కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాక మాములుగా ఉన్నది కూడా సడెన్‌గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఈ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎవరూ ఎందుకు ఉండరో తెలియదు. పైగా అక్కడ వందలకు పైగా ఇళ్లు అన్ని వనరులు ఉండి ఉండకపోవడం ఏంటీ? అనిపిస్తోంది కదా. ఈ గమ్మతైన ఘటన ఎక్కడ జరిగిందంటే..
ఆ ఊళ్లో నాలుగువందలకు పైగానే ఇళ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్లో ఇప్పుడు ఉంటున్నది నలుగురు మనుషులు మాత్రమే! స్కాట్లండ్‌లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్‌షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918–20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు ‘స్కాట్లండ్ చెర్నోబిల్’గా పేరుమోసింది. అలాగని ఇక్కడేమీ అణు ప్రమాదమేదీ జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ఫ్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు.
స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు రెండేళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్‌షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ‘ప్రస్తుతం ఈ ఫ్లాట్లలో నలుగురం మాత్రమే మిగిలున్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదు.
ఇటీవలే ఒకరు తన ఫ్లాట్‌ను 7000 పౌండ్లకు (రూ. 7.39 లక్షలు) అమ్ముకుని వెళ్లిపోయారు’ అని ఇక్కడ చాలాకాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలాకాలంగా ఈ ఫ్లాట్లు ఖాళీగా పడి ఉండటంతో భూతగృహాల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్‌షిప్‌లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పుపెట్టారు. క్లూన్‌పార్క్ టౌన్‌షిప్‌లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి, ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఇన్వర్‌సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలను సిద్ధం చేసినా, ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
(చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment