బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్‌లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment