
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభంవించింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.
బాధితులను ఆదుకుంటాం : మంత్రి కన్నబాబు
పేలుడు ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. ప్రమాద విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment