
గ్లాస్గో సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ మంగళవారం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, అపరకుబేరుడు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధి, భూతాపోన్నతిని తగ్గించే చర్యలపై చర్చలు జరిపారు. అనంతరం నేపాల్ ప్రధాని దేవ్‌బా తో మోదీ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు చతురోక్తులు విసురుకున్నారు. ‘మా దేశంలో మీకు అత్యధిక జనాదరణ ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ తెలపగా మోదీ ‘థ్యాంక్యూ, థాంక్యూ’ అంటూ బదులిచ్చారు. అనంతరం బెన్నెట్ తమ యమినా పార్టీలో చేరాలంటూ మోదీని ఆహ్వానించారు. దాంతో, ఇరువురు నేతలు సరదాగా నవ్వుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment