Indian community
-
భారత్, గయానా మధ్య బలమైన బంధం
జార్జిటౌన్: భారత్, గయానా మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలను సంస్కృతి, వంటలు, క్రికెట్ అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాల నడుమ ఉన్న సారూప్యతలు బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొ న్నారు. గయానా రాజధాని జార్జిటౌన్లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీ యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కరీబియన్ దేశమైన గయానా అభివృద్ధిలో ఇండో–గయానీస్ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్, గయానా పరస్పరం పంచుకుంటున్న విలువలే ఇరు దేశాల మధ్య బంధానికి బలమైన పునాదిగా మారాయని వివరించారు. సుసంపన్నమైన, విశిష్టమైన సంస్కృతి ఇరు దేశాలకు గర్వకారణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. మన సాంస్కృతిక వైవిధ్యమే మన బలం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ప్రేమ భారత్–గయానాను ఒక్కటిగా కలిపి ఉంచుతోందని తెలిపారు. క్రికెట్ అంటే ఒక జీవన విధానమని వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు గయానా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తుచేసుకున్నారు. ప్రవాస భారతీయులను ‘రాష్ట్రదూతలు’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సంస్కృతి, విలువలకు వారు రాయబారులని కొనియాడారు. ఇండో–గయానీస్ ప్రజలు రెండు రకాలుగా ఆశీస్సులు పొందారని, వారికి గయానా మాతృభూమి అయితే భారతమాత ప్రాచీన భూమి అని వివరించారు. రెండు దశాబ్దాల క్రితం ఒక యాత్రికుడిగా గయానాలో పర్యటించానని, అప్పటితో పోలిస్తే దేశం ఇప్పుడు దేశం చాలా మారిపోయిందని చెప్పారు. గయానా ప్రజల ప్రేమ, ఆప్యాయ తల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఉద్ఘాటించారు. స్వదేశానికి మోదీ: నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని మోదీ శుక్రవారం భారత్ చేరుకున్నారు. -
Narendra Modi: అన్ని దేశాలతో కలిసి నడుస్తాం
వార్సా/సాక్షి, న్యూఢిల్లీ: ‘‘దశాబ్దాల క్రితం పలు దేశాలతో సమదూరం పాటించిన భారత్ నేడు అన్ని దేశాలతో అనుసంధానమవుతోంది. అందరి అభివృద్ధినీ కాంక్షిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రాత్రి పోలండ్ రాజధాని వార్సాలో భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి. యుద్ధం మానవాళికి మహా ముప్పు. భారత్ అనాదికాలం నుంచి శాంతినే ప్రవచించింది. ఇది యుద్ధాల యుగం కాదంటూ మన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విపత్కర పరిస్థితుల్లో సమష్టిగా ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యమార్గం ద్వారానే శాంతి సాధ్యం. సంక్షోభం అంచుకు చేరిన ఏ దేశానికైనా ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సదా సిద్ధం. సహానుభూతికి సరైన అర్థం ‘భారత్’. కష్టజీవులకు చిరునామా భారత్. బుద్దుని బోధలతో పునీతమైన నేల భారత్. ప్రపంచంలో ఎక్కడ విలయాలు సంభవించినా ‘మానవాళికి సాయం’ మంత్రాన్నే జపిస్తుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడినంతసేపూ ‘మోదీ మోదీ’ నినాదాలతో సభావేదిక మార్మోగింది.వార్సాలో ఘనస్వాగతం అంతకుముందు మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. పోలాండ్ అధికారులు, భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్లో భారతీయ, పోలండ్ కళాకారులు సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి అద్భుతమైన నృత్యరూపకం ప్రదర్శించారు. వారి నృత్యాన్ని మోదీ అభినందించారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి! పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ సెబాస్టియన్ డుడా, ప్రధాని డొనాల్డ్ టస్‌్కతో మోదీ గురువారం సమావేశమవుతారు. శుక్రవారం మోదీ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు.తెలుగు సంఘం ప్రతినిధుల స్వాగతం పోలండ్ తెలుగు అసోసియేషన్ (పోటా) ప్రతినిధులు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్లో తెలుగు తల్లికి వందనం, భరతమాతకు వందనం అంటూ స్వాగతించారు. పోలండ్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 5 వేల మందికిపైగా ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులున్నారు.గుడ్ మహారాజా స్క్వేర్ వద్ద నివాళులుజామ్నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగి్వజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన ‘గుడ్ మహారాజా స్క్వేర్’ వద్ద మోదీ నివాళులరి్పంచారు. నగరంలోని మాంటె కసీనో వార్ మెమోరియల్ సమీపంలోని వలివాడె–కొల్హాపూర్ స్మారకం వద్ద కూడా నివాళులర్పించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణ సమీపంలోని వలివాడె గ్రామం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6 వేల మందికిపైగా పోలండ్ ప్రజలకు ఆశ్రయమిచ్చింది. -
ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్.. జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు. '' ఇవాళ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న కైలియన్ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. #WATCH | French football player Kylian Mbappe is superhit among the youth in India. Mbappe is probably known to more people in India than in France, said PM Modi, in Paris pic.twitter.com/fydn9tQ86V — ANI (@ANI) July 13, 2023 ఇక 2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్లో ఓడి ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్ చేశాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
PM Modi: డ్రమ్స్ వాయించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
గ్లాస్గో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయలకు తగిన వేషధారణలో కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు స్వాగతం, వీడ్కోలు పలికే సందర్భంగా అక్కడ ఉన్నవారికి అభివాదం చేస్తూ, కరచలనంతో ఉత్సాహం నింపుతారు. అయితే తాజాగా కాప్-26వ శిఖరాగ్ర సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) కోసం ప్రధాని స్కాట్లాండ్లో గ్లాస్గో నగరానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కాప్-26 సదస్సు ముగిసిన అనంతరం ప్రధానిమోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉండే భారతీయులు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు. ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రమ్స్ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని ఆయన కూడా డ్రమ్స్ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland (Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW — ANI (@ANI) November 2, 2021 -
డబ్ల్యూఐసీ అధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర్య వేడుకలు
చికాగో: వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ(నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400మంది ఔత్సాహికులు పలు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఐఏఎమ్‌ఏఐఎల్ అధ్యక్షులు జి. శ్రీనివాస రెడ్డి అందించిన సేవలకు గానూ ఆయనను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సభికులను ఉద్ధేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు జి. క్రిష్ణమూర్తి ఈ కార్యక్రమానికి అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికన్ రాజకీయాల్లో భారతీయలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు శ్రీకాంత్ పల్లబోతు అతిధులను ఆహ్వానించగా లింగారెడ్డిగారి ప్రవల్లిక సభకు అధ్యక్షత వహించారు. ట్రెజరర్ మువ్వా కిరణ్ అతిధులకు, సభికులకు ధన్యవాదాలు తెలిపారు. చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయం మాజీ అధ్యక్షులు భీమారెడ్డి, గోపాల శ్రీనివాసన్, ట్రస్టీలు, చింతమ్ సుబ్బారెడ్డి, మెట్టుపల్లి జయదేవ్, అశోక్ లక్ష్మనలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాధికా తోటకూర, పద్మశ్రీ, రేవతి, అనితా సేనాయ్, ప్రీతి, మోనాలి, శోభ, శ్రీహరి, రవి, దివ్య, నరసింహ, శేషు, శివ దాసు, శశాంక, వెంకట పెరుమాళ్లు, సాయి అభిరామ్, పట్టాభి, లక్ష్మీ నారాయణ, వీర వరియాన్, చెన్నయ్య, శివారెడ్డి, సుగంధి, జయంతి, చరణ్ శ్రీ, సుచిత్ర, నివేదిత, రాణి, వంశీ, శివ, రవి, సెల్వల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ ఉపాధ్యక్షులు ఆది తన్నీరు, వైస్ బోర్డు సభ్యులు సృజన్ నైనప్పగారి అధ్యతన కార్యక్రమం సాగింది. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ అధ్యక్షులు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి వాలంటీర్లందిరికి ధన్యవాదాలు తెలియజేశారు. -
భారతీయులకు కృతజ్ఞతలు!
-
భారతీయులకు కృతజ్ఞతలు!
లండన్: బ్రిటిష్ సమాజానికి నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు భారతీయులకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ గొప్ప దేశంగా మన్ననలు అందుకోవడంలో భారతీయులు ఉజ్వలమైన ఉదాహరణ అని ఆమె కొనియాడారు. దీపావళి సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక సందేశాన్ని అందించారు. చెడుపై మంచి, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు విజయం సాధిస్తుందన్న దివ్వెల పండుగ సందేశం.. అన్ని విశ్వాసాల ప్రజల్లో ప్రతిఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు. 'ప్రధానమంత్రిగా ఈ సందర్భంలో మొత్తం దేశం తరుఫున మీకు థాంక్స్ చెప్తున్నా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతి జీవనరంగంలోనూ మీరు విశేషమైన సేవలు అందించారు' అని డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బ్రిగ్జిట్ చర్చల కోసం థెరిసా మే ప్రస్తుతం బ్రసెల్స్‌లో ఉండటంతో భారత సంతతి తొలి బ్రిటన్ కేబినెట్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఆధ్వర్యంలో 0 డౌనింగ్ స్ట్రీట్‌లో గతవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొనలేదు. -
అమరావతికి ఆహ్వానం
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం పిలుపు ♦ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇండియన్ కమ్యూనిటీ సమావేశంలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచశ్రేణిలో నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలు ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో మంగళవారం రాత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘పారిశ్రామిక దిగ్గజాలైన మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా నూతన రాజధాని అమరావతికి వచ్చి కార్యాలయాలు ప్రారంభించండి.. ప్రపంచంలోనే జీవయోగ్య నగరంగా అమరావతిని తీర్చిదిద్దనున్నాం. అక్కడ పరిశ్రమలు పెట్టి ఉత్పాదన పెంచుకోవచ్చు. లాభపడవచ్చు. మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను ఒకే ఛత్రం కింద 21 రోజుల్లో ఇస్తున్నాం’’ అని చెప్పారు. సమావేశంలో బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఎండీ, అమెరికన్ సీఈవో విశాల్ సిక్కా, భారతి ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పిరమిల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్, సుజనాల్ రిన్యువబుల్ ఎనర్జీ ఛైర్మన్ తులసి తంతి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఏపీ బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు పీవీ రమేష్, జి.సాయిప్రసాద్, అజయ్‌జైన్, ఎస్ ఎస్ రావత్‌లతో పాటు జాస్తి కృష్ణకిషోర్, కార్తికేయ మిశ్రా ఉన్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో ‘ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సీఎంప్రసంగిస్తూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని పనిచేస్తున్న తీరు, రాజధాని నిర్మించుకునేందుకు దక్కిన అరుదైన అవకాశాన్ని వివరించారు. అమరావతి భూముల సమీకరణ విధానంపై సదస్సులో పలువురు ప్రముఖులు ఆసక్తి కనబర్చారు. ఏపీ పర్యాటకంపై శ్రీలంక ప్రధాని ఆసక్తి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకరంగంలో ఉన్న అవకాశాలపై శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే ఆసక్తి కనబరిచారు. రణిల్ విక్రమ సింఘే, ఆర్థిక మంత్రి రవి కరుణనాయకే, బెల్జియం ప్రిన్సెస్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శ్రీలంక ప్రధానమంత్రి విందుకు ఆహ్వానించారు. సదస్సులో సీఎంని కలిసిన టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఏపీలో విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన నెస్లే సీఈవో పౌల్ బుల్కె పాల ఉత్పత్తులు, కాఫీ సెక్టారులలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. కేపీఎంజీ నెదర్లాండ్ చైర్మన్ రిచర్డ్ రెఖేతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సీఎం తీరప్రాంత అభివృద్ధిలో నెదర్లాండ్ సాధించిన విజయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శ్రేయ్ ఇంటర్నేషనల్ ఫండ్ మేనేజర్స్ ఎండీ హేమంత్ కనోరియాసీఎంతో సమావేశమై ఏపీలో మౌలిక వసతులు, తయారీ రంగంలో ఆసక్తి చూపారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సర్ లెజెక్ బోరీ స్యూయిజ్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ-కేంబ్రిడ్జి వర్సిటీ పరస్పర సహాయ సహకారాలపై అధ్యయనానికి వర్సిటీ నుంచి 18 మంది స్కాలర్స్‌ను త్వరలో రాష్ట్రానికి పంపనున్నటు వీసీ చెప్పారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని సీఎంతో సమావేశమై ప్రజా విధానాలు, వాణిజ్యం, పోటీతత్వంలో ఏపీకి ఉన్న అవకాశాలను శోధిస్తున్నామని, త్వరలోనే నివేదిక అందిస్తామని తెలిపారు. ఏపీని విద్య, వైజ్ఞానిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్ వర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు అనుబంధంగా ఉన్న లీ ఖాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ముందుకొచ్చింది. -
'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్‌వాలా చెప్పినా చేశారు'
భారత్‌లో ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు, ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీ.. మంగళవారం అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసింగించారు. మోదీ ఏమన్నారంటే.. సిద్ధి, ప్రసిద్ధిలో చాలా తేడా ఉంటుంది. ఏం చేసినా.. ప్రసిద్ధి వస్తుంది గానీ, సిద్ధి మాత్రం అంత సులభంగా రాదు కావాలంటే ప్రసిద్ధులు కావచ్చుగానీ భూమ్మీద మార్పు మాత్రం తేలేరు 50 ఏళ్ల కాలంలో ఒకే తరం కళ్ల ముందు.. ఒక దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లచ్చు అనేదానికి సింగపూర్ మంచి ఉదాహరణ భారత్ గొప్ప దేశం, విశాలమైన దేశం, 125కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలి మన దేశం ఈ పని చేయలేదా? చేయాలా.. వద్దా? ఇక్కడి ప్రజలకు భూమిపై హక్కుందా లేదా? మహాత్మాగాంధీ ఒక్క విషయం మీదే చాలా చెప్పేవారు.. అదే స్వచ్ఛత, శుభ్రత స్వాతంత్ర్యం, శుభ్రత ఏది కావాలంటే.. నేను ముందు శుభ్రతకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పేవారు ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది.. మన దేశం ఇలా దుర్భరంగా ఉండకూడదని ప్రపంచం మారుతోంది భారత్ మారాలా.. వద్దా? మంచి విషయం ఏమిటంటే, 125 కోట్లమంది దేశవాసులు మారాలని నిశ్చయించుకున్నారు ఏదైనా దేశం కేవలం ప్రభుత్వాలతో ఎదగదు.. ప్రతి ఒక్కళ్ల మన సంకల్పంతో, వాళ్ల కృషితో, వాళ్ల త్యాగాలు, తపస్సుతోనే ఎదుగుతుంది. అప్పుడే దేశ నిర్మాణం సాధ్యం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని ప్రతి భారతీయుడికి అనిపిస్తోంది మనకు ఏమైనా దొరికిందంటే.. దాన్ని వదలాలని మనసుకు అనిపించదు మనం ప్రయాణం చేసేటప్పుడు మన సీటు రిజర్వ్ అయి.. పక్క సీటు ఖాళీ ఉంటే మన బ్యాగ్ అక్కడ పెట్టేస్తాం. అది మన సీటు కాదు, అయినా వేరేవాళ్లు రావడం ఆలస్యం అయితే మనం అక్కడ పెట్టేస్తాం. వాళ్లు వచ్చాక చూద్దాం అనుకుంటారు అది మనది కాదు కానీ కొన్ని క్షణాలు వాడుకోడానికి దొరికితే వదలబుద్ధి కాదు ఇది మనిషి ప్రవృత్తి. కానీ నేను మాత్రం మన దేశవాసుల మనసు ఏంటో చూశాను.. భారతీయులు మంచి ఆలోచన చేస్తున్నారు ఓసారి నేను చెప్పాను.. మీరు ఇళ్లలో గ్యాస్ పొయ్యి వెలిగిస్తారు. ఆ సిలెండర్లో 500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మీరు ఆ 500 రూపాయలు భరించగలిగే పరిస్థితిలో ఉంటే సబ్సిడీ వదిలేయొచ్చు కదా అన్నాను ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 40 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా వదిలేసుకున్నాయి ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు.. ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారు అది కూడా.. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చెబితే చేయడం కాదు.. మామూలు చాయ్ అమ్ముకునేవాడు చెప్పినా చేశారు మన దేశం స్వామి వివేకానంద కలలుగన్న భారతమాతగా రూపొందుతోంది.. విశ్వగురువుగా మారుతోంది మన దేశంలో ఎన్ని విశేషాలు, ఎన్ని శషభిషలు ఉన్నాయో.. అన్నే సింగపూర్‌లో కూడా ఉన్నాయి. అయినా కూడా.. ప్రతి ఒక్కరూ సింగపూర్ వాసి. ప్రతి ఒక్కరూ ఈ దేశనిర్మాణాన్ని భుజాలకు ఎత్తుకున్నారు మేం కూడా ఈ విషయంలో సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాం వసుధైక కుటుంబం.. అనే మంత్రం ఎక్కడినుంచి వచ్చిందో అక్కడ అదే భావన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది, బలోపేతం చేస్తుంది. ఆ భావనను ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషిచేస్తున్నాం -
'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్‌వాలా చెప్పినా చేశారు'
-
'ఆ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా'
కైరో: ఎన్ని కష్టాలు ఎదురైనా మనం చేపట్టిన పని కొనసాగించుకుంటూ వెళ్లి పోవాలని... ఎక్కడా ఆపకూడదని బిగ్‌బీ అమితాబ్ స్పష్టం చేశారు. కొనసాగిస్తున్న పనిని ఓ వేళ ఆపితే జీవితం అయిపోనట్లే అని భావించాలన్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఇండియా బై ది నైలు' ఫెస్టివల్లో అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ను ఈజిప్టులోని భారతీయ సమాజం సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎన్నారైలతో అమితాబ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు అమితాబ్ సమాధానం ఇస్తూ... తన జీవితంలో ఎదురైన పలు సమస్యలను ఎలా అధిగమించుకుంటూ వచ్చిన తీరును వారికి వివరించారు. 2000 ఏడాదిలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు... వాటిని తాను ఏ విధంగా ఎదురొడ్డి నిలిచి పోరాడినది ఆయన విశదీకరించారు. ఈ రోజు మీ ముందు ఇలా నిండైన వ్యక్తిత్వంతో నిలబడి ఉన్నానంటే అందుకు 2000 నాటి సమస్యలు ఓ కారణమని అమితాబ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈజిప్టులో భారత రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ... అమితాబ్ తన అమూల్యమైన సమయాన్ని విదేశంలోని భారతీయుల కోసం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అమితాబ్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. భారత్ విదేశీ పర్యాటకులకు స్వర్గధామం అనే ముఖ్య ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఈజిప్టులో ఇండియా బై ది నైలు పండగను నిర్వహిస్తుంది. ఈ పండగ 18 రోజుల పాటు జరగనుంది. అందులోభాగంగా అమితాబ్ 3 రోజుల పాటు ఈజిప్టులో పర్యటిస్తున్నారు. భారత్‌లో పర్యటించే విదేశీ పర్యాటకుల వల్ల కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. అయితే భారత్‌లో తీవ్రవాదుల దాడులు వల్ల ఈజిప్టు వాసులు పర్యటించే సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్రం... ఇండియా బై ది నైలు పండగను నిర్వహిస్తుంది.