
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్‌కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్‌కు చేరాయి.