నికోబార్‌ వద్ద భారీ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ కార్గో ప్రాజెక్ట్‌  | Govt invites EoIs for Rs 41k cr Great Nicobar Port | Sakshi
Sakshi News home page

నికోబార్‌ వద్ద భారీ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ కార్గో ప్రాజెక్ట్‌ 

Published Mon, Jan 30 2023 3:25 PM | Last Updated on Mon, Jan 30 2023 3:33 PM

Govt invites EoIs for Rs 41k cr Great Nicobar Port - Sakshi

న్యూఢిల్లీ: గ్రేట్‌ నికోరాబ్‌ ఐలాండ్‌ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌’కు కేంద్ర షిప్పింగ్‌ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్‌ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్‌ ప్రాజెక్ట్‌ వార్షికంగా 16 మిలియన్‌ కంటెయినర్‌ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది.

మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్‌ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్‌పోర్ట్, టౌన్‌షిప్, పవర్‌ ప్లాంట్‌ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్‌ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్‌ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement