దుమ్మురేపిన 'బంగారు' బోల్ట్
గ్లాస్గోవ్: ఒలంపిక్ క్రీడల్లో ఆరుసార్లు విజేతగా నిలిచిన జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ కామన్ వెల్త్ క్రీడల్లో తొలి బంగారు పతాకాన్ని సొంతం చేసుకున్నాయి.
గ్లాస్గోవ్ లోని హాంప్ డెన్ పార్క్ లో జరిగిన 4X100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ కామన్ వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
జమైకాకు చెందిన జాసన్ లివర్ మోర్, కెమర్ బెయిలీ-కోల్, నికెల్ ఆస్తమీడ్ కలిసి బోల్ట్ ఈ ఘనతను సాధించారు.
కామన్ వెల్త్ క్రీడల్లో పొల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే వ్యక్తిగత ఈవెంట్లలో రాణించలేకపోవడం విచారంగా ఉంది అని బోల్ట్ అన్నారు.