
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను ఆవుల వెంకటేష్, పరిటాల అర్జున్‌గా గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు.
క్షతగాత్రులను మణిపాల్ ఆసుపత్రి, గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతుల బంధువులు, గ్రామస్తులు ఫ్యాక్టరీని ముట్టడించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

Comments
Please login to add a commentAdd a comment