Glasgow
-
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్‌ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్‌హామ్ గేమ్స్‌లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన -
బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
బ్రిటన్: స్కాట్లాండ్ లోని గ్లాస్కో నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. “మదర్ ఎర్త్ హిందూ దేవాలయం “ ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని ఎన్నుకున్నారు.ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు , రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడింది. 06/10/24న బతుకమ్మ జరుపుకున్నారు . దీన్ని డాక్టర్ మమత వుసికల మరియు వినీల బత్తుల నేతృత్వంలోని స్థానిక తెలుగు సంఘం నిర్వహించింది. ఈ బృందానికి ట్రస్టీలు – డాక్టర్ పునీత్ బేడీ మరియు శ్రీమతి రష్మీ నాయక్ మద్దతు ఇచ్చారు.మూడు వందల మంది పిల్లలు సహా అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం విశేషం. దుర్గామాతకు పూజలు, హారతులతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహిళలు బతుకమ్మకు పూజలు చేసి సంప్రదాయ నృత్యం చేశారు. దీని తర్వాత మళ్లీ ఆర్తి మరియు మా తెలుగు సంఘం వాలంటీర్లు చేసిన అద్భుతమైన విందు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఎంతో ఆనందించారు. ఈ మధ్య కాలంలో తాము హాజరైన మంచి ఫంక్షన్ ఇదేనని అన్నారు వారు. నిర్వాహకులు తమ శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. -
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు మరియు దైవత్వం మరియు ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను మనకు అందిస్తుంది.గ్లాస్గో యొక్క దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ఉంది మరియు అది ప్రకృతిలో పెరుగుతోంది. మాకు సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేదు. నిపుణుల బృందం కలిసి సమావేశమై చర్చల ద్వారా మా కమ్యూనిటీ కోసం ఒక సాంస్కృతిక కేంద్రంతో సహా ఒక మందిర్ ఆలోచనను రూపొందించింది. మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, మా కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని మేము కనుగొన్నాము. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడిందిఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల మరియు వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి మరియు బతుకమ్మలను జరుపుకుంటారు. అక్టోబర్ 6న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చిరకాలం మన జ్ఞాపకాలలో నిలిచిపోయే వేడుకగా ఇది జరగబోతోందని మా సంఘం వారు చాలా ఉత్సాహం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఊరిలో నాలుగొందలకుపైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్‌గా..
కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాక మాములుగా ఉన్నది కూడా సడెన్‌గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఈ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎవరూ ఎందుకు ఉండరో తెలియదు. పైగా అక్కడ వందలకు పైగా ఇళ్లు అన్ని వనరులు ఉండి ఉండకపోవడం ఏంటీ? అనిపిస్తోంది కదా. ఈ గమ్మతైన ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆ ఊళ్లో నాలుగువందలకు పైగానే ఇళ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్లో ఇప్పుడు ఉంటున్నది నలుగురు మనుషులు మాత్రమే! స్కాట్లండ్‌లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918–20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు ‘స్కాట్లండ్ చెర్నోబిల్’గా పేరుమోసింది. అలాగని ఇక్కడేమీ అణు ప్రమాదమేదీ జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ఫ్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు. స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు రెండేళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ‘ప్రస్తుతం ఈ ఫ్లాట్లలో నలుగురం మాత్రమే మిగిలున్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదు. ఇటీవలే ఒకరు తన ఫ్లాట్‌ను 7000 పౌండ్లకు (రూ. 7.39 లక్షలు) అమ్ముకుని వెళ్లిపోయారు’ అని ఇక్కడ చాలాకాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలాకాలంగా ఈ ఫ్లాట్లు ఖాళీగా పడి ఉండటంతో భూతగృహాల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్‌షిప్‌లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పుపెట్టారు. క్లూన్పార్క్ టౌన్‌షిప్‌లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి, ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఇన్వర్సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలను సిద్ధం చేసినా, ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి వనరులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదంచేసే (గ్రీన్ క్లైమేట్) ప్రాజెక్టుల్లోకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తగిన మిశ్రమ ఫైనాన్స్ ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా నిధులు సమీకరించడానికిగాను ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. 2070 నాటికి కర్బన్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి ఒక కీలక విధానాన్ని ఆమోదించింది. మెరుగైన వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంలో భాగంగా గ్లాస్గో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటిత ’పంచామృతం’ వ్యూహానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించిన జాతీయ విధాన రూపకల్పన ఉంది. ఈ విధానం ప్రకారం, ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతం తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుండి 50 శాతం విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధన దిశలో సస్టైనబుల్ ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్‌పై జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఐఎస్ఎస్బీ)తో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంప్రతింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఎస్బీ రాబోయే రెండు నెలల్లో క్లైమేట్ ఫైనాన్స్ కోసం ప్రమాణాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే నియమ నిబంధనవాళి, ఇన్స్ట్రమెంట్లు అభివృద్ధి చెందిన– చెందుతున్న దేశాల మధ్య వివక్ష చూపేవిగా ఉండరాదని కూడా భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
పచ్చటి కళ.. నేచర్ డ్యాన్స్
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనే మాటలో గ్యారెంటీ ఉందో లేదో తెలియదుగానీ చాలా చిన్నవయసులోనే సంగీత, నాట్యాలపై అభిమానాన్ని పెంచుకుంది సోహిని రాయ్ చౌదురి. నాన్న మంచి సంగీతకారుడు. ఇక నానమ్మ బొకుల్సేన్ గుప్త సంగీతంలో దిట్ట. కోల్‌కతాలోని ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలు. రాగాల గొప్పదనం ఏమిటంటే... నేర్చుకుంటూ పోతే కొత్త లోకాలు ఆవిష్కరించబడతాయి. నృత్యాల గొప్పదనం ఏమిటంటే... చేస్తూ పోతే కొత్త ప్రపంచాలు చేరువవుతాయి. సంగీత సాహిత్య నృత్య ప్రపంచాల సంగతి సరే... భౌతిక ప్రపంచం సంగతేమిటి? పొగలు,సెగలు, కర్బన ఉద్గారాలు... భూమికి గాయాలు చేస్తున్నాయి. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునేవాళ్లు తప్ప రేపటి గురించి ఆలోచించేవాళ్లు అరుదైపోయారు. ఈ నేపథ్యంలోనే కళాకారుల బాధ్యత పెరుగుతుంది. నిజమైన కళాకారులు చేసే పని సృజనాత్మక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచంతో సమన్వయం చేయడం. ప్రస్తుతం అదే పని చేస్తుంది సోహిని. పర్యావరణ సంబంధిత అంశాలను నృత్యరూపకాలుగా మలిచి మన దేశంలోనే కాదు 14 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా కాప్ 26, గ్లాస్గోలో ‘నేచర్ అండ్ అజ్’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శన దేశదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలతోనే కాదు దేశీయ సాంస్కృతిక మూలాలతో కూడా పర్యావరణ స్పృహ కలిగించవచ్చని నిరూపించింది సోహిని. ఈ నృత్యప్రదర్శనలో ఆమె కుమారుడు రిషిదాస్ గుప్త గిటార్ ప్లే చేయడం విశేషం. ‘కాప్26 కేంద్రసిద్ధాంతాన్ని నృత్యం, సంగీతం, కథనం, వేదపాఠాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను’ అంటుంది సోహినిరాయ్. ఆమె ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ‘నేచర్ అండ్ అజ్’కు ‘కాప్26’లో ప్రపంచ ప్రతినిధుల నుంచి లభించిన ప్రశంసలే గొప్ప నిదర్శనం. -
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
PM Modi: డ్రమ్స్ వాయించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
గ్లాస్గో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయలకు తగిన వేషధారణలో కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు స్వాగతం, వీడ్కోలు పలికే సందర్భంగా అక్కడ ఉన్నవారికి అభివాదం చేస్తూ, కరచలనంతో ఉత్సాహం నింపుతారు. అయితే తాజాగా కాప్-26వ శిఖరాగ్ర సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) కోసం ప్రధాని స్కాట్లాండ్లో గ్లాస్గో నగరానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కాప్-26 సదస్సు ముగిసిన అనంతరం ప్రధానిమోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉండే భారతీయులు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు. ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రమ్స్ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని ఆయన కూడా డ్రమ్స్ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland (Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW — ANI (@ANI) November 2, 2021 -
బిల్‌గేట్స్‌తో మోదీ భేటీ
గ్లాస్గో సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ మంగళవారం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, అపరకుబేరుడు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధి, భూతాపోన్నతిని తగ్గించే చర్యలపై చర్చలు జరిపారు. అనంతరం నేపాల్ ప్రధాని దేవ్బా తో మోదీ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు చతురోక్తులు విసురుకున్నారు. ‘మా దేశంలో మీకు అత్యధిక జనాదరణ ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ తెలపగా మోదీ ‘థ్యాంక్యూ, థాంక్యూ’ అంటూ బదులిచ్చారు. అనంతరం బెన్నెట్ తమ యమినా పార్టీలో చేరాలంటూ మోదీని ఆహ్వానించారు. దాంతో, ఇరువురు నేతలు సరదాగా నవ్వుకున్నారు. -
ఒకే ప్రపంచం.. ఒకే సౌర గ్రిడ్
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. ద్వీపాలకు భారత్ అండ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు. -
కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు
గ్లాస్గో:స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు జరిగిన కాప్26 వాతావరణ మార్పుల సదస్సు లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కళ్లు మూసుకుని కూర్చున్నట్లు చూపించే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. (చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం) వాతావరణ సదస్సు కోసం గ్లాస్గోకు వెళ్లిన ప్రపంచ నాయకులలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు.అతను మొదట్లో స్పీకర్ చెబుతున్న ప్రసంగం వింటున్నట్లు కనిపించాడు. అయితే కొన్ని సెకన్ల తర్వాత ప్రసంగ కొనసాగుతుండగా మరోవైపు యూఎస్ అధ్యక్షుడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు ఉంటాడు. ఆ తర్వాత ఒక సహాయకుడు బైడెన్ దగ్గరకి వస్తున్న వెంటనే అతను కళ్ళు తెరిచి ప్రసంగాన్ని వింటూన్నట్లుగా చప్పట్లు కొడుతూనే ఉంటాడు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో తోపాటు " కాప్ 26 ప్రారంభ ప్రసంగాల సమయంలో బిడెన్ నిద్రపోతున్నట్లు కనిపిస్తోంది" అనే క్యాప్షన్ జోడించి వాషింగ్టన్ రిపోర్టర్ జాక్ పర్సర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోకు మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) Biden appears to fall asleep during COP26 opening speeches pic.twitter.com/az8NZTWanI — Zach Purser Brown (@zachjourno) November 1, 2021 -
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
పారిస్ ఒప్పందానికి.. కట్టుబడి ఉన్నది మేమే
గ్లాస్గో: వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు. మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు. ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ఐదు సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. ప్రకృతితో సహ జీవనం వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికీ ఎన్నో సంప్రదాయ తెగలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ పరిజ్ఞానం ఆయా తెగల ప్రజలకు ఉందని అన్నారు. ఇది ముందు తరాలకు సైతం అందాలంటే సిలబస్‌లో చేర్చాలని చెప్పారు. భారత్‌తో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి విసురుతున్న సవాళ్లు తక్కువేమీ కాదని తెలిపారు. ఈ సవాళ్ల కారణంగా పంటల సాగు తీరే మారిపోతోందని అన్నారు. అకాల వర్షాలు, వరదలు, పెనుగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, క్లీన్ ఇండియా మిషన్, వంట గ్యాస్ సరఫరా వంటి చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన నాణ్యత పెరిగేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ సోమవారం సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఐదు సూత్రాల అజెండా 1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం. 2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం. 3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం. 4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం. 5. నెట్ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధిస్తుంది. -
గ్లాస్గో వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు
-
1765కు ముందు గాలి నాణ్యత ఎలా ఉండేదో తెలుసా?
పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం ఎంతగా కలుషితం అవుతోందో మనకు తెలుసు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాక ముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పటి పరిస్థితులను తెలుసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో కళాకారుడు, రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ పీహెచ్డీ అభ్యర్థి వేన్ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి త్వరలో స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్ జీరో ఎగ్జిబిషన్’లో ప్రదర్శనకు ఉంచనున్నారు. అంటార్కిటికా ఐస్ నుంచి.. శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) సైంటిస్టులతో కలసి బినిటీ ఐదేళ్ల పాటు ఆ మంచు ఖండంలో డ్రిల్లింగ్ చేశారు. 170 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరిపి మంచును సేకరించారు. దానిని విశ్లేషించి డబ్బాల్లో నింపి పెట్టారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు. ‘‘నా కళ హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్ పరిస్థితులను తెలుపుతుంది. చదవండి: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని బినిటీ అభిప్రాయపడ్డారు. లిక్విడ్ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్ సిలికాన్ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలతో బీఏఎస్ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్లైన్లో ఉంచనున్నారు. చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి 1765 కీలకమైన సంవత్సరం బీఏఎస్ శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. ‘‘మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్ కంపోజిషన్ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చు. 10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్ ఉండేది. ఆ దశకంలో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్ డైయాక్సైడ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది
గ్లాస్గో : అదో స్కాటిస్ బార్. ఓ మధ్యవయస్కుడు తన పక్కనున్న యువతితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి ఓ యువతి వచ్చింది. రావటంతోటే అతడిపై పంచులు కురిపించింది. లేడీ టైసన్లా మారి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. అంతా డబ్ల్యూడబ్ల్యూఈలో లాగా జరిగిపోయింది. క్షణాల్లో అతడి ముఖం రక్తసిక్తమైంది. ఆమెనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు! కుదరలేదు. ఆమె పక్కకు జరగటంతో అతను మీదకు వెళ్లాడు. ఆమె మళ్లీ అతడిపై దాడి చేసింది. చివరకు అక్కడి వారు వారిద్దరినీ పట్టుకుని పక్కకు తీసుకుపోవటంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తనను రక్తం వచ్చేలా కొట్టినా అతడు ఆమెపై గట్టిగా చేయిచేసుకోకపోవటం గమనార్హం. జులై 13న గ్లాస్గోలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన్నులు తిన్న వ్యక్తి, చితక్కొట్టిన మహిళ ఎవరో తెలియరాలేదు. గ్లాస్గోకు చెందిన గేరీ మెకే అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై స్పందించిన స్కాట్లాండ్ పోలీసులు.. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియకుండా ఏమీ మాట్లాడలేమని తేల్చిచెప్పేశారు. -
వీడి అతి తెలివికి నెటిజన్లు ఫిదా..
ఎడిన్బర్గ్ : విమానంలో అదనపు లగేజీ చార్జీల నుంచి తప్పించుకోవడానికి మంచేస్టర్ మహిళ చేసిన పనిని నెటిజన్లు ఇప్పటికి మర్చిపోలేదు. సదరు మహిళ లగేజ్ చార్జీ తప్పించుకోవడం కోసం ఒకదానిమీద ఒకటి ఏడు డ్రెస్సులు, రెండు చొక్కాలు ధరించి విమానాశ్రయ సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా సదరు మహిళను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో.. అతను కూడా అలానే చేశాడు. లగేజీ చార్జీలు తప్పించుకునేందుకు ఈ వ్యక్తి ఏకంగా 15 టీ షర్ట్స్‌ను ఒక దాని మీద ఒకటి ధరించాడు. వివరాలు.. గ్లాస్గోకు చెందిన జాన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఎడిన్బర్గ్ వెళ్తున్నాడు. అయితే విమానాశ్రయ నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వెంట 8కిలోల కన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్లకూడదు. అలా చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జాన్ లగేజీ 8కిలోల కంటే ఎక్కువగానే ఉంది. దాంతో అతను లగేజీ చార్జీ తప్పించుకోవడం కోసం బ్యాగులో నుంచి టీ షర్టులు తీసి ఒక దాని మీద ఒకటి ధరించడం ప్రారంభించాడు. ఇలా మొత్తం 15 టీ షర్ట్స్ ధరించాడు. అయితే ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరలవుతోది. Suitcase was over the weight limit in the airport so ma Da whipped oot aboot 15 shirts n wacked every one a them on to make the weight🤣🤣🤣😂😂cunt wis sweatin pic.twitter.com/7h7FBgrt03 — Josh Irvine (@joshirvine7) July 6, 2019 -
‘నా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి’
బాల్యం తాలూకు మధుర స్మృతులు ఎవరి జీవితంలోనైనా అత్యంత విలువైనవి. ఇక పుట్టి పెరిగిన ఇంటిపై ఉండే మమకారం సరేసరి. పరిస్థితుల ప్రభావంగా ఇల్లు మారినా సరే అక్కడి పరిసరాలతో ముడిపడిన అనుబంధం మాత్రం చెక్కుచెదరదు. అలాంటి సమయంలో ఇంటిని వీడి పోయేటపుడు కలిగే బాధ వర్ణనాతీతం. స్కాట్లాండ్కు చెందిన చార్లెట్‌కు పదమూడేళ్ల వయసు ఉన్నపుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో తన మనసులో కలిగిన భావాలను ఓ లెటర్లో పొందుపరిచి తన గదిలో ఓ చోట దాచిపెట్టింది. ‘నా జీవితంలో 11 ఏళ్ల కాలం ఈ ఇంట్లోనే గడిచిపోయింది. ఇది నా చిన్ననాటి బెడ్రూం. ఇంకో రెండు రోజుల్లో ఈ గదిని, ఇంటిని విడిచివెళ్తున్నాం. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నా కోసం.. నా ఇంటిని జాగ్రత్తగా చూసుకోరూ’ అంటూ చార్లెట్ రాసిన ఆ ఉత్తరం దాదాపు 11 ఏళ్ల తర్వాత వాళ్ల ఇంటి కొత్త ఓనర్ మార్టిన జాన్స్టోన్కు దొరికింది. ఇంటిని రెనోవేషన్ చేయిస్తున్న సమయంలో తనకు దొరికిన లెటర్‌ను చూసి ఆశ్చర్యానికి గురైన మార్టిన్..‘ మా ఇంటి ఎక్స్ట్రా బెడ్రూంలోని కార్పెట్ కింద ఈ లెటర్ దొరికింది. ప్రస్తుతం చార్లెట్ ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా’ అంటూ లెటర్ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశాడు. మార్టిన్ ట్వీట్ వైరల్‌గా మారడంతో కేవలం 18 గంటల్లోనే చార్లెట్ జాడ తెలిసిపోయింది. ‘ నిజంగా ఇది నాకు సర్ప్రైజ్. తొమ్మిదేళ్లుగా నేను బాత్‌లో జీవిస్తున్నా. గ్లాస్గోలోని మా పాత ఇంటితో ఉన్న అనుబంధాన్ని మీ ట్వీట్ మరోసారి గుర్తుచేసింది. నేను ఆశించినట్లుగానే మీరు ‘నా ఇంటి’ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా. థ్యాంక్యూ మార్టిన్’ అంటూ చార్లెట్ ట్విటర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. -
విమానంలో వింత..!
గ్లాస్గో : విమానంలో ఒకే ఒక్క ప్యాసింజర్ ప్రయాణించగా సిబ్బంది మాత్రం ఆమెను ఓ వీఐపీగా ట్రీట్ చేశారు. ఇది చదివి ఆ ప్యాసింజర్ బడా పారిశ్రామికవేత్తో, లేక పేరు మోసిన అధినేత అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఓ సాధారణ ప్రయాణికురాలు ఒంటరిగా విమానంలో ప్రయాణించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్కాట్లాండ్కు చెందిన కరోన్ గ్రీవ్ అనే మహిళ ఓ రచయిత్రి. ఆమె గత మూడు రోజుల కిందట గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్ అనే ప్రాంతానికి విమానంలో జర్నీ చేయాలనుకున్నారు. జెట్ 2 అనే ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే 189 మంది సీట్ల సామర్థ్యం ఉన్న ఆ విమానంలో కేవలం మూడు టికెట్లే బుక్ అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ విమానం బయలుదేరే సమయానికి కేవలం కరోన్ గ్రీవ్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో సమయం మించిపోతుందని విమానం ఒక్క ప్రయాణికురాలితోనే వెళ్లిపోయింది. ఒకే ప్రయాణికురాలు కావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది గ్రీవ్‌కు వీఐపీలా చూసుకున్నారు. దీంతో విమాన సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 'గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్కు జెట్ 2 విమానంలో ప్రయాణికురాలిని నేనొక్కదాన్నే. కెప్టెన్ లారా, ఇతర విమాన సిబ్బంది వీఐపీలా ట్రీట్ చేశారంటూ' కరోన్ గ్రీవ్ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా చోటుచేసుకుంటుందని విమాన సిబ్బంది తెలిపింది. @jet2tweets Amazing flight Glasgow to Heraklion yesterday I was the only passenger. Captain Laura and crew amazing, felt like a VIP all day! pic.twitter.com/q4CEkTf7Az — Karon Grieve (@KaronGrieve) 23 October 2017 -
భారత్ ‘డబుల్’ ధమాకా
- ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో స్వర్ణ, రజతాలు - టైటిల్స్‌లో పంకజ్ అద్వానీ రికార్డు గ్లాస్గో: అంతర్జాతీయ బిలియర్డ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, రజత పతకంతో మెరుపులు మెరిపించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 5-4తో భారత్ ‘ఎ’ జట్టును ఓడించింది. తాజా విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. భారత్ ‘ఎ’ తరఫున అలోక్ కుమార్, భాస్కర్, సౌరవ్ కొఠారీ, ధ్రువ్ సిత్వాలా; భారత్ ‘బి’ తరఫున పంకజ్ అద్వానీ, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్యాలు ప్రాతినిధ్యం వహించారు. గంటపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లలో భారత్ ‘ఎ’ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మూడు రౌండ్లలో ‘బి’ జట్టు 2-1తో నెగ్గి స్కోరును సమం చేసింది. చివరి మూడు రౌండ్లలో భారత్ ‘బి’ ఆటగాళ్లు పంకజ్ 613-116తో కొఠారీని; రూపేశ్ షా 379-90తో అలోక్‌ను ఓడించి జట్టుకు టైటిల్‌ను అందించారు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రపంచ టీమ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌లో క్యూ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
దుమ్మురేపిన 'బంగారు' బోల్ట్
గ్లాస్గోవ్: ఒలంపిక్ క్రీడల్లో ఆరుసార్లు విజేతగా నిలిచిన జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ కామన్ వెల్త్ క్రీడల్లో తొలి బంగారు పతాకాన్ని సొంతం చేసుకున్నాయి. గ్లాస్గోవ్ లోని హాంప్ డెన్ పార్క్ లో జరిగిన 4X100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ కామన్ వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. జమైకాకు చెందిన జాసన్ లివర్ మోర్, కెమర్ బెయిలీ-కోల్, నికెల్ ఆస్తమీడ్ కలిసి బోల్ట్ ఈ ఘనతను సాధించారు. కామన్ వెల్త్ క్రీడల్లో పొల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే వ్యక్తిగత ఈవెంట్లలో రాణించలేకపోవడం విచారంగా ఉంది అని బోల్ట్ అన్నారు. -
పతకాల పట్టికలో ఇండియాకు 5వ స్ధానం
-
గ్లాస్గో గేమ్స్‌లో ఐశ్వర్య హల్ చల్
-
జీతురాయ్ ఇతర క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు
న్యూఢిల్లీ: గ్రాస్గోవ్ లో జరుగుతున్న 20వ కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలను సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం అభినందించారు. రాష్ట్రపతి అభినందించిన వారిలో జీతు రాయ్, గుర్పాల్ సింగ్, గగన్ నారంగ్ లు షూటింగ్, వికాస్ ఠాకూర్ కు వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో పతకాలు సాధించారు. కామన్ వెల్త్ లో భారతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులను రాష్ట్రపతి అభినందించినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ వ్యక్తిగతంగా సందేశాలు పంపారని అధికారులు తెలిపారు. జీతురాయ్ బంగారు, గుర్పాల్ సింగ్ రజత, నారంగ్ రజత పతకాలు సాధించారు. -
పక్షవాతం నుంచి పతకం దాకా....
సరిగ్గా ఏడాది క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. ముఖం, ముఖ్యంగా నోరు వంకర పోయింది. ఒక కన్ను కూడా వంకరపోయింది. దాన్ని బెల్స్ పాల్సీ అంటారు. దాంతో ఆయన ప్రపంచం ఉన్నట్టుండి కుప్పకూలిపోయినట్టయింది. ఆయన జీవితమే మారిపోయింది. కానీ ఆయనలోకి క్రీడా స్ఫూర్తి, పట్టుదల ఓటమిని అంగీకరించవద్దని చెప్పింది. తండ్రి పాపన్న కూడా అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని గెలవమని ప్రోత్సహించాడు. దాంతో ఆయన పోరాటాన్ని కొనసాగించాడు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కామన్వెల్త్ ఆటల పోటీల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాదు రజత పతకాన్నీ గెలుచుకున్నాడు. అతనే భారత్ కి చెందిన షూటర్ ప్రకాశ్ నంజప్ప. బెంగుళూరుకు చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 198.2 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలుచున్నారు. పతకం పొందటమే కాదు మన జాతీయ పతాకం గ్లాస్గోలో రెపరెపలాడేలా చేశాడు ప్రకాశ్ నంజప్ప. ప్రకాశ్ నంజప్ప తండ్రి కూడా జాతీయ స్థాయి షూటర్. ప్రకాశ్ 2003 లో ఆట నుంచి బ్రేక్ తీసుకుని ఆరేళ్ల పాటు కెనడాలో ఉద్యోగం చేశాడు. 2009 లో మళ్లీ తిరిగి వచ్చి షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు పక్షవాతం నుంచి పతకం దాకా ఎదిగి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు. -
కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం
గ్లాస్గో: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 20వ కామన్వెల్త్ క్రీడలు భారత బృందం ముందు నడవగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వారి సంస్కృతిని ప్రతిబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. క్రీడలు ప్రారంభమైనట్లు రాణీ రెండవ ఎలిజబెత్ ప్రకటించారు. ఈ వేడుకల్లో ప్రధాని డేవిడ్ కామెరూన్, స్కాట్లాండ్ ప్రభుత్వ మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రిన్స్ ఇమ్రాన్ టుంకు, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. ఆ తరువాత క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 3వ తేదీ వరకు జరుగుతాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యూనిసెఫ్ ప్రతినిధిగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో డిజిటల్ స్క్రీన్ మీద మెరిశాడు. ప్రపంచం అంతటా పేద పిల్లల జీవన పరిస్థితులు మెరుగుపడటం కోసం డొనేషన్లు అందజేయమని విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో గ్లాస్గోలో పండగ వాతావరణం నెలకొంది. క్రీడాభిమానులతో నగరం కళకళలాడుతోంది. కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ ఇంతకు ముందు రెండు సార్లు ఆతిథ్యమిచ్చింది. ఇది మూడవసారి. -
పబ్‌పై కుప్పకూలిన హెలికాఫ్టర్
స్కాట్లాండ్లో అతిపెద్ద నగరమైన గ్లాస్గోలోని ఓ పబ్‌పై హెలికాఫ్టర్ గత రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో పబ్‌లో హుషార్‌గా కేరింతలు కొడుతున్న వారిలో అత్యధికులు గాయపడ్డారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు స్కాట్లాండ్లో స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. కుప్పకూలిన హెలికాఫ్టర్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులదని భావిస్తున్నట్లు చెప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్ అత్యంత వేగంతో అకాశంలో పయనిస్తుందని తెలిపింది. అయితే ఆ ఘటనలో మృతులు కూడా ఉండవచ్చని అలాగే క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో పబ్ పాక్షికంగా దెబ్బతిందని వివరించింది. ఆ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపింది.