ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.
Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL
— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024
దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.
#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu
— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024
Comments
Please login to add a commentAdd a comment