![ilayaraja singapore mount elizabeth hospital - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/5/ILAYARAJA27318.jpg.webp?itok=9awqRv0c)
తమిళసినిమా(చెన్నై): దశాబ్ధాలుగా తన అద్బుత సంగీతంతో కోట్లాది మందిని అలరిస్తున్న ‘మేస్ట్రో’ ఇళయరాజా సంగీతం ఇకపై వివిధ జబ్బులను నయం చేయడంలోనూ కీలకంగా మారనుంది. వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఆయనది. వీనులవిందైన ఇళయరాజా సంగీతాన్ని వైద్యానికి ఉపయోగపడేలా మార్చేందుకు సింగపూర్‌కు చెందిన ప్రముఖ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి నిర్వాహకులు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇళయరాజా రూపొందించిన సంగీత ఆల్బమ్‌లపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇళయరాజా కూడా ఇందుకోసం కొన్ని ప్రత్యేక బాణీలను సమకూర్చుతున్నట్లు సమాచారం. ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment