
లండన్: బ్రిటిష్ సమాజానికి నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు భారతీయులకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ గొప్ప దేశంగా మన్ననలు అందుకోవడంలో భారతీయులు ఉజ్వలమైన ఉదాహరణ అని ఆమె కొనియాడారు.
దీపావళి సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక సందేశాన్ని అందించారు. చెడుపై మంచి, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు విజయం సాధిస్తుందన్న దివ్వెల పండుగ సందేశం.. అన్ని విశ్వాసాల ప్రజల్లో ప్రతిఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు.
'ప్రధానమంత్రిగా ఈ సందర్భంలో మొత్తం దేశం తరుఫున మీకు థాంక్స్ చెప్తున్నా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతి జీవనరంగంలోనూ మీరు విశేషమైన సేవలు అందించారు' అని డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బ్రిగ్జిట్ చర్చల కోసం థెరిసా మే ప్రస్తుతం బ్రసెల్స్‌లో ఉండటంతో భారత సంతతి తొలి బ్రిటన్ కేబినెట్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఆధ్వర్యంలో 0 డౌనింగ్ స్ట్రీట్‌లో గతవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment