Mahesh Babu Back To Hyderabad : Sarkaru Vaari Paata Completes Goa Schedule - Sakshi
Sakshi News home page

‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్‌ పూర్తి 

Published Thu, Aug 26 2021 7:45 AM | Last Updated on Thu, Aug 26 2021 1:20 PM

Superstar Mahesh Babu Back To Hyderabad From Goa Schedule - Sakshi

గోవాలో ‘సర్కారువారి పాట’ షెడ్యూల్‌ ముగిసింది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్‌ గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ బుధవారంతో ముగిసింది. ఈ గోవా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేశారు.

ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మొదలైన గోవా షెడ్యూల్‌ మరో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. 

చదవండి : ఎస్‌... అవన్నీ వదంతులే!
‘బంగార్రాజు’ మూవీ షూటింగ్‌ స్టార్‌ చేసిన అక్కినేని హీరోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement