drums
-
మొక్కలను కాపాడే స్మార్ట్ కుండీ ఇదే!
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్‌ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!పిల్లల కోసం ఫిట్నెస్ వాచీ..రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్‌బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్టీఈ’ పేరుతో ఈ ఫిట్నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్‌బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!నానోబాక్స్ మినీ డ్రమ్స్..మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్‌ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.‘రాజ్మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్‌ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్కు ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే! -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
వీడు మాములోడు కాదు, డ్రమ్ములు అదిరిపోవాల్సిందే
-
Karnataka: డ్రమ్ వాయించిన ప్రధాని మోదీ
బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం కర్ణాటకలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా.. కలబురాగి(గుల్బర్గా)జిల్లాలో ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన సంప్రదాయ డ్రమ్ వాయించి.. అక్కడి ప్రజల్లో హుషారు నింపారు. ప్రధాని మోదీ డ్రమ్స్ వాయిస్తున్నంత సేపు.. అక్కడున్న జనాలంతా చప్పట్లు, విజిల్స్‌తో మారుమోగించారు. వేదిక మీద ఉన్న అధికారులు సైతం చప్పట్లతో ప్రధానిని ఎంకరేజ్ చేశారు. అయితే ప్రధాని మోదీ ఇలా వాయిద్యాలు వాయించడం కొత్తం కాదు. దేశంలోనే కాదు.. విదేశీ పర్యటనల్లోనూ ఆయన ఇలా సందడి చేశారు గతంలో. ఆపై ఆయన ప్రసంగిస్తూ.. తమది అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం కలిసొచ్చే అంశమని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ బెనిఫిట్, డబుల్ వెల్ఫేర్ అని, డబుల్ ఫాస్ట్ పేస్డ్ డెవలప్మెంట్ అని.. ఇందుకు కర్ణాటక మంచి ఉదాహరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. #WATCH | Karnataka: PM Narendra Modi plays traditional drum during a public rally in Kalaburagi district pic.twitter.com/vyfgKAVQnO — ANI (@ANI) January 19, 2023 భారతదేశం అభివృద్ధి 75 సంవత్సరాలు సాగుతోంది. ఇప్పుడు దేశం రాబోయే 25 సంవత్సరాలపై దృష్టి సారించి ముందుకు సాగుతోంది. ఈ 25 సంవత్సరాలు దేశంలోని ప్రతి పౌరునికి అమృత కాలమే!. ఈ కాలంలోనే మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించుకోవాలి అని ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేనెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈనెలలో ప్రధాని కర్ణాటకలో పర్యటించడం ఇది రెండోసారి. వారం కిందటేనేషనల్ యూత్ ఫెస్టివల్ కోసం ఆయన హుబ్బలికి వచ్చారు. ఇక గురువారం.. కలబురాగి జిల్లాలోని కొడెకల్‌లో నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుతో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను ప్రారంభించారాయన. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తావార్చంద్ గెహ్లాత్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబ, రాష్ట్ర మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఇదీ చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారేం కాదు! -
Viral Video: టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. వినూత్న డ్రమ్స్ తో అదరగొట్టేశాడు
-
చెర్రీ స్వరూప్ ..ఈ బుడతడి సౌండే వేరు!
ప్లేస్ ఏదైనా ఆ బుడ్డోడు స్టిక్ పట్టాడంటే బీట్ అదిరిపోవాల్సిందే.. బేస్ కాస్త పెంచి బాదాడంటే బాక్సులు బద్దలైపోవాల్సిందే.. ఆ సౌండ్‌కి ఎవరైనా ముగ్దులైపోవాల్సిందే. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ రేంజ్ అది మరి. మూడేళ్లకే స్టేజ్ షోలు ప్రారంభించి, వీక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు. మేటి సంగీత కళాకారులతో మన్ననలు అందుకుని అనేక అవార్డులు, సత్కారాలు పొందుకున్నాడు. విజయవాడ కల్చరల్: సంగీతం ఒక మహా సముద్రం.. సాధనే అందులో ప్రావీణ్యత వచ్చేలా చేస్తుంది.. సరైన శిక్షణ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ఇక తండ్రే మంచి శిక్షకుడైతే ఇక తిరుగుండదు. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ ఇదో కోవలోకి వస్తాడు. తండ్రి ప్రోద్బలంతో మూడేళ్లప్పుడే స్టిక్స్ చేతబట్టిన ఈ బుడతడు.. డ్రమ్స్ వాయించడంలో విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. వెస్ట్రన్ ఐనా, జానపదమైనా, శాస్త్రీయమైనా బీట్ ఏదైనా తనకు కొట్టిన పిండి అని నిరూపిస్తున్నాడు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే వందకుపైగా ప్రదర్శనలతో అదరగొట్టేశాడు. ప్రస్థానం సాగిందిలా.. చెర్రీ చిన్నతనంలో తండ్రి ముత్యాల పరమేష్‌తో పాటు డ్రమ్స్ వాయించే కార్యక్రమంలో పాల్గొనేవాడు. తండ్రి వాయించే శబ్దాలకు అనుగుణంగా కాళ్లు చేతులు, లయబద్ధంగా కదిలించేవాడు. కుమారుడిలోని తాళ జ్ఞానాన్ని గుర్తించిన పరమేష్ శిక్షణ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే తండ్రిని మించిన శిష్యుడయ్యాడు. పట్టణం, నగరం అన్న తేడా లేకుండా దేశంలోని అనేక చోట్ల స్టేజ్ షోలు ఇచ్చాడు. అతిరథ మహారథుల మధ్య అనేక సార్లు తన ప్రతిభను ప్రదర్శించాడు. అభినందనల మందార మాల.. చెర్రీలోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ డ్రమ్స్ ప్లేయర్ శివమణి, వందేమాతరం శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు కోటి, దేవిశ్రీ ప్రసాద్‌లు పలు సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. సినీ గేయ రచయత, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు చిరంజీవి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శైవపీఠాధిపతి శివస్వామి తోపాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అవార్డులు ఇవి.. చెర్రీలోని ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు బాలరత్న, బాల ప్రతిభ, వండర్ కిడ్ పురస్కారాలతో సత్కరించాయి. -
Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఏక్నాథ్ షిండే తన సొంత నియోజకవర్గమైన థానే స్వగృహానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. బ్యాండు, మేళాలు, బాణసంచా పేలుస్తూ శిండేకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి లతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. షిండే రాక సందర్భంగా ఆమె స్వయంగా డ్రమ్స్ వాయించి భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యాండ్, పాటు లతా షిండే డ్రమ్స్ వాయించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Wife of Maharashtra CM Eknath Shinde, Lata Shinde, beat a drum to welcome him in Thane yesterday, 5th July. He was arriving at his home for the first time after becoming the CM of the state and received a warm welcome from his supporters. pic.twitter.com/0yzZUDJvtY — ANI (@ANI) July 6, 2022 ఏ ఒక్క శివసైనికుడికి అన్యాయం జరగదు కాగా షిండే తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ముంబై నుంచి థానేకు బస్సులో బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు థానే చేరుకున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన కార్యకర్తలు భారీ వర్షంలో అలాగే నిలుచుండి స్వాగతం పలికారు. సుమారు నాలుగు గంటల పాటు స్వాగత ర్యాలీ జరిగింది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే స్మృతి స్ధలంవద్ద షిండే నివాళులర్పించారు. ఈ సందర్బంగా షిండే మాట్లాడుతూ.. దివంగత హిందు హృదయ్ సమ్రాట్, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆశీర్వాదంతో రాష్ట్రంలో శివసేన–బీజేపీ ప్రభుత్వం అస్థిత్వంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఏ ఒక్క శివసైనికుడికి కూడా అన్యాయం జరగదని నూతన ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. చదవండి: Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే ట్రాఫిక్ జామ్ శిండే స్వాగత కార్యక్రమం కారణంగా థానే–ముంబై సరిహద్దులో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చింది. గత్యంతరం లేక వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఒక పక్క భారీ వర్షం, మరోపక్క రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా అప్పటికే థానేలో ట్రాఫిక్ మందకొడిగా సాగుతోంది. దీనికి తోడు సీఎంకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, కటౌట్లు ట్రాఫిక్‌ను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. -
పిట్టకొంచెం కూతఘనం
-
ఆగిన ‘డప్పు’ చప్పుడు
డప్పు కళను ఎల్లలు దాటించిన కళాకారుడు.. చేతిలో ఢం ఢం మని మోగే శబ్దాన్నే తన గుండె చప్పుడుగా మార్చుకున్న ఘనుడు.. అట్టడుగున మగ్గిపోతున్న డప్పు విద్యకు కొత్త హంగులు అద్ది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన విద్వాంసుడు.. స్వతహాగా ప్రదర్శనలివ్వడమే కాక, దేశ విదేశాల్లో అనేక మందికి తరీ్ఫదునిచ్చి ప్రోత్సహించిన కళాత్ముడు.. ఆ డప్పునకు ప్రాణ హితుడు.. డప్పునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సూర్య భగవంతరావు ఇక లేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘంటసాల(అవనిగడ్డ): డప్పు చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకున్న హంస అవార్డు గ్రహీత కుంపటి సూర్య భగవంతరావు(72) గుండె పోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంకు చెందిన కుంపటి సూర్య భగవంతరావు (డప్పు భగవంతరావు) మరణ వార్త తెలుసుకున్న ప్రజా నాట్యమండలి బృందం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ కండువా కప్పి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఘంటసాల మండల, నియోజకవర్గ పరిధిలోని పలువురు కళాకారులు భగవంతరావు భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. డప్పు కళాకారుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చిట్టూర్పు ఈపూరివానిగూడెంలోని ఆయన స్వగృహంలో ఉంచగా.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భగవంతరావుకు భార్య సువార్తమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదీ ‘సూర్య’ ప్రస్థానం.. చిన్న నాటి నుంచే డప్పుపై ఆసక్తి పెంచుకొని ఆ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డప్పుపై ఉన్న మమకారంతో వివిధ శబ్దాలను పలికిస్తూ.. ఆ విద్యలో ఆరితేరారు. మూస పద్ధతిలో డప్పు వాయించడానికి స్వస్తి పలికి.. కొత్త రీతుల్లో ఆడుతూ, పాడుతూ డప్పు కొడుతూ భగవంతరావు క్రమక్రమంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ డప్పు శబ్దాన్ని వినాలని, ఆయన చేసే విన్యాసాలను చూడాలని ఆశించే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోవడంతో భాషా, భావాలకు అతీతంగా భగవంతరావు ప్రదర్శనలకు వీక్షకులు హాజరయ్యేవారు. 15 ఏళ్ల పాటు ప్రజా నాట్యమండలిలో పని చేసిన భగవంతరావు ఉదయ్‌పూర్‌లో జరిగిన ఉత్సవాల్లో చేసిన ప్రదర్శన చూసిన ఫ్రాన్స్ దేశస్తులు.. వారి దేశానికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించుకున్నారు. సినిమాలలో అవకాశం.. డప్పు కళలో ప్రావీణ్యం సాధించడంతో సినిమాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు సన్నివేశాల్లో కూడా భగవంతరావు నటించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర, నవయుగం, మరో క్విట్ ఇండియా, కూలన్న, వర్షం తదితర సినిమాల్లో తన ప్రతిభను కనబరిచారు. డప్పు కళ అధ్యాపకునిగా.. డప్పుకళను ప్రోత్సహించేందుకు జానపద కళల కింద ఒక కోర్సుగా ఉన్న డప్పు కళను అందరికీ తెలిసేలా చేశాడు. డప్పు కళ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 32 ఏళ్లపాటు విద్యార్థులకు తరీ్ఫదునిచ్చారు. అంతేకాక గ్రామాల్లో వేలమందికి నేరి్పంచి సుమారు 20 వేల మంది డప్పు కళాకారులను తయారు చేశారు. సేవలకు గుర్తింపు.. డప్పు భగవంతరావు సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వాలు 1992లో హంస అవార్డు, ధర్మనిధి పురస్కారం, 1998లో డప్పు జానపద రత్న, 1994లో డప్పు విద్వాన్, 1992లో డప్పు ప్రవీణ, 1991లో డప్పు విద్య ప్రవీణ అవార్డులతో సత్కరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీల వారు వందలాది అవార్డులను బహూకరించారు. -
MLA Roja: డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని పేర్కొన్నారు. -
డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
-
PM Modi: డ్రమ్స్ వాయించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
గ్లాస్గో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయలకు తగిన వేషధారణలో కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు స్వాగతం, వీడ్కోలు పలికే సందర్భంగా అక్కడ ఉన్నవారికి అభివాదం చేస్తూ, కరచలనంతో ఉత్సాహం నింపుతారు. అయితే తాజాగా కాప్-26వ శిఖరాగ్ర సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) కోసం ప్రధాని స్కాట్లాండ్లో గ్లాస్గో నగరానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కాప్-26 సదస్సు ముగిసిన అనంతరం ప్రధానిమోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉండే భారతీయులు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు. ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రమ్స్ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని ఆయన కూడా డ్రమ్స్ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland (Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW — ANI (@ANI) November 2, 2021 -
దరువేస్తూ చిందేస్తూ సీఎం డ్యాన్స్ అదుర్స్
సాక్షి, బెంగళూరు : జాతీయ పార్టీల అధ్యక్షుల రాకతో కర్ణాటక కళకళ లాడుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో అడుగుపెట్టి కాంగ్రెస్‌పై, సీఎం సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు చేస్తుండగా తాజగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగారు. సోమవారం కర్ణాటక వచ్చిన ఆయన గోడచిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బెలగావిలోని సౌందట్టి ప్రాంతంలో యల్లమ్మ ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం సిద్ద రామయ్య సాంప్రదాయ డప్పులపై దరువులు వేశారు. దరువు వేసే క్రమంలో తన ఊపును ఆపుకోలేక సిద్ద రామయ్య చిందేశారు. దరువేస్తూ చిందేస్తున్న సిద్దరామయ్య ఆ వీడియో ఇప్పుడు హల్చల్ అయింది. ఒకసారి మీరు ఆ వీడియోను చూడండి. -
హిట్ డైరెక్టర్ కొడుకు ఇరగదీశాడు..!
భలే భలే మొగాడివోయ్ సినిమాతో స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిన దర్శకుడు మారుతి. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్నిఅందుకున్న మారుతి త్వరలో నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశాడు. నిర్మాతగా, దర్శకుడిగా సినీ అభిమానులకు సుపరిచితుడైన మారుతి ఫ్యామిలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తాజాగా ఆయన తన వారసుణ్ని అభిమానులకు పరిచయం చేశాడు. డ్రమ్స్ వాయిస్తున్న తన కొడుకు ఆశ్రిష్ వీడియోను ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసిన మారుతి ‘మా అబ్బాయి కొత్త వీడియో’ అంటూ కామెంట్ చేశారు. వీడియోలో మారుతి కొడుకు డ్రమ్స్ వాయించడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. తండ్రి కామెడీ ఎంటర్ టైనర్లతో ఆకట్టుకుంటుంటే ఆశ్రిష్ సంగీత వాయిద్యాలతో మైమరపిస్తున్నాడు. ఈ కుర్రాడి జోరు చూస్తుంటే టాలీవుడ్‌కి త్వరలో సంగీత దర్శకుడు పరిచయం అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. My son's new video ... pic.twitter.com/X4IJRIuwMO — Maruthi Dasari (@DirectorMaruthi) 29 October 2017 -
హిట్ డైరెక్టర్ కొడుకు ఇరగదీశాడు...!
-
డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం
కరీంనగర్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఉత్సాహంగా దరువేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.రాజయ్య ఆదివారం డప్పు పట్టుకుని దరువేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని డప్పు వాయించారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా పాల్గొన్నారు.