'పేదరికం పోవాలంటే పోర్టు నిర్మాణం జరగాల్సిందే' | built of bhavana paadu port helps to reduce poverty says chandrababu | Sakshi
Sakshi News home page

'పేదరికం పోవాలంటే పోర్టు నిర్మాణం జరగాల్సిందే'

Published Mon, Dec 7 2015 4:32 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

built of bhavana paadu port helps to reduce poverty says chandrababu

శ్రీకాకుళం: భావనపాడు పోర్టు నిర్మాణం పై ప్రభుత్వ వైఖరిని ఆంధ్రరప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భావనపాడు ప్రాంతంలో పేదరికం పోవాలంటే పోర్టు నిర్మాణం జరగాల్సిందే అని ఆయన అన్నారు. భావన పాడు, కళింగపట్నం పోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలతో పాటూ భూముల విలువ పెరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న అంశం పరిశీలనలో ఉందని చంద్రబాబు అన్నారు. ఉద్యానవన కాలేజీ, రైస్ రిసెర్చ్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్పు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement