
చికాగో: వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ(నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400మంది ఔత్సాహికులు పలు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఐఏఎమ్‌ఏఐఎల్ అధ్యక్షులు జి. శ్రీనివాస రెడ్డి అందించిన సేవలకు గానూ ఆయనను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సభికులను ఉద్ధేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు జి. క్రిష్ణమూర్తి ఈ కార్యక్రమానికి అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికన్ రాజకీయాల్లో భారతీయలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు శ్రీకాంత్ పల్లబోతు అతిధులను ఆహ్వానించగా లింగారెడ్డిగారి ప్రవల్లిక సభకు అధ్యక్షత వహించారు. ట్రెజరర్ మువ్వా కిరణ్ అతిధులకు, సభికులకు ధన్యవాదాలు తెలిపారు.
చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయం మాజీ అధ్యక్షులు భీమారెడ్డి, గోపాల శ్రీనివాసన్, ట్రస్టీలు, చింతమ్ సుబ్బారెడ్డి, మెట్టుపల్లి జయదేవ్, అశోక్ లక్ష్మనలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాధికా తోటకూర, పద్మశ్రీ, రేవతి, అనితా సేనాయ్, ప్రీతి, మోనాలి, శోభ, శ్రీహరి, రవి, దివ్య, నరసింహ, శేషు, శివ దాసు, శశాంక, వెంకట పెరుమాళ్లు, సాయి అభిరామ్, పట్టాభి, లక్ష్మీ నారాయణ, వీర వరియాన్, చెన్నయ్య, శివారెడ్డి, సుగంధి, జయంతి, చరణ్ శ్రీ, సుచిత్ర, నివేదిత, రాణి, వంశీ, శివ, రవి, సెల్వల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ ఉపాధ్యక్షులు ఆది తన్నీరు, వైస్ బోర్డు సభ్యులు సృజన్ నైనప్పగారి అధ్యతన కార్యక్రమం సాగింది. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ అధ్యక్షులు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి వాలంటీర్లందిరికి ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment