40 నిమిషాలకో రేప్ కేసు!
పారిస్: ఫ్రాన్స్ లో లైంగిక వేధింపుల నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రతి 40 నిమిషాలకు లైంగిక వేధింపులు లేదా అత్యాచార కేసులు నమోదవుతున్నాయని తాజా గణంకాలు వెల్లడించాయి. 2014లో ఫ్రాన్స్ లో 12,700 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2010తో పోల్చుకుంటే లైంగిక నేరాలు 18 శాతం పెరిగినట్టు ఫ్రెంచ్ నేర పరిశీలనా సంస్థ ఓఎన్డీఆర్పీ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
మైనర్లపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా 20 శాతం పెరిగాయి. నాలుగేళ్ల వ్యవధిలో ఈ కేసులు 5,751 నుంచి 6,936 ఎగబాకాయి. ఒక్క పారిస్ లోనే గతేడాది 600 లైంగిక వేధింపులు, రేప్ కేసులు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల నేరాలు అధికమయ్యాయని ఓఎన్డీఆర్పీ డైరెక్టర్ క్రిస్టోపి సోలెజ్ తెలిపారు. తాము విడుదల చేసిన తాజా గణంకాలు మొత్తం కేసుల్లో 10 శాతం మాత్రమేనని వెల్లడించారు.