధమైన యంత్రాలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఫోన్లో కోరారు. -
కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో ఏడు గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకతీయ థర్మల్ విద్యుత్ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని కోల్ మిల్లర్‌లో ఇనుప రాడ్డు రావడంతో కార్మికులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డోర్‌ను తెరవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కార్మికులకు అంటుకున్నాయి. ప్రమాదంలో జేపీఏ వెంకటేష్, ఆర్జిజన్ కేశమల్ల వీరస్వామితోపాటు బ్రదర్స్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు సీతారాములు, జానకిరాములు, సాయికుమార్, రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేటీపీపీ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అందులో ఆర్జిజన్ వీరస్వామి, జేపీఏ వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో, ఏడుగురిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. మిల్లర్‌లోకి ఇనుపరాడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన కార్మికుల్లో ఐదుగురు విజయవాడనుంచి సోమవారమే కేటీపీపీకి వచ్చినట్లు తెలిసింది. కేటీపీపీ పవర్‌ప్లాంట్‌లో మొదటిసారి ప్రమాదం జరగడంతో ఇంజనీర్లు, కార్మికులు షాక్‌కు గురయ్యారు. -
దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా
అబుదాబి: దుబాయ్‌లో బుధవారం అర్థరాత్రి దాటాకా భారీ పేలుడు సంభవించింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా భారీ శబ్ధాలతో హడలెత్తినపోయారంటే పేలుడు తీవ్రత ఏం రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. #ÚLTIMAHORA Se produjo una gran explosión en el puerto de Dubai, Emiratos Árabes. Aún desconocen las causas. pic.twitter.com/OxROQzvTmP — EL IMPARCIAL (@elimparcialcom) July 7, 2021 #BREAKING: Another Video: - Huge Damage - Major explosion and fire at Jebel Ali Port, Dubai, UAE. Reports it was on an oil tanker. #BREAKINGNEWS #UAE #Dubai #SaudiArabia #MiddleEast #Israel #Iran #Iraq pic.twitter.com/W34gXzGfh5 — International Leaks (@Internl_Leaks) July 7, 2021 -
‘బ్లాస్టింగ్’పై పారదర్శకంగా విచారణ
సాక్షి, కడప/బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి క్వారీ వద్ద 10 మందిని బలితీసుకున్న భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతానికి తావులేకుండా బాధ్యులందరిపైనా చర్యలకు ఆదేశించడంతో విచారణ వేగం పుంజుకుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు, పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు వై.ఎస్.ప్రతాపరెడ్డిని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తద్వారా తప్పు చేసిన వారి విషయంలో తన–మన అనే తేడాలుండవని ప్రభుత్వం గట్టి సంకేతాలనిచ్చింది. సంఘటనపై దర్యాప్తునకు ఐదుగురు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించటంతో ఈ కమిటీ బుధవారం మామిళ్లపల్లెను సందర్శించి విచారణ ఆరంభించింది. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, మైన్స్ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్స్ శాఖలకు చెందిన అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వారు తెలియజేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, క్షుణ్నంగా విచారణ చేస్తున్నామని జేసీ గౌతమి విలేకరులకు చెప్పారు. జిల్లాలో మిగతా క్వారీలను కూడా తనిఖీ చేసి అక్రమాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఈనెల 8వ తేదీన జిలెటిన్ స్టిక్స్‌ను క్వారీ వద్ద దించుతుండగా పేలుడు ఘటనలో మృతి చెందిన పది మందికి లీజుదారుడి నుంచి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం మరో రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ పరిహారం తాలూకు చెక్కుల్ని అధికారులతో కలిసి స్థానిక నేతలు బుధవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. దీంతో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున సాయం అందినట్లయింది. ఐదు రోజుల్లోనే... ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే ప్రభుత్వం వేగంగా స్పందించి అండగా నిలవడంపై బాధిత కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. ఘటన జరిగిన మూడో రోజే లీజుదారుడి నుంచి రూ.50 లక్షలు పరిహారం బాధితులకు ఇప్పించగా ప్రభుత్వం కూడా తన సాయాన్ని అందజేసింది. నిబంధనలు పాటించకుండా ఎల్రక్టానిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను ఒకేసారి వాహనంలో క్వారీ వద్దకు తరలించడం, జాగ్రత్తలు తీసుకోకుండా ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో దించడంతో ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులు, క్షతగాత్రులను ఆదుకోవడంతోపాటు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిమాండ్‌కు వైఎస్ ప్రతాప్‌రెడ్డి దాదాపు 33 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఈ క్వారీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి పేరుతో ఉండగా బి.మఠం ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. లీజుదారుడు నాగేశ్వర్‌రెడ్డిని, ఎక్స్‌ప్లోజివ్స్ మేనేజర్ రఘునాథరెడ్డిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. పేలుడు పదార్థాల విక్రయాల్లో నిబంధనలు పాటించలేదని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు పులివెందులకు చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బద్వేలు మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆయన సమీప బంధువు అయినప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యులందరిపైనా పోలీసులు చర్యలు చేపట్టారు. -
మహారాష్ట్ర కెమికల్ ఫాక్టరీలో ప్రమాదం
సాక్షి, ముంబై/పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లోని కెమికల్ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు. -
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభంవించింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. బాధితులను ఆదుకుంటాం : మంత్రి కన్నబాబు పేలుడు ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. ప్రమాద విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
వరంగల్‌లో భారీ పేలుడు
సాక్షి, వరంగల్ : పొట్ట కూటి కోసం కూలి పనికి పోయిన పేదల బతుకులు చెల్లాచెదురయ్యాయి. వెంట తెచ్చుకున్న మెతుకులు తినకముందే బతుకులు చిందరవందరగా మారాయి. రోజులాగే పనిచేస్తున్న చోటే ఎవరూ ఊహించిన రీతిలో పిడుగు పడినట్లుగా శబ్దంతో కూడిన పేలుడు సంభవించడం... ఏమైందో తెలుసుకునే లోపే తెగిపడ్డ అవయవాలను చూసి బాధితుల గుండెలు అవిసేలా రోదించారు. కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని వజ్ర మ్యాట్రిక్స్లో గురువారం ఉదయం 10.46 గంటలకు భారీ పేలుడు సంభవించించగా ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా షెడ్డు రేకులు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు భారీ శబ్దం రావడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయా.. ఉంటే ఎందుకు తీసుకొచ్చారు.. గ్రానైట్ రాళ్లను పాలీష్ చేసేందుకు ఉపయోగించే బిట్స్ తయారీ పరిశ్రమ పేరిట ఇందులో ఏం చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ముక్కలు ముక్కలు వజ్ర మ్యాట్రిక్స్లో పేలుడు సమయంలో వెలువడిన భారీ శబ్దం రాంపూర్ గ్రామం వరకు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అంతలోపే బాధితుల కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారితో పాటు గ్రామస్తులు చేరుకున్నారు. అప్పటికే గాయాలతో విలవిలాడుతున్న బాధితులను వజ్ర మ్యాట్రిక్స్ యాజమానితో పాటు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో ముగ్గురు స్త్రీలతో పాటు ఇద్దరు పురుషులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు గాయపడగా.. దూరంగా ఉన్న పురుషులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు ధాటికి కంపెనీలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు కావడంతో పాటు పైకప్పు రేకులు ముక్కలుముక్కలయ్యాయి. కిటికీ అద్దాలు మొత్తం పగిలిపోగా షట్టర్ ఓ పక్కకు వంగిపోవడం పేలుడు తీవ్రతను చెబుతోంది. తెగిపడిన కాలు తొలగింపు పేలుడులో గాయపడిని నాయిని స్వరూప, నాయిని రజితను రోహిని ఆస్పత్రికి తీసుకువచ్చేటప్పటికీ స్వరూప కుడికాలు మోకాలు కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయింది. దీంతో డాక్టర్లు తెగిపోయిన భాగాన్ని వేరు చేశారు. ఆమెకు ముఖంపై కూడా బలమైన గాయాలయ్యాయి. ఇక స్వరూపతో పాటు రజితకు చికిత్స చేసి ఐసీయూ విభాగానికి తరలించారు. తీవ్ర గాయాలైన కంటి ప్రియాంకను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొలుత ప్రియాంకను రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లగా గాయాల తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోలేదని సమాచారం. ఎంజీఎంకు తీసుకెళ్లాక పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. బిట్స్ తయారు వజ్ర మ్యాట్రిక్స్ కంపెనీలో గ్రాðనైట్ రాళ్లను పాలిష్ చేయడానికి ఉపయోగించే బిట్స్ తయారుచేస్తారు. గురువారం ఐదుగురు పనికి వచ్చారు. గాయపడిన ముగ్గురు మహిళలు బిట్స్‌ను గమ్(బంక)తో అంటిస్తుండగా పేలుడు సంభవించింది. డైమండ్ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయన పదార్థాలు కలిపి మిషన్‌పై వివిధ పరిమాణాలలో బిట్స్ తయారు చేస్తారు. ముందే నిర్దేశించిన పరిమాణంలో రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. బిట్స్ తయారీకి వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉండదని చెబుతున్నారు. కాగా, బిట్స్‌ను రాజస్థాన్, ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. కంపెనీలో నాలుగు మిషన్లు ఉండగా గురువారం మూడు మిషన్లను మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. ఒక మిషన్‌లో ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఆన్ సమస్య వస్తే తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ తంబ రెండు రోజుల క్రితం వచ్చి రిపేర్ చేశారు. ప్రమాద సమయంలో తంబ కూడా కంపెనీలోనే ఉన్నాడు. రంగంలోకి క్లూస్ టీం పేలుడు సంభవించిన స్థలానికి లో క్లూసీ టీం సభ్యులు చేరుకుని నమూనాలు సేకరించారు. బిట్స్ తయారీకి సంబంధించి ఉపయోగించే డైమండ్ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయనాల శాంపిల్స్ సేకరించారు. బిట్స్‌తో పాటు బాధితుల సెల్ఫోన్లు కూడా సేకరించారు. క్లూస్ టీం సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నమునాలు సేకరించగా బాంబుస్క్వాడ్ బందం కూడా పరిశీలించింది. మిక్సింగ్ రూమ్‌లో ఏం ఉంది? బిట్స్ తయారీకి వినియోగించే పదార్థాలను ఒక గదిలో ఉంచారు. అందులో వివిధ రకాల సైజు బిట్స్ తయారీకి ఏ పదార్థం ఎంత మోతాదులో వినియోగించాలో నిర్ధారించి కలిపాకే మిషన్లపైకి తెస్తారు. మ్యాట్రిక్స్ కంపెనీలో 200, 400, 600, 800, 1500, 3000 రకాల బిట్స్ తయారుచేస్తారు. బిట్స్‌లో వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉంటే ప్రెషర్ మిషన్‌పై పేలొచ్చని భావిస్తున్నారు. కానీ బిట్స్ పూర్తిగా చల్లారాకే ప్లాస్టిక్ కవర్లు(గ్రిప్) గమ్‌తో అంటిస్తారు. గురువారం ఇదే పని చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో అసలు ఎలా జరిగిందంనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సాధారణంగా మిక్సింగ్ రూమ్‌లోకి ప్రియాంక, స్వరూప వెళ్తారని తెలిసింది. ఈ మేరకు క్లూస్‌టీం బందం శాంపిల్స్ సేకరించగా.. బిట్స్ తయారీ పదార్థాల్లో పేలుడు స్వభావం కలిగినవి ఉంటే మాత్రం ఎలాంటి అనుమతులు లేనందున యాజమాన్యం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. -
పెళ్లిలో పేలిన మానవబాంబు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ ఆత్మాహుతి దాడి సంభవించింది. పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన పేలుడులో 63 మంది ప్రాణాలు కోల్పోగా 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. శనివారం సాయంత్రం కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని దుబాయ్ సిటీ వెడ్డింగ్ హాల్లో మిర్వాయిజ్ అనే యువకుడి పెళ్లి వేడుక జరుగుతోంది. సుమారు 1,200 మంది ఆ వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం మహిళలు, పిల్లలు ఒక వైపు, పురుషులకు మరోవైపు వేరుగా వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. పురుషులంతా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 63 మంది చనిపోగా 182 మంది గాయపడ్డారు. ఆ హాలంతా మృతదేహాలు, రక్తం, శరీరభాగాలతో భయానకంగా మారింది. పేలుడు తీవ్రతకు ఆ హాలు పైకప్పు బీటలు వారింది. ఆ హాలు దాదాపు 20 నిమిషాల సేపు పొగ, ధూళితో నిండిపోయింది. అందులోని పురుషుల్లో ప్రతి ఒక్కరూ గాయపడటమో ప్రాణాలు కోల్పోవడమో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ‘ఈ విషాదం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా సోదరుడు, స్నేహితులు, బంధువులు చనిపోయారు. నా కుటుంబ సభ్యులు షాక్‌తో ఉన్నారు. నవ వధువు స్పృహ కోల్పోయింది’ అని పెళ్లి కొడుకు మిర్వాయిజ్ గద్గద స్వరంతో మీడియాతో అన్నాడు. కాగా, అఫ్గాన్‌లో షియాల పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటాయి. పండుగ వాతావరణంలో గంటలకొద్దీ కొనసాగే ఈ వేడుకలకు వందలు, ఒక్కోసారి వేలల్లోనే బంధువులు, పరిచయస్తులు హాజరవుతుంటారు. మామూలుగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోని, ఎక్కువ సంఖ్యలో గుమికూడే షియా వివాహ వేడుకలే లక్ష్యంగా ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనను అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తమ సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మరికొందరు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలను పేల్చివేశారని టెలిగ్రామ్ యాప్ ద్వారా వెల్లడించింది. సున్నీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న అఫ్గాన్‌లో షియాలపై ఐఎస్ తరచూ దాడులకు పాల్పడుతోంది. అఫ్గానిస్తాన్‌లో మోహరించిన తమ బలగాల ఉపసంహరణ, శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధికారులు ఉగ్రసంస్థ తాలిబన్‌తో ఒక వైపు చర్చలు సాగిస్తుండగానే ఈ ఘోరం సంభవించింది. ఇలా ఉండగా, బల్ఖ్ ప్రావిన్సులో రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలి కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. -
రావల్పిండి ఆర్మీ హాస్పిటల్లో భారీ పేలుడు
-
మొక్కజొన్న ఫ్యాక్టరీలో పేలుడు
పెనుబల్లి: మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. సుమారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం సమీపంలో గల మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన వ్యాపారి ఎలినేని మురళీకృష్ణ నాయకులగూడెంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. మొక్కజొన్న కంకుల నుంచి విత్తనాలు వేరు చేసి.. బెండ్లను బాయిలర్‌లో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి రవాణా చేస్తారు. ఈ క్రమంలో బాయిలర్ వద్ద పీడనం పెరిగి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరు నుంచి పది మంది వరకు తీవ్ర గాయాల య్యాయి. పేలుడు తీవ్రతకు కార్మికులు 10 నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. మృతదేహాలు మాత్రం భయానక పరిస్థితిలో పడి ఉన్నాయి. క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా.. పేలుడు రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకోగా.. అప్పటికే కొందరు కార్మికులు విధుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడుతో ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కూలిపోయింది. పరిసరాల్లోని కార్లు, లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరినీ గుర్తించలేని పరిస్థితి ఉంది. కాగా.. బిహార్‌కు చెందిన కార్మికులతోపాటు స్థానికులు ఇందులో పనిచేస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. -
ఉలిక్కిపడ్డారు..
ఖమ్మంక్రైం: పొద్దుపొద్దునే..భారీ పేలుడుతో ఖమ్మంలోని ప్రధాన వ్యాపార, వాణిజ్య కూడలి అయిన కమాన్‌బజార్‌లోని వారంతా ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల చాలాదూరం వరకు ఈ పేలుడు శబ్దం వినిపించడం, భూమి కంపించినట్లుగా మారడంతో సిటీ ప్రజలు కూడా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని భయపడి నిద్రలేచారు. కమాన్‌బజార్‌లోని బెందడి రవీందర్నాథ్కు చెందిన ఓ భవనంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వస్త్రదుకాణం నిర్వహిస్తుండగా..తెల్లవారుజామున నాలుగు గంటల వేళ అందులో ఊహించని పేలుళ్లు చోటు చేసుకున్నాయి.ఈ ధాటికి..రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న మరో రెండు షాపులు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల ఉన్న 20 దుకాణాలకు బీటలు వారి స్వల్ప నష్టం జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల నివాసాల్లోని వారంతా భయంతో వణికారు. అదే సమయంలో కరెంట్ సైతం పోయింది. పైకప్పు సీలింగ్‌లు కింద పడ్డాయి. అద్దాలు పగిలిపోవడంతో భూకంపం వచ్చిందనుకుని అరుపులు, కేకలు వేస్తూ..రోడ్డు మీదకు చేరారు. ఆ వీధిలో అంతా పొగజూరి ఉండడంతో కాసేపటికి..ఈ దుకాణం నేలమట్టమైన విషయాన్ని గుర్తించి ప్రమాద తీవ్రతతో జంకారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అప్రమత్తం ఈ సమాచారంతో..ఖమ్మంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, నేలకొండపల్లి నుంచి ఓ ఫైరింజన్‌తో సిబ్బంది చేరుకున్నారు. పేలుడు సంభవించిన దుకాణం వెనుక గల భవనంలో నిద్రిస్తున్న..దేవాండ్ల శ్రీనివాస్ మంటల్లో చిక్కుకుని..తనను కాపాడాలని కేకలు వేస్తుండటంతో వన్‌టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, మొగిలి, సిబ్బంది అప్రమత్తమై నిచ్చెన వేసి ఆ వ్యక్తిని కాపాడారు. అప్పటికే అతను తీవ్రంగా గాయపడ్డాడు. వన్‌టౌన్ సీఐ రమేష్..నిచ్చెనతో పైకి తీసుకొచ్చారు. స్థానికులు సహకరించారు. ఎదురుగా సుమంగళి వస్త్ర దుకాణం ఎదుట మంటలు వస్తుండటంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కేకలు వేశారు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది అగ్గిని ఆర్పి..బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సహాయ అధికారి రేమండ్, ఖమ్మం అగ్నిమాపక అధికారి రాంరెడ్డి, రెస్క్యూటీమ్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మున్సిపాలిటీ నుంచి తెప్పించిన రెండు జేసీబీల ద్వారా భవన శకలాలను తొలగించారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో జరిగి ఉంటే..జనం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగేదని, ప్రాణాపాయం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. సందర్శించిన సీపీ, నాయకులు ఉదయం పూట సంఘటన స్థలాన్ని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. భవన యజమాని బెందడి రవీందర్‌నా«థ్ హైదరాబాద్‌లో ఉండగా..పోలీసులు ఖమ్మంకు పిలిపించారు. సీపీ వెంట ఏసీపీ వెంకట్రావు, ఆర్ఐ శ్రీనివాస్, సీఐలు రమేష్, షుకూర్, రాజు, నరేందర్, పలువురు సిబ్బంది ఉన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి వచ్చిన బాంబ్, డాగ్‌స్క్వాడ్ వారు విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలను సేకరించారు. ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మేయర్ పాపాలాల్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, అఫ్రోజ్ సమీనాలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమవారం కమాన్‌బజార్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దుకాణాలను బంద్ చేయించారు. షాప్‌ను అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ ఏం చేశాడు? ఈ రెండతస్తుల భవనాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాయికి తీసుకున్నాడు. ఇందులో వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇతడికి నర్సంపేటలోనూ షాపు ఉంది. గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా కొనసాగకపోవడంతో అతను అద్దె కూడా చెల్లించట్లేదు. షాపు ఖాళీ చేయాలని చెప్పడంతో గత మూడు రోజులుగా కొంత సామగ్రి తరలిస్తున్నాడు. బిల్డింగ్ యజమాని బెందడి∙రవీందర్నాథ్కు మధ్య కిరాయి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో..శ్రీనివాసే ఆ ఇంట్లో బాంబు పెట్టి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడడంతో..పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రుడిని పోలీసులు విచారిస్తున్నారు. విస్ఫోటనం చెందిన భవనం వెనుక గదిలో అతడితోపాటు ఇంకెవరైనా ఉన్నారా..? ఈ సంఘటనతో వారు పారిపోయారా..? అనే దానిపై కూడా కూపీ లాగుతున్నారు. జిలెటిన్‌స్టిక్స్ ఉన్నాయా..? ఈ భవనాన్ని అద్దెకు తీసుకుని వస్త్రదుకాణం నిర్వహిస్తున్న శ్రీనివాస్..జిలెటిన్ స్టిక్స్ లేదా డిటోనేటర్లు నిల్వ ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందనుకున్నప్పటికీ..పేలుడు పదార్థాల వల్లే ఈ భారీ విధ్వంసం చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో పలు దుకాణాల్లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండటంతో ప్రమాదవశాత్తూ..సిలిండర్లు పేలాయా..? దీపావళి టపాసులు నిల్వ ఉంచారా..? అని కూడా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం పేలుడు పదార్థాల వల్లే..ఇలా జరిగిందని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. కడప కారులో డైరీ.. ప్రమాదం జరిగిన భవనం వద్ద నిలిపిఉన్న కారు ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందినది. ఇందులో పోలీసులు సోదా చేశారు. ఓ డైరీ, పలు వస్తువులు లభించినట్లు తెలుస్తోంది. ఇదే కారులో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనివాస్ వస్త్రదుకాణంలో ఉన్నారని, వారిపై కూడా తమకు అనుమానం ఉందని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా తమిళం మాట్లాడేవ్యక్తులు వస్తుండేవారని, అనుమానాస్పదంగా తిరిగారని స్థానికులు చెబుతున్నారు. సీజ్ చేసిన కారు కడప జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన షేక్ షరీఫ్ సన్నాఫ్ మహమూద్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. పిల్లలను తీసుకుని పరిగెత్తాం.. మాది పేలుడు జరిగిన దుకాణం పక్కనే ఫ్యాన్సీ షాప్. పొద్దున నాలుగ్గంటలప్పుడు మంచి నిద్రలో ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. సీలింగ్ అంతా ఊడిపడింది. పిల్లలను తీసుకుని పరిగెత్తుకుంటూ బయటకొచ్చాం. మా దుకాణం షట్టర్లు ఊడిపడ్డాయి. ఇల్లు దెబ్బతింది. – శ్రీదేవి, లావణ్య ఫ్యాన్సీ వస్తువులన్నీ పడిపోయాయి.. మా ఇంటి ఎదురుగానే ఈ దుకాణం ఉంది. పేలుడు సంభవించడంతో మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో అని కిందికి వచ్చి చూశా. ఎదురుగా మంటలు వస్తున్నాయి. పోలీసులు, ఫైర్‌సిబ్బంది మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. – బవిరిశెట్టి లక్ష్మీకాంత్, స్థానికుడు నమ్మలేకపోయాం.. ఇలాంటి పేలుడు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ మా కళ్లముందే ఇంత భారీ విస్ఫోటనం జరగడంతో తునాతునకలుగా అద్దాలు, వస్తువులన్నీ పడిపోయాయి. ఈ దృశ్యాలను చూసి మేం అస్సలు నమ్మ లేకపోయాం. చాలా భయమేసింది. వామ్మో..ఇలా జరగొద్దు. – కమర్తపు కిరణ్‌కమార్, స్థానికుడు అంతదూరం వినిపించింది.. మా ఇల్లు ప్రభాత్ టాకీస్ దగ్గర్లో ఉంది. కమాన్‌బజార్‌లో పేలిన బాంబు శబ్దం మా ఇంటివరకూ వినిపించింది. అంతా ఉలిక్కిపడ్డాం. కరెంటు కూడా పోయింది. కొద్దిసేపటికి కమాన్‌బజార్‌లో బాంబు పేలిందని తెలిసి..ఇక్కడికి వచ్చిచూస్తే..ఆగమాగంగా ఉంది. – కిషోర్, స్థానికుడు -
సంఘటనా ప్రాంతంవద్ద భయానక పరిస్ధితి
-
న్యూయార్క్ పేలుళ్లలో ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో బుధవారం ఉదయం మన్ హట్టన్ లోని ఈస్ట్ హార్లెమ్ లో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మందికి గాయలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ఉన్న బాధితులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని హార్లెమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. విద్యుత్ నిలిపివేసేందుకు, గ్యాస్ లైన్లను మూసి వేసేందుకు సంబంధిత సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. చాలా మంది తీవ్ర ఆందోళనకు గురికాగా, మరికొందరు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈ ఘటనకు కారణమేమి తెలియరాలేదు. అయితే గ్యాస్ లీక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.