శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టులో 17 మంది ఉద్యోగుల తొలగింపు
ఆ ఉద్యోగాలు తమవారికి ఇవ్వాలని బెదిరింపులు
పచ్చ నేతల హెచ్చరికలకు తలొగ్గిన అధికారులు
ఆందోళనకు దిగిన బాధితులు, నిర్వాసితులు
పోర్టుకు భూములివ్వని నాయకుల పెత్తనమేంటని మండిపాటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సంతబొమ్మాళి: అధికారమే అండగా టీడీపీ నేతలు బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట పోర్టులో పనిచేస్తున్న మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 17 మందిని టీడీపీ నేతల బెదిరింపులతో అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఉద్యోగులు వైఎస్సార్‌సీపీకి చెందినవారని.. వారిని తీసేసి టీడీపీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు 17 మందిని ఉద్యోగాల నుంచి తప్పించడంతో బాధితులతోపాటు నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
స్థానిక సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో మూలపేట పోర్టులోకి ప్రవేశించి ఉద్యోగాల తొలగింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకులు తమను బెదిరించడం వల్లే 17 మందిని తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వని టీడీపీ నాయకుల పెత్తనం ఏమిటని ప్రశి్నంచారు. వారు దర్జాగా వారి భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారని, పోర్టుకు భూములిచ్చి తాము సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు.
పోర్టులో ఉద్యోగాలు చేసుకుంటున్న తమపై టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాగా 10 రోజుల పాటు మూలపేట గ్రామస్తులకు పని ఆపుతున్నామని పోర్టు అధికారులు చెప్పారు. దీంతో తమతో పాటు మిగతా గ్రామస్తులకు పని ఆపాలని ఉద్యోగాలు కోల్పోయినవారు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే తమ అభిమతమని సర్పంచ్ బాబూరావు, గ్రామస్తులు రాంబాబు, శివ, దారపు అప్పలరెడ్డి, రోహిణి, మోహనరావు తదితరులు తెలిపారు.
ఇదే విషయాన్ని పోర్టు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, హెచ్‌ఆర్ మేనేజర్ సంతో‹Ùలకు తెలియజేశామన్నారు. కాగా, ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, నౌపడ ఎస్‌ఐ కిషోర్‌వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోర్టు అధికారులకు విన్నవించడానికి వెళ్లిన నిర్వాసితులను తొలుత సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో తర్వాత లోపలకు విడిచిపెట్టారు. మీడియా ప్రతినిధులను సైతం గేటు వద్దే ఆపేశారు.
మూలపేటపై కాలకూట విషం..
వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మూలపేట పోర్టుపై పెత్తనం కోసం టీడీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. పోర్టుకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులు, ఉద్యోగాల కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ రాళ్లు, ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలను నిలిపివేయించారు. తాజాగా అందులో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేలా అధికారులను బెదిరించారు. దీంతో అటు నిర్మాణానికి కీలకమైన బండ రాళ్లు, గ్రావెల్, ఇసుక రవాణా కాకపోవడంతో ప్రధాన పనులు నిలిచిపోయాయి.
ఇప్పుడేమో ఉద్యోగులను కూడా తొలగించి టీడీపీ నేతలు పనులను కూడా అడ్డుకున్నారు. ఒక మంత్రితో కలిసి స్థానిక టీడీపీ నేతలు మూలపేట పోర్టును తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ పనులు శరవేగంగా జరిగాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. పోర్టు పనులు పూర్తయితే 11 తీర ప్రాంత మండలాల మత్స్యకారులకు మత్స్య సంపద లభించడంతో పాటు జీడిపప్పు, గ్రానైట్, జూట్, ఇనుము ఉక్కు ఎగుమతులకు అవకాశం కలుగుతుంది. అయితే టీడీపీ నేతల దాషీ్టకాలతో పోర్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
చంపుతామని బెదిరిస్తున్నారు
ప్రభుత్వం మారిన వెంటనే మమ్మల్ని చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని టీడీపీ నాయకులు అధికారులను భయపెట్టారు. నిర్వాసిత గ్రామస్తులందరికీ పోర్టులో పనికల్పించాలని అధికారులకు విన్నవించాం. – జీరు బాబూరావు, సర్పంచ్, మూలపే
Comments
Please login to add a commentAdd a comment