గ్లాస్గో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయలకు తగిన వేషధారణలో కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు స్వాగతం, వీడ్కోలు పలికే సందర్భంగా అక‍్కడ ఉన్నవారికి అభివాదం చేస్తూ, కరచలనంతో ఉత్సాహం నింపుతారు. అయితే తాజాగా కాప్-26వ శిఖరాగ్ర సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) కోసం ప్రధాని స్కాట్లాండ్‌లో గ్లాస్గో నగరానికి వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే కాప్-26 సదస్సు ముగిసిన అనంతరం ప్రధానిమోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉండే భారతీయులు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు. ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రమ్స్ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని ఆయన కూడా డ్రమ్స్ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
— ANI (@ANI) November 2, 2021
(Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW
Comments
Please login to add a commentAdd a comment