ఇంకా వేగంగా ఈదాలని ఉందా?, అయితే.. | Speedo Develops AI Designed Smart Swimsuit Fastskin 4.0 | Sakshi
Sakshi News home page

Fastskin 4.0: ఆక్వామ్యాన్‌ లాంటి సూట్‌.. ఎలా పని చేస్తుందంటే..

Published Mon, Jun 21 2021 7:50 AM | Last Updated on Mon, Jun 21 2021 8:31 AM

Speedo Develops AI Designed Smart Swimsuit Fastskin 4.0 - Sakshi

స్పోర్ట్స్‌ ప్రొడక్టుల ప్రముఖ కంపెనీ స్పీడో.. కొత్త శకానికి నాంది పలికింది. ప్రత్యేకించి ఈత పోటీలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఈ ఆస్ట్రేలియన్‌ కంపెనీ.. ఓ కొత్త సూట్‌ను త్వరలో మార్కెట్‌లోకి తేనుంది. అది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీతో స్విమ్‌సూట్‌ను తయారు చేయించింది. ఈ సూట్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఈత కొట్టే వ్యక్తి తన వేగం కంటే ఎక్కువగా ఈదేందుకు ఈ సూట్‌ ఉపయోగపడుతుంది. 

ఫాస్ట్‌స్కిన్‌ 4.0 పేరుతో తయారు చేసిన ఈ సూట్‌.. ఇప్పటిదాకా ఏ కంపెనీ ఉపయోగించని స్థాయిలో కృత్రిమ మేధస్సు స్థాయిని ఉపయోగించడం విశేషం. అయితే దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండబోవని, క్లియరెన్స్‌ పూర్తైన తర్వాతే దీనిని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయబోతున్నామని స్పీడో వెల్లడించింది. ఇక ‘ఆక్వామాన్‌’ తరహా అటిరేలో ఉన్న ఈ సూట్‌ సాయంతో మనిషి ఈదే వేగం కన్నా  గరిష్టంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
చదవండి: కరోనా పేషెంట్ల కోసం సోఫియా చెల్లి

‘ఆక్వా’ల్యాబ్‌ సాయంతో ఈ సూట్‌ను డెవలప్‌ చేసిన స్పీడో.. 80 శాతం బయోడిగ్రేడెబుల్‌ అని తెలిపింది.ఈ సూట్‌ సెటప్‌లో ఉండే ఎక్సోస్కెలిటన్‌ సిస్టమ్‌ వల్లే ఇది సాధ్యమవుతుందని,  షార్క్‌ రెక్కల నుంచి స్ఫూర్తితో ఈ టెక్నాలజీని రూపొందించినట్లు ఆక్వాల్యాబ్‌ వెల్లడించింది. ఇక సూట్‌ మీద ఉండే ఏఐ మైక్రో సెన్సార్లు.. ఈతకు ముందు, ఈత టైంలో, ఈత తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీరం పనితీరును ఏఐ కోచ్‌ క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే మార్కెట్‌లోకి రిలీజ్‌ కాబోతున్న ఈ స్విమ్‌ సూట్‌ను స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో ఉపయోగించాలంటే.. ఆయా దేశాల స్విమ్మింగ్‌ ఫెడరేషన్లు, అసోషియేషన్ల నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది.
చదవండి: ఆన్‌లైన్‌లో స్విమ్‌సూట్‌ బుక్‌ చేయడం ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement