honeymoon
-
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన నటి, మోడల్ కృతిక అవస్థి (ఫొటోలు)
-
Sonakshi Sinha: అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాక్షి (ఫొటోలు)
-
భార్యకు సర్ఫ్రైజ్ ఇవ్వబోయి పేలిపోయాడు..కట్‌చేస్తే అతడు..!
హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుని భార్యకు ఓ పీడకలను అందించాడు. ఇలాంటి సర్ఫ్రైజ్ ఏ భర్తి ఇంతవరకు ఇచ్చి ఉండడేమో..!. కానీ ఇలాంటి భయానక పరిస్థితి ఏ భార్యకు ఎదురుకాకూడదు. ఈ ఆ ఘటన నుంచి ఆ భార్య ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు కూడా. అసలేం జరిగిందంటే..కెనడాకు చెందిన నూతన వధూవరులు లెవీ స్టాన్ఫోర్డ్, భార్య అమీ హనీమూన్‌కు వెళ్లారు. అతను తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్లాడు. 23 ఏళ్ల లెవీ తన హనీమూన్ గుర్తుండిపోయేలా చేయడానికి, భార్య అమీని ఆకట్టుకోవడానికి చక్కటి ప్లాన్ వేశాడు. ఐతే లెవీ చిన్నతనంలో గ్రామంలో పెరగడంతో అతడికి పేలుడు పదార్థాలు జీవితంలో ఓ భాగం కూడా. అందువల్ల ఒక పరికరాన్ని సిద్ధం చేశాడు. ఇది సరస్సులో పేలి ఒక అందమైన నీటి ఫౌంటైన్‌ని సృష్టిస్తుంది. అదే చేద్దాం అనుకున్నాడు లెవీ. అంతేగాదు ఆ పేలుడు శబ్దాన్ని రికార్డు చేయమని తన సోదరుడకి కూడా చెప్పాడు. అతను పరికరాన్ని నీటిలోకి విసిరేద్దాం అనుకుంటుండగా..ఇంకా 60 సెకన్లు ఉందనంగా దురదృష్టవశాత్తు..చేతిలోనే అది పేలిపోయింది. లెవీ ఆ భయానక ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. రక్తంలో తడిసిపోయి బట్టలన్నీ ఊడిపోయాయి. చచ్చిపోతున్నంత బాధను అనుభవించాడు. శరీరమంతా గాయలమయం అయిపోయింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మునుపటిలా ఆర్బరిస్ట్గా పనిచేయలేకపోయాడు. అయితే అతడి ప్రియురాలు, అమీ మాత్రం అతడిని వదిలి వెళ్లిపోలేదు. ఈ చేదు ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యింది. ఈ ఘటనలో లెవీ ఎడమ చేయి కోల్పోవడమే గాక చాలా భాగాలకు తొడ చర్మాన్ని కత్తిరించి అతికించడం జరిగింది. చెప్పాలంటే శరీరం అంతా గాయాలతో చిందరవందరగా ఉంది. అయినా అతడి భార్య లెవీ వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాచుకుంది. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించింది అమీ. అయితే ఈ చేదు ఘటన తర్వాత ఇరువురు వాదులాడుకోలేదని, భగవంతడు ప్రసాదించిన రెండో జీవితాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేశామని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు లెవీ. ఇప్పుడు ఆ జంటకు నలుగురు పిల్లలు కూడా. ప్రస్తుతం అతడు ఈ ఘటనతో మోటివేషనల్ స్పీకర్, కమెడియన్, ఎంటర్టైనర్గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి మరుపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని చేసే పనులు మర్చిపోలేని పీడకలలా విధి మార్చేసినా..తట్టుకుని నిలబడి తమ బాంధవ్యాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంది ఈ జంట. పైగా పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలిచి ఎందరిగో స్ఫూర్తినిచ్చారు. ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పింది ఈ జంట. (చదవండి: సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!) -
ప్రియుడితో పెళ్లి.. హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్!
బాలీవుడ్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పాక్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవల హీరామండి భామ సోనాక్షి సిన్హా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సినీతారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.తాజాాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. కాగా.. జూన్ 23న ముంబయిలో జరిగిన వివాహ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, కాజోల్, రిచా చద్దా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..
-
హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?
మెగా కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి హడావుడి పూర్తిగా అయిపోయింది. దీంతో ఎంచక్కా కొత్తజంట టూర్ ప్లాన్ చేశారు. వివాహం తర్వాత తొలిసారి ఫారిన్ చెక్కేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది హనీమూన్ అని మెగా ఫ్యాన్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: 'ఏ మాయ చేసావె' నటి కన్నుమూత.. చివరి వీడియో వైరల్) ఈ ఏడాది జూన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని చాలామందికి షాకిచ్చారు. ఎందుకంటే వీళ్లిద్దరూ గత ఆరేడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటపడలేదు. దీంతో ఎంగేజ్మెంట్ హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత నవంబరు 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబర్ అంతా కూడా పెళ్లి హడావుడి, మిగతా కార్యక్రమాలతో బిజీ అయిపోయిన న్యూలీ వెడ్డింగ్ కపుల్.. ఇప్పుడు ఎంచక్కా వెకేషన్‌కి వెళ్లిపోయారు. అయితే ఇది హనీమూన్ ట్రిప్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బహుశా తమకు అచ్చొచ్చిన ఇటలీ వెళ్లారా? లేదంటే మాల్దీవులుకి ఏమైనా వెళ్లారా అనేది ఒకటి రెండు రోజుల్లో వరుణ్, లావణ్య పోస్ట్ చేసే ఫొటోలు బట్టి తెలుస్తుంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) ఈ సందర్బంగా టెక్‌మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్‌లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్‌ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా. ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు. -
Kevvu Karthik : హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కెవ్వు కార్తిక్ (ఫొటోలు)
-
57 ఏళ్ల వయసులో రెండో భార్యతో ఆశిష్ విద్యార్థి హనీమూన్ (ఫోటోలు)
-
లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?
ప్రముఖ సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు. (ఇది చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) View this post on Instagram A post shared by Rupali Barua (@ru.pa.li.73) -
హనీమూన్‌లో భర్తకు షాక్: సినిమా మధ్యలో భార్య పరార్!
పోలీస్ స్టేషన్‌కు పరుగుపరుగున వచ్చిన ఒక యువకుడు తనకు ఇటీవలే పెళ్లయ్యిందని, తన భార్య సినిమాహాల్లో తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించేంతలోనే ఆ యువకుని భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన వాదన వినిపించింది. దీంతో ఆ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఇంటర్వెల్ సమయంలో.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక భర్త తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలిద్దలం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లామని, ఇంటర్వెల్ సమయంలో తన భార్య కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లానని, తిరిగి వచ్చిచూసేసరికి ఆమె కనిపించలేదని తెలిపాడు. హనీమూన్‌కు వచ్చి.. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అతని భార్య గురించి గాలింపు చేపట్టేంతలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను వదిలేసి బయటకు వచ్చేశానని తెలిపింది. వివరాల్లోకి వెళితే సీకర్‌కు చెందిన ఒక యువకుడు పెళ్లయిన 7 రోజుల తరువాత తన భార్యతో పాటు హనీమూన్ కోసం జైపూర్ వచ్చాడు. వారు ఒక హోటల్లో బసచేశారు. పింక్ స్క్యేర్ మాల్లో అతను భార్యలో పాటు సినిమా చూసేందుకు ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటల షో చూసేందుకు టిక్కెట్లు బుక్ చేశాడు. తినుబండారాలు కొనుగోలు చేసి వచ్చేంతలో.. అనంతరం ఇద్దరూ ఆనందంగా సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా మధ్యలో అంటే 1:30కి ఇంటర్వెల్ సమయంలో భర్త తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడు. అతను తిరిగివచ్చి చూసే సరికి భార్య ఆ సీటులో కనిపించలేదు. వెంటనే అతను థియేటర్‌తో పాటు మాల్ అంతటా వెదికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. షాక్ అయిన పోలీసులు.. భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భార్య మాయమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమా హాలు నుంచి పరారైన ఆమె కొద్ది సేపటికి జైపూర్‌లోని షాహ్పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను విడిచిపెట్టి వచ్చేశానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ విషయాన్ని ఫోనులో ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు ఆమెకు వివాహం విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లయిన 7 రోజులకే కొత్త జంట ఇలా విడిపోవడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఇది కూడా చదవండి: కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు? -
హనీమూన్‌కు వెళ్లి డాక్టర్ దంపతులు మృతి.. అసలేం జరిగింది?
తిరువళ్లూరు: హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లి మృతి చెందిన నూతన డాక్టర్ దంపతుల మృతదేహాలు రెండు వారాల క్రితం విమానం ద్వారా ఇంటికి చేర్చారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి చెన్నీర్‌కుప్పం ప్రాంతానికి చెందిన సెల్వం కుమార్తే విభూష్న డాక్టర్. ఈమేకు చైన్నెకు చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో గత ఒకటిన అంత్యంత వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు రోజుల తరువాత నూతన జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అనంతరం అక్కడున్న రిజర్వాయర్‌లో బోట్లో వెళుతూ ఫొటో షూట్ తీసుకున్నారు. ఈ సమయంలో జరిగిన ప్రమాదంలో పడవ బోల్తా పడడంతో నూతన జంట నీటిలో మునిగి అక్కడే మృతిచెందారు. మృతదేహలను వెలికి తీసిన అక్కడి పోలీసులు లాంచనాలను పూర్తీ చేశారు. అనంతరం అక్కడి నుంచి విమానం ద్వారా మలేషియాకు అక్కడి నుండి చైన్నెకు మృతదేహాలను తరలించారు. కాగా చైన్నెకు చేరిన తరువాత విభూష్న మృతదేహాన్ని చెన్నీర్కుప్పానికి, లోకేశ్వరన్ మృతదేహాన్ని సేలంకు బంధువులు తరలించారు. శనివారం మధ్యాహ్నం విభూష్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు వారాల క్రితం పచ్చటి తోరణాలు, మంగళవాయిద్యాలతో కలకలాడిన ప్రాంతంలో చావు మేళాలు వినిపించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్‌పై దుండగుల దాడి -
రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి..
ఉత్తర ప్రదేశ్‌లో ఓ కీచక భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భార్యను హానీమూన్ తీసుకెళ్లడానికి అత్తింటి వారిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడో ప్రబుద్ధుడు. వారు రూ.5లక్షలు అందజేయగా.. హనీమూన్‌లో భార్య అసభ్యకర వీడియోలు తీసి మరో రూ. 5 లక్షలు కావాలని, లేందంటే వీడియోలు వైరల్ చేస్తానని వారిని బెదిరించాడు. వివరాలు.. పిలీభీత్కు చెందిన యువతికి బుదౌన్‌లోని బిసౌలీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి తర్వాత తొలి రాత్రి జరుపుకోలేదు. అంతేగాక మూడు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. భర్త ప్రవర్తనపై బాధితురాలు తన అత్తకు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దీంతో తనకు ఎందుకు దూరంగా ఉంటున్నావని, కారణం ఏంటని భార్య అతన్ని నిలదీసింది. తనకు 10 లక్షలు అదనంగా ఇవ్వాలని అత్తింటి వారిని డిమాండ్ చేశాడు. అలాగైతేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని తేల్చిచెప్పాడు. కూతురు కాపురం బాగుండాలని కోరుకున్న వధువు తల్లితండ్రులు అల్లుడికి 5 లక్షలు అందించారు. దీంతో అతడు భార్యతో నైనిటాల్‌కు హానీమూన్‌కు వెళ్లాడు. అయితే అక్కడే అతడికి మరో వక్ర బుద్ధి కలిగింది. హానీమూన్‌లో భార్య అశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మరో రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య పుట్టింటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం కొత్వాల్ పోలీస్ స్టేషన్లో భర్త, అత్తపై కేసు నమోదు చేసింది. కాగా ఇప్పటికే పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేశామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేగాక కూతురు అత్తమామలకు, ఆడపడుచులకు మరో రూ.15 లక్షల విలువైన నగలు బహుమతిగా ఇచ్చామని తెలిపారు. బాధితురాలి ఫఙర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైద్యుడి నిర్వాకం, భార్యను వదిలేసి యువతితో సంబంధం.. ఆస్పత్రి గోడ దూకి.. -
పెళ్లి తర్వాత దుబాయ్‌కు చెక్కేసిన నరేష్- పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్లో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’అంటూ నరేష్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నరేష్-పవిత్రా లోకేశ్‌లు తాజాగా మరోసారి పెళ్లి వీడియోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. నరేష్‌కు ఇది నాలుగో పెళ్లికాగా పవిత్రా లోకేశ్‌కు ఇది మూడో పెళ్లి. ఇక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో సందడి చేస్తున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
వైభవంగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి.. హనీమూన్‌కు నో ఛాన్స్..!
బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు బీటాన్ క్యూట్ కపుల్ కియారా, సిద్ధార్థ్. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను కోసం దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు. అయితే నూతన వధూవరులు మాత్రం హనీమూన్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వారి కెరీర్ ప్రణాళికల్లో భాగంగా మరికొన్ని వాయిదా వేసుకుంటారని సమాచారం. అయితే వీరి వివాహా ఆచారాల కారణంగా పెళ్లి చేసుకున్న వెంటనే హానీమూన్‌కు వెళ్లరట. జైసల్మీర్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక పంజాబీ, సింధు కుటుంబ ఆచారాల ప్రకారం వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా సిద్ధార్థ్.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే కియారాకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇద్దరూ తమ వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసిన తర్వాతే హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్, కియారా స్పందించలేదు. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట అతియా శెట్టి-కేఎల్ రాహుల్ సైతం హనీమూన్ వేడుకను వాయిదా వేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ రెండు గ్రాండ్‌గా రిసెప్షన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12న ముంబైలోని తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం, ఫిబ్రవరి 9న దిల్లీలోని వరుడి కుటుంబ సభ్యుల కోసం మరో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పెళ్లిలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, రామ్ చరణ్, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్‌తో పాటు వ్యాపార దిగ్గజం ఇషా అంబానీతో సహా అనేక మంది స్నేహితులను హాజరయ్యారు. -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
మాల్దీవ్స్‌లో విక్ట్రీనా హనీమూన్.. ఫొటో షేర్ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...
పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాల్దీవ్స్‌లో వాలిపోయారు. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. హనీమూన్‌ను మాల్దీవ్స్‌లో ప్లాన్ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్ చేసింది. లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అన్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్‌గా’ అని ఒక నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. ఫొటో షేర్ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. (చదవండి: ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
స్విమ్‌సూట్‌లో నటి.. విడాకులు ఎప్పుడు అని అడిగిన నెటిజన్
Vidyullekha Raman: లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఇటీవలె పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. అనంతరం కొత్తజంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. రీసెంట్గా అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్విమ్ సూట్, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది. '1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి. నెగిటివ్ కామెంట్ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది' అంటూ ఘాటుగా బదులిచ్చింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత -
మాల్దీవుల్లో హనీమూన్‌కు వెళ్లిన హాస్య నటి
Vidyullekha Ramans Wedding Photos Goes Viral: లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్ ఇటీవల మెట్టినింట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక ఈ నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. తమిళ, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇప్పటివరకు వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా విద్యుల్లేక పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ లెహంగాలో పెళ్లికూతురిగా విద్యుల్లేక ముస్తాబవగా, సంజయ్ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇటీవల భర్త క్లిక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేక. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan) -
హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి
బీజింగ్: పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీర భాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులును చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ వివరాలు.. చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న బాబు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను.. తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరారు. కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు. బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు. బిడ్డను అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కొడుకును తీసుకువచ్చాడు. కన్నతల్లి బాబుని చూడాలని కోరింది.. అందుకే తీసుకెళ్తున్నాను అని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అది నమ్మిన కుటుంబ సభ్యులు బాబును తండ్రికి అప్పగించారు. కానీ ఆ ప్రబుద్ధుడు ఏ మాత్రం జాలీ, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది. ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి కాల్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో కన్నతల్లికి కాల్ చేసి బిడ్డ గురించి అడగ్గా ఆమె తన దగ్గరకు తీసుకురాలేదని తెలిపింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా.. సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి.. వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లినట్లు తెలిసింది. దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చైనాలో ఇలాంటి సంఘటలను తరచుగా చోటు చేసుకుంటాయి. గతేడాది ఓ వలస కూలీ అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం నవజాత శిశువును అమ్ముకున్నాడు. చదవండి: నవ దంపతులకు హనీమూన్ కష్టాలు! -
నటుడి ప్రేమ పెళ్లి, ఆ వెంటనే హనీమూన్
లాక్డౌన్లో సామన్యులతో పాటు సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే వారంతా శుభ ముహూర్తాలు చూసుకుంటూ లగ్న పత్రికలు రాయించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే టీవీ నటుడు కృష్ణ శెట్టి తన మనసు దోచుకున్న అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. తన ప్రియురాలు, డెంటిస్ట్ ప్రగ్యాను అగ్నిసాక్షిగా పెళ్లాడాడు. మంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరణ్ కుంద్రా, పౌలొమి దాస్ కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. పెళ్లైన వెంటనే తన అర్ధాంగిని వెంటేసుకుని కూర్గ్‌లో హనీమూన్‌కు వెళ్లాడు కృష్ణ శెట్టి. "నాకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చేతులకు, కాళ్లకు మెహందీ, కాలి వేళ్లకు రింగు చూశాక అవును, నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఇదంతా కలలా అనిపిస్తోంది. అయితే ఇదంత ఈజీగా ఏమీ జరగలేదు. నా సోదరి ద్వారా ప్రగ్యాను కలిశాను. చూడగానే ఒకరికి ఒకరం నచ్చేశాం. అయితే ప్రగ్యా తల్లిదండ్రులు మాత్రం నాతో పెళ్లంటే తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే నటుడి జీవితం ఎప్పుడెలా ఉంటుందోనని భయపడ్డారు! ఆమెను ఓ ఇంజనీర్‌కో, డాక్టర్కో ఇద్దామనుకున్నారు. కానీ మేమందరం ఓసారి సమావేశమైనప్పుడు మా మధ్య ఉన్న ప్రేమను చూసి వారు కూడా ఒప్పేసుకున్నారు. ఏదేమైనా అర్థం చేసుకునే అర్ధాంగి దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Krishna Shetty (@ikrishnashetty) చదవండి: ‘మిస్ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది -
ఉదయ్‌పూర్‌లో తాండవ్ నటి హనీమూన్
ఉదయ్‌పూర్: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్- కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహ బంధానికి ఆరంభం పలికారు. డిసెంబర్ 25న షాదీ జరపుకున్న ఈ జంట తాజాగా హనీమూన్‌కు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లింది. తొలిసారి భర్తతో కలిసి ప్రయాణం చేసినందుకు గౌహర్‌కు గాల్లో తేలినట్లుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంటూ 'నేను నా భర్తతో కలిసి వెళ్తున్న ఫస్ట్ హాలీడే ఇది. చాలా హ్యాపీగా ఉంది' అంటూ వీడియోను షేర్ చేశారు. ఇందులో గౌహర్ ఎక్కడలేని ఆనందంతో స్టెప్పులేస్తున్నారు. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. కాగా మాజీ మోడల్ అయిన గౌహర్ అనేక టీవీ షోలలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చారు. ఇటీవలే ఆమె తాండవ్ వెబ్ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. (చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి) ఇక జైద్ దర్బార్ విషయానికి వస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు అయిన జైద్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కాగా గౌహర్‌కు, జైద్‌కు ఎనిమిదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ ప్రేమకు వయసుతో పని లేదని, ఇద్దరం పరిణతి చెందినవారమని, ఒకరికొకరం బాగా అర్థం చేసుకోగలమంటూ పెళ్లి చేసుకుని నిరూపించారు. (చదవండి: అలనాటి స్టార్ హీరో బ్రేకప్ స్టోరీ) View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) View this post on Instagram A post shared by Zaid Darbar (@zaid_darbar) View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) -
రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన చహల్
న్యూఢిల్లీ : టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో హనీమూన్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్దరూ తమకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తమ హనీమూన్‌కు సంబంధించిన రొమాంటిక్ ఫొటోను చహల్ అభిమానులతో పంచుకున్నారు. ( బాక్సింగ్ డే టెస్టు: పట్టు బిగిస్తున్న భారత్ ) భార్య ధనశ్రీతో దిగిన ఫొటోను చహల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో దిగిన ఫొటో అది. ధనశ్రీ వైట్ అండ్ బ్లాక్ స్కట్‌తో.. చహల్ జర్కిన్, షార్ట్‌తో స్టైలిష్‌గా ఉన్నారు. దీంతో ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 7లక్షల వ్యూస్ దక్కించుకుంది. కాగా, చహల్ డిసెంబర్ 22వ తేదీ మంగళవారం కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబ్ స్టార్ ధనశ్రీని వివాహం చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
కాజల్ ధరించిన డ్రెస్ విలువ తెలుసా?
కొత్త జంట కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్న ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వెకేషన్లో ఉంటూనే ట్రెండీగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ర్యాట్ అండ్ బోవా బ్రాండ్‌కు చెందిన ఎరుపు రంగు సెమీ షీర్ దుస్తుల్లో కాజల్ మరింత కలర్ఫుల్గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బీచ్ లొకేషన్లకు చక్కగా సరిపోయే ఈ బ్యాక్‌లెస్ డ్రెస్ విలువ అక్షరాల 13వేల రూపాయలు. మ్యాచింగ్ ఇయర్రింగ్స్, హ్యాట్‌తో కాజల్ చాలా ట్రెండీగా కనిపిస్తుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మాల్దీవుల్లోని పలు అందమైన ప్రదేశాలలో వీరిద్దరూ తీసుకున్న ఫొటోలను తన అభిమానుల కోసం షేర్ చేశారు కాజల్. ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. (అండర్ వాటర్‌లో కాజల్-గౌతమ్‌ల హనీమూన్) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది. కాగా ప్రస్తుతం కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. (వైరలవుతోన్న కాజల్ హనీమూన్ ఫోటోలు) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) -
సముద్రంలో కాజల్ దంపతుల అడ్వెంచర్స్..
కొత్త జంట కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ... అభిమానుల చేత వావ్ అనిపిస్తున్నారు కాజల్. తాజాగా సముద్రంలో తాము చేసిన అడ్వెంచర్లకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు కాజల్. అద్భుతమైన కోట్స్‌తో మూడు పోస్టుల్లో స్నార్కెలింగ్ సెషన్‌కు సంబంధించి మొత్తం ఆరు ఫోటోలని షేర్ చేశారు కాజల్. మొదటి పోస్ట్‌లో దంపతులిద్దరూ స్విమ్ చేస్తున్న ఫోటోలని.. ‘ప్రపంచం ఒక సముద్రం. అందులో మనం అలలం. కొందరు సర్ఫ్ చేయాలనుకుంటారు.. కొందరు డైవ్ చేయాలనుకుంటారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. (చదవండి: మజా మాల్దీవ్స్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) మరో పోస్ట్‌లో ‘ఒంటరిగా సముద్రం ఒడ్డున ఉండండి. అక్కడ మీకు మీ ఉనికిలో లేని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’ అంటూ రెండు ఫోటోలని షేర్ చేయగా.. చివరి పోస్ట్‌లో ‘సముద్రం అంటే నాకు ఎంతో ప్రేమ. నీలం వర్ణం అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఎంతో ప్రశాంతంగా.. ప్రకాశవంతంగా.. జారిపోతూ ఉంటుంది. కొద్దిగా భయం కూడా’ అంటూ మరో రెండు ఫోటోలని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ అండర్ వాటర్ స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవే కాక కొద్ది రోజుల క్రితం భర్తతో అండర్ వాటర్, చేపల మధ్య హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కాజల్ మాల్దీవుల నుంచి తిరిగి రాగానే కొద్దిరోజుల క్వారంటైన్ అనంతరం షూటింగ్లో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. -
అండర్ వాటర్‌లో కాజల్-గౌతమ్‌ల హనీమూన్
ప్రస్తుతం కొత్త జంట కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూలు మాల్దీవులో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీవిలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్న ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ పలు అందమైన ప్రదేశాలలో వీరిద్దరూ తీసుకున్న ఫొటోలను తన అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు కాజల్. ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా భర్తతో అండర్ వాటర్, చేపల మధ్య హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలను కూడా కాజల్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మాల్దీవులలోనే ప్రత్యేకమైన ఈ అండర్ వాటర్‌లో టూ లెవల్ రిసోర్ట్‌లో ఈ కొత్త జంట ఆనందంగా గడుపుతున్నారు. వాటర్ గది, చేపల మధ్య బ్లూ కలర్ సూట్ ధరించిన ఈ ‘చందమామ’ అచ్చం జలకన్యను తలపిస్తోంది. ఈ ఫొటోలకు ఆమె ‘నేను ఈ చేపలను చూస్తున్నానా లేక అవి నన్ను చూస్తున్నాయా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. (చదవండి: హనీమూన్ ఫొటోలు షేర్ చేసిన కాజల్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram Am I looking at the fish or are the fish looking at me? A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 11, 2020 at 8:59pm PST తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది. కాగా ప్రస్తుతం కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కాజల్ మాల్దీవుల నుంచి తిరిగి రాగానే కొద్దిరోజుల క్వారంటైన్ అనంతరం షూటింగ్లో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట) -
హనీమూన్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
గత జూన్‌లో నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూలు అక్టోబర్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో హనీమూన్ కోసం మాల్దీవులకు పయనమవుతున్నట్లు గతవారం కాజల్ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి కాజల్ మాల్దీవులలో భర్త గౌతమ్‌తో కలిసి సందడి చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అదే విధంగా బుధవారం కూడా అభిమానుల కోసం మరిన్ని ఫొటోలను షేర్ చేసింది కాజల్. వారుంటున్న రిసార్ట్ సమీపంలోని స్వీమ్మింగ్ పూల్ వద్ద టీ తాగుతూ, యోగ చేస్తున్నవి, తన బర్త గౌతమ్ కలిసి ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోలకు ‘ఈ అందమైన దేశానికి ఎప్పుడూ వచ్చిన నా హృదయం సంతోషంతో ఉల్లాసంగా ఉంటుంది’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి View this post on Instagram My heart feels so happy and free, everytime I visit this beautiful country ! 🇲🇻 A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 11, 2020 at 1:20am PST కాగా మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ రూపోందిస్తున్న‘ఆచార్య’ సినిమాలో కాజల్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఇటీవల షూటింగ్‌లు పున: ప్రారంభం కావడంతో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లింది. అయితే కాజల్ పెళ్లి తర్వాత కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుందని ఆ తర్వాత ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటుందని ఆమె పెళ్లి సమయంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన కాజల్‌ను త్వరలోనే స్ర్కీన్‌పై చూడోచ్చని అభిమానులు సంబర పడిపోయారు. అయితే ఆ వార్తలను కొట్టి పారేస్తూ కాజల్ తన హనీమూన్ ప్రయాణాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ‘ఆచార్య’ షూటింగ్లో కాజల్ ఎప్పుడు పాల్గొంటుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్) -
రానా హనీమూన్, భార్యతో సెల్ఫీ
హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌కు మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గత నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో తక్కువ మంది సమక్షంలోనే గ్రాండ్‌గా జరిగింది. ఆ సమయంలో రానా- మిహికా జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఈ దంపతులు హనీమూన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోయే నిదర్శనం. భర్త కోసమే ఇలా.. అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇందులో మిహికా సాగర తీరాన భర్తతో కలిసి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. (చదవండి: పెళ్లి పందిట్లో చైతూ, సమంత చిలిపి పని) ఈ క్రమంలో ఇసుకలో పడుకుని కబుర్లు చెప్తున్న సమయంలో భార్యను సెల్ఫీలో బంధించారు రానా. కాగా మిహికా పెళ్లి తర్వాత శ్రీవారితో కలిసి దిగిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం. ఇంతకీ ఈ హనీమూన్ ఎక్కడ అనే విషయం మాత్రం సస్పెన్స్‌గా ఉంది. అయితే గతంలో హనీమూన్ ట్రిప్ గురించి రానా మాట్లాడుతూ.. ఆమ్స్టర్డ్యామ్లో హనీమూన్ ప్లాన్ చేశామని తెలిపారు. తనకు ఆర్ట్ అంటే ఇష్టమని, ఆమ్స్టర్డ్యామ్ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది, కాబట్టి అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు. తన భార్య కూడా ఆ ప్రదేశానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కరోనా ప్రభావం తగ్గాక అక్కడికి షికారుకు వెళ్తామని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఈ కొత్త జంట ఆమ్స్టర్డ్యామ్కే వెళ్లినట్లు తెలుస్తోంది. (చదవండి: సర్వస్వం నువ్వే.. లవ్ యూ: మిహికా) -
హనీమూన్ అక్కడే!
హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దగ్గుబాటి, మిహికా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. కోవిడ్ కారణంగా ఈ కొత్త జంట హనీమూన్‌ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ‘‘మా హనీమూన్ కోసం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సెలక్ట్ చేసుకున్నాం. నాకు ఆర్ట్ అంటే ఇష్టం. ఆమ్స్టర్డ్యామ్ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నా. మిహికా కూడా ఆ ప్లేస్‌కి ఓకే చెప్పిది. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ఇప్పుడే వెళ్లేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మా హనీమూన్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు రానా. -
గాలిలో హనీమూన్: లారీలను దాటుతూ
పెళ్లిని ఘనంగా చేయాలని వధూవరుల కుటుంబాలు ఎన్నో కలలు కంటాయి. తీరా పెళ్లి చేసి వారు బాధ్యత తీర్చుకోగానే కొత్త పెళ్లి జంట హనీమూన్‌కు రెడీ అవుతుంది. అందు కోసం రాష్ట్రాలు, దేశాలు దాటడానికైనా వెనకాడరు. అయితే ఓ కొత్తజంట మాత్రం హనీమూన్‌ను మరీ వెరైటీగా చేసుకొని వార్తల్లో నిలిచింది. గాలిలోనే హనీమూన్ జరుపుకుంది. అది కూడా కేవలం 5 సెకండ్లు మాత్రమే. చక్రాల మంచంపై భార్యాభర్తలిద్దరూ చేరి ఎత్తైన కొండ మీద నుంచి కిందకి జారారు. (ఆలుమగల గొడవ: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్) ఆ తర్వాత గాల్లోకి రయ్‌మని ఎగురుతూ అక్కడుకున్న ఎనిమిది లారీలను దాటుకుని అవతలకు జారుడు బండ జారినట్లుగా పడ్డారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం కాస్త ఊపిరి పీల్చుకునే విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను నెటిజన్లు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. 'మీకెలా ఉందో కానీ చూస్తున్న మాకైతే భయంతో ప్రాణం పోయేలా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. భైరవ ద్వీపంలో రాకుమారిని రాక్షసుడు ఎత్తికెళ్లిన సన్నివేశాన్ని పోల్చుతూ 'ఇక్కడ రాకుమారిని రాజకుమారుడే ఎత్తుకెళ్తున్నాడు' అని ఛలోక్తులు విసురుతున్నారు. (నవ దంపతులకు హనీమూన్ కష్టాలు!) -
నవ దంపతులకు హనీమూన్ కష్టాలు!
మాలీ : హనీమూన్ కోసం మెక్సికో వెళ్లిన ఆ జంట లాక్డౌన్ కారణంగా మాల్దీవులలో చిక్కుకుపోయింది. తీరం తెలియని ప్రయాణంలా వారి హనీమూన్ సాగుతోంది. దేశదేశాలు తిరిగి కష్టాలతో ఎదురీదుతోంది హనీమూన్ వెళ్లిన ఆ నవ దంపతుల జంట. వివరాల్లోకి వెళితే.. ఈజిప్టుకు చెందిన ఖలెద్ మోక్తర్, పెరి అబోజెడ్లు గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్‌లో నివాసముంటున్నారు. గత మార్చి 6న స్వదేశంలోని కైరోలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం మెక్సికోకు వెళ్లారు. ఆ తర్వాత మార్చి 19న టర్కీకి తిరుగు ప్రయాణమయ్యారు. టర్కీనుంచి దుబాయ్‌కి కనెక్షన్ ఫ్లైట్ ఉండటంతో విమానం ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగానే పెరి మిత్రులు ఆమెకో షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా యూఏఈ విమానాల రాకపోకలను నిలిపివేసిందని వివరించారు. వారు టర్కీలో లాండ్ అవ్వగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు కూడా దుబాయ్ వెళ్లే విమానాలు రద్దయ్యాయని వెల్లడించారు. దీంతో తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఎక్కడ గడపాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉండటం సాధ్యపడదని వారు భావించారు. ఈ నేపథ్యంలో వారికి ఈజిప్టు వాసులకు వీసా అవసరం లేని మాల్దీవులు గుర్తుకువచ్చాయి. వెంటనే అక్కడికి వెళ్లిపోయారు. ( నవ దంపతులకు హనీమూన్ కష్టాలు ) మాల్దీవుల్లోనూ తప్పని కష్టాలు ఖలెద్ మోక్తర్, పెరి అబోజెడ్ల జంట మార్చి 27న మాల్దీవులకు చేరుకుంది. అయితే అదే సమయంలో అక్కడ కూడా విమానాల రాకపోకలు, రిసార్టు సేవలు రద్దయ్యాయి. దీంతో దాదాపు 70 మంది ఉంటున్న ఐసోలేషన్ సెంటర్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాలను కాపాడుకోవటానికి సెల్ఫోన్లలో పనులు చేసుకుంటున్నారు. ( మాల్దీవులు చేరుకున్న నౌక.. 1000 మంది..) దీనిపై వారు మాట్లాడుతూ.. ‘‘ ఐసోలేషన్ సెంటర్ వాళ్లు మాకు సరైన సదుపాయాలు కల్పించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. సాయంత్రాలు పాటలు పాడతారు, ప్రతిరోజూ డీజే ఉంటుంది. ఒక్కోసారి ఎవ్వరూ డ్యాన్స్ చేయకపోవటంతో చాలా బాధగా ఉంటుంది. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. మా జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బాగా ఒత్తిడికి గురవుతున్నాము. న్యూస్ చదవగానే ఏదో నమ్మకం సరిహద్దులు తెరుస్తారని, కానీ, ప్రతిరోజూ కొత్తగా ఉంటోంది. సరైన వ్యక్తితో ఇలా చిక్కుకు పోవటంలోనూ ఓ ఆనందం ఉంది. ఇదొక్కటే మాకు సంతోషాన్నిచ్చే విషయం ’’ అని పేర్కొన్నారు. -
లాక్‌డౌన్‌తో 6 కాస్తా 68..
సాక్షి, భువనేశ్వర్ : ఏడు రోజుల హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన నవదంపతులు లాక్డౌన్ కారణంగా 68 రోజుల తరువాత ఇంటికి చేరారు. ఈ సంఘటన రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్ అతడి భార్య పల్లవి మిశ్రాలు పెళ్లి తరువాత గత మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. హానీమూన్ ముగించుకొని మార్చి 17వ తేదీన భారత్ రావాల్సి ఉంది. అదే సమయంతో కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా దాదాపు లాక్డౌన్లో ఉండటంతో వీరు మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి స్వదేశం వచ్చేందుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోన కారణంగా భారత్ దేశ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ( తల్లి ప్రేమకు ప్రతీక ) దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడి ప్రయాణికులందరికి వసతి ఏర్పాటు చేసింది. భారత్ ప్రభుత్వం లాక్డౌన్ 4లో విదేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమంలో భాగంగా నవదంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం భువనేశ్వర్ చేరుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
హనీమూన్ కోసం మనాలి.. అంతలో
టీ.నగర్ : విహారయాత్రకు హిమాచ్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లిన చెన్నై నవవరుడు మృతి చెందాడు. సోమవారం భార్య కళ్లెదుటే జరిగిన ఈ విషాద సంఘటన శోకాన్ని నింపింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్ ఆలయం వీధికి చెందిన అరవింద్ (27). ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. డోబీ అనే ప్రాంతంలో ప్యారాగ్లైడింగ్‌లో పర్యాటకులు విహరించడం విశేషం. దీనిని గమనించిన అరవింద్‌కు కుతూహలం ఏర్పడింది. ఇందుకోసం టికెట్ కొనుగోలు చేసి సోమవారం ప్యారాగ్లైడర్ పైలట్ హరూరామ్‌తో అరవింద్ విహరించాడు. దీనిని ఆసక్తితో ప్రీతి గమనిస్తూ వచ్చింది. ఆకాశంలో విహరిస్తుండగానే కొద్ది సేపట్లో ప్యారాగ్లైడర్లో అరవింద్ నడుముకు కట్టుకున్న బెల్ట్ వీడిపోయినట్లు తెలిసింది. దీంతో అరవింద్ ప్యారాగ్లైడర్ నుంచి కింద నున్న పల్లంలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అత్యవసరంగా కిందకు దిగుతూ పైలట్ హరూరామ్ గాయపడ్డాడు. అతన్ని అదే ప్రాంతంతోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కులు హాస్పిటల్‌కు తరలించారు. భర్త మృతదేహాన్ని చూసి ప్రీతి రోదించడం అక్కడి వారిని కలచి వేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో భద్రతా బెల్ట్‌ను సరిగా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
హనీమూన్‌లో నో.. కోర్టు మెట్లెక్కిన భర్త!
ప్రణయయాత్ర హనీమూన్.. తమ జీవితమంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని పెళ్లైన ప్రతి జంట కోరుకుంటోంది. వందేళ్లు కలిసుండటానికి వేసే తొలి అడుగుల్లో మధురానుభూతులు నింపుకోవడానికి హనీమూన్ వేదిక కావాలని కోరుకుంటుంది. కానీ ఓ జంటకు హనీమూన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పెళ్లయిన ఏడు రోజులకే విడిపోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. హనీమూన్‌లో శృంగారానికి భార్య నిరాకరించిందని ఓ వ్యక్తి ఏకంగా కోర్టుకు ఎక్కాడు. పెళ్లయి.. పట్టుమని పదిరోజులు గడవకముందే భార్య నుంచి విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటన గల్ఫ్ దేశమైన యూఏఈలో జరిగింది. దుబాయ్‌కి చెందిన ఓ జంట పెళ్లయిన వెంటనే హనీమూన్ కోసం యూరప్ వెళ్లారు. అయితే, అక్కడ అంతా అనుకున్నట్టు సజావుగా జరగలేదు. కొత్త జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో హనీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. హనీమూన్‌లో భార్య శృంగారంలో తనకు సహకరించలేదని, విడాకులు ఇప్పించాలని కోరాడు. అటు అతని భార్య కూడా విడాకాలు కావాలని కోరింది. భర్త వట్టి పిసినారి అని, తన కోసం అసలు డబ్బు ఏమాత్రం ఖర్చుపెట్టలేదని, అందుకే విడాకాలు ఇచ్చేయాలని కోరింది. వీరికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవటంతో అధికారులు షరియా కోర్టుకు ఈ కేసును అప్పగించారు. ఒక వేళ వీరికి కోర్టు విడాకులు మంజూరు చేస్తే.. అతి తక్కువ కాలం కలిసి జీవించిన వారిగా నిలిచిపోతారు. -
హనీమూన్ విషాదాంతం: ‘తమన్నా’ మృతి
భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం తమన్నా భర్త పరారీలో ఉండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన తమన్నా, షాదాబ్ లకు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయింది. ఈ నెలలో కొత్త జంట హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లింది. తాము ఇద్దరం సెల్పీ తీసుకుంటుండగా హఠాత్తుగా అక్కడ పాము కనిపించిందని, దీంతో భయపడిన తమన్నా అనుకోకుండా వెనక్కి జరుగుతూ.. సుమారు 250 అడుగుల లోయలోకి పడిపోయిందని, తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందనేది తమన్నా భర్త చెబుతున్నకథనం. క్యాడ్ డ్రైవర్ అందించిన సమాచారం ప్రకారం.... జనవరి 15న నైనిటాల్ సైట్ సీయింగ్ కోసం ఈ కొత్త జంట క్యాబ్ బుక్ చేసుకున్నారు. మధ్యలో తమన్నా కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో..దంపతులు ఇద్దరూ క్యాబ్ దిగి కొండవాలు వైపు నడుచుకుంటూ వెళ్లారని, ఇంతలో అరుపులు, ఏడుపులు వినడంతో తాను అక్కడకు చేరుకోగా.. పామును చూసి భయపడి తన భార్య లోయలో పడిపోయిందని షాదాబ్ చెప్పినట్లు తెలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. తన సోదరిని కట్నం కోసమే షాబాద్ చంపేశాడని తమన్నా సోదరుడు అరిఫ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం తమన్నా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు టైనిటాల్ పోలీసు స్టేషన్ అధికారి ప్రమోద్ పతక్ తెలిపారు. -
పాకిస్తాన్లో హనీమూన్..!
న్యూఢిల్లీ : విరాట్ కొహ్లీ - అనుష్క శర్మల వివాహం తర్వాత ఇరువురి ఫ్యాన్స్ ఆనందం మరింత పెరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్‌లో ఉన్న ఓ ఫోటోను హనీమూన్ డైరీస్ పేరిట అనుష్క సోషల్‌మీడియా షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోతో విరుష్కల ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని అనుష్క షేర్ చేసిన ఫొటోను ఫొటోషాప్ చేశాడు. విరుష్కలు హనీమూన్‌కు పాకిస్తాన్‌కు వచ్చారంటూ సోషల్‌మీడియాలో ఎడిటెడ్ ఫొటోను పెట్టాడు. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో ఉన్న ఫాతిమా జిన్నా మెడికల్ యూనివర్సిటీకి ఫైనల్ ఇయర్ మెడికల్ విద్యార్థుల ఆహ్వానం మేరకు విరుష్కలు విచ్చేశారని తన పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాదు విరుష్క జంట స్థానికంగా దొరికే ఆహారాన్ని కూడా రుచి చూసి, అద్భుతః అని కితాబిచ్చిందని కూడా రాసుకొచ్చాడు. ఈ నెల 21వ తేదీన న్యూఢిల్లీలో, 26వ తేదీన ముంబైలో విరుష్కలు రిసెప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరి మీరు ఆ ఫొటోలను కింది గ్యాలరీలో ఓ సారి చూసేయండి. -
హనీమూన్‌కు బయలుదేరిన విరుష్క.. స్పాట్ ఇదే!
ఈ ఏడాది బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఏదంటే టక్కున విరాట్ కోహ్లి-అనుష్క శర్మల పెళ్లి గురించి చెప్పవచ్చు. ఎన్నాళ్లుగానే ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఒకింత రహస్యంగా ఇటలీలోని టస్కనీ పట్టణంలో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సంబరంగా వీరి పెళ్లి జరిగింది. చూడముచ్చటగా ఉన్న వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. మరి విరుష్క దంపతుల పెళ్లితంతు ముగిసింది. మరీ హనీమూన్‌కు ఎక్కడి వెళుతున్నారంటే.. ఇటలీలోనే పక్కన రోమ్‌లో ప్రణయయాత్ర సాగించాలని ఈ జంట నిర్ణయించిందట. మంగళవారం సాయంత్రం వీరు రోమ్‌లో హనీమూన్‌కు బయలుదేరి వెళ్లారని ఓ బాలీవుడ్ వెబ్సైట్ వెల్లడించింది. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు భర్త కోహ్లితో కలిసి అనుష్క వెళ్లనుంది. ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొనున్నారు. జనవరి తొలివారం అనంతరం ఆమె భారత్‌కు తిరిగివచ్చి మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. -
వారి హనీమూన్ ఫొటోలు వచ్చేశాయ్!
ముంబై: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జహీర్ ఖాన్, సాగరికా ఘట్గే దంపతులు విదేశాల్లో విహరిస్తున్నారు. నవంబర్ 23న సన్నిహితుల నడుమ వీరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దంపతులు ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మల్దీవుల్లోని అయదా రిసార్ట్ లో బస చేస్తున్న ఈ దంపతులు కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. నీలాకాశం నేలమీదకొచ్చినట్టు ఉండే సముద్రతీరాలు, అందమైన సూర్యోదయాల్లో గడుపుతూ.. తమ కొత్త జీవితపు మధురిమలను పోగేసుకుంటున్నారు. ఈ మేరకు మాల్దీవుల్లో ఈ జంట ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్న ఈ ఫొటోలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Star gazing and some lovely dinner on the cruise . Thank you for the most lovely surprise @discoversoneva 😊 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 7:27am PST Say hello to my early morning friend 😊😍 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 9, 2017 at 9:01pm PST Thrilled to have completed our first dive . See the happy faces 🌊 @zaheer_khan34 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 8, 2017 at 2:42am PST Decided to 🚲 instead @discoversoneva #islandlife #sonevajani A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 10:14pm PST ❤️ A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 8:19am PST Soaking in the calmness of the ocean A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 11, 2017 at 5:03am PST Mrs enjoying the setting sun A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 8, 2017 at 5:03am PST All the trainers @prosport_fit here’s the most dedicated trainee of yours . A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 9, 2017 at 3:44am PST -
వీళ్ల దృష్టి అంతా ఇప్పుడు సమంతపైనే!
సాక్షి, చెన్నై: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ఇక సినిమా వాళ్ల సంగతులపై అభిమానుల కుతూహలమే వేరు. అదే విధంగా సోషల్ మీడియాల్లో అలాంటి విషయాలను ఎక్స్పోజ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ల దృష్టి అంతా ఇప్పుడు నటి సమంతపైనే. అందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా సినిమా వాళ్ల ప్రేమలు పెళ్లి పీటలెక్కడం అన్నది చాలా తక్కువగానే జరుగుతుంటాయి. అలా తన ప్రేమను సక్సెస్‌ఫుల్‌గా పెళ్లి వరకూ తీసుకెళ్లిన నటి సమంత. అదీ ఒక సినిమా కుటుంబానికి చెందిన యువ నటుడిని ప్రేమించి అందరిని ఒప్పించి కల్యాణ ప్రాప్తిరస్తు అనిపించుకోవడం సాధారణ విషయం కాదు. అలా నాగచైతన్య, సమంతల వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఇక మిగిలింది ఈ నవ జంట హనీమూన్ ఎప్పుడన్న ఆసక్తి వారి అభిమానుల్లో నెలకొంది. వివాహానంతరం కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండవచ్చుగా అనే విమర్శలు వస్తున్నాయి. ఇవేమీ చెవినేసుకోకుండా సమంత, నాగచైతన్య వారి వారి చిత్రాల షూటింగ్లలో నిమగ్నమైపోయారు. ఇలాంటి విషయాలపై సమంత స్పందిస్తూ నాగచైతన్య తనను అర్థం చేసుకున్నారని, వివాహానంతరం నటించడానికి ఆయన తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి తరువాత కూడా నటీమణులు సాధించగలరని తాను నిరూపిస్తానని అంటున్నారు. అయితే ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని, జాతీయ అవార్డులు గెలుచుకోవడమే తన లక్ష్యం అట. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఐదు చిత్రాల్లో నటిస్తున్న సమంత వాటిని పూర్తి చేసిన తరువాత హనీ మూన్‌కు ప్లాన్ చేసుకుంటారట. -
హనీమూన్ మానుకుని.. హీరో అయ్యాడు!
ప్రస్తుతం శ్రీలంకతో పాటు భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటోన్న లంక యువ సంచలనం అఖిల ధనంజయ. సరిగ్గా 24 ఏళ్లు కూడా లేని స్పిన్నర్ గురువారం జరిగిన రెండో వన్డేలో భారత స్టార్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే మరో విషయంలోనూ అతడిని లంక క్రికెటర్లు, ప్రజలు గుర్తుంచుకుంటారనడంలో సందేహమే లేదు. హనీమూన్ కు వెళ్లాల్సిన స్పిన్నర్ పెళ్లి జరిగిన రోజు రాత్రే లంక జట్టుతో కలిశాడు. అదేనండీ.. రెండో వన్డేకు ముందురోజు (బుధవారం) తన సొంతూరు మోరత్వాలో చిన్ననాటి స్నేహితురాలు నెతాలి టెక్షిణిని వివాహం చేసుకున్నాడు. అందరిలాగే తాను మరుసటి రోజు తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాలి, కానీ లంక టీమ్ మేనేజ్మెంట్ నుంచి పిలుపు రావడంతో రాత్రికి రాత్రే క్యాండీలోని హోటల్లో బసచేస్తున్న లంక జట్టుతో చేరాడు. జట్టు కోసం వ్యక్తిగత విషయాన్ని పక్కనపెట్టిన ధనుంజయ పటిష్టస్థితిలో ఉన్న సమయంలో టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడు. 108/0 తో ఉన్న భారత్ ధనుంజయ బౌలింగ్ దాడితో 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయింది. కెరీర్ ల్ నాల్గో వన్డే ఆడుతున్నా వరుస విరామాల్లో వికెట్లు తీసి (6/54) టీమిండియాకు పెద్ద పరీక్ష పెట్టాడు. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాణించడంతో పాటు కెరీర్ లో తొలి వన్డే హాఫ్ సెంచరీతో భువనేశ్వర్ కదం తొక్కడంతో భారత్ విజయం సాధించినా.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ధనంజయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. నెతాలి వెరీ వెరీ హ్యాపీ.. తన భర్త ఆటను ఆస్వాదించేందుకు భార్య నెతాలి పల్లెకెలె గ్యాలరీలో ప్రత్యక్షమైంది. భర్త ఆటను ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసింది నెతాలి. పటిష్ట భారత జట్టు బ్యాట్స్ మెన్లపై బౌలింగ్ దాడిలో ధనంజయ విజయం సాధించడాన్ని వీక్షించింది. లంక ఓటమి ఆమెను నిరాశ పరిచినా.. తన భర్త వన్ మ్యాన్ షో చేయడం కొత్త పెళ్లికూతురు జీవితంలో మరపురాని ఘటనగా నిలిచిపోతుంది. -
హనీమూన్‌లో యూవీ దంపతులు..!
గతవారం ఓ ఇంటివారు అయిన క్రికెటర్ యువరాజ్ సింగ్-హజెల్ కీచ్ దంపతులు ప్రస్తుతం ప్రణయయాత్రలో మునిగితేలుతున్నారు. పేరు వెల్లడించిన ప్రదేశంలో బీచ్ తీరంలో ఈ జంట హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. నీలి సముద్రపు అలలు, ఇసుకతిన్నెలు, తళతళ మెరిసే ఎండలో విహరిస్తూ ఈ జంట కొన్ని ఫొటోలను తమ అభిమానులతో పంచుకుంది. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అయిన హజెల్ కీచ్‌ను గత నెల 30న యువీ పెళ్లాడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట డిసెంబర్ 12న ఈ స్టైలిస్ క్రికెటర్ 35వ వసంతంలో అడుగుపెట్టాడు. పుట్టినరోజు సందర్భంగా యూవీని సాటి క్రికెటర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనల్లో ముంచెత్తారు. అయితే, తన పుట్టినరోజును తన భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, తాము హనీమూన్ స్వర్గంలో మునిగితేలుతున్నా హజెల్ కీచ్ ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. -
ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట!
సాక్షి,వీకెండ్: కొత్తగా పెళ్లైన జంట ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కుటుంబానికి, స్నేహితులకి, బంధువులకు మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచానికే దూరంగా దాంపత్య జీవితాన్ని గడపడానికి వెళ్లే ట్రిప్ హనీమూన్ అని మనకి తెలుసు. అదే విధంగా ఇప్పుడు సరికొత్త ట్రెండ్ ‘పుట్టు’కొచ్చింది. దీనిని నగరవాసులు బేబీమూన్ అని పిలుస్తున్నారు. – శిరీష చల్లపల్లి పెళ్లయిన తర్వాత కొన్ని రోజులో, కొన్ని నెలలో మాత్రమే ప్రైవసీ... ఆ తర్వాత ఉద్యోగాలు, బాధ్యతలు, బంధాలు, చిక్కుముడులు... మళ్లీ అంతా రొటీన్ లైఫ్‌సై్టల్. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక.. మళ్లీ దంపతుల జీవితాల్లోకి కొత్త వెలుగొస్తుంది. వారి మధ్యలోకి తమ ప్రతిరూపం రానుందని తెలిసిన తర్వాత ఒకరికొకరు మరోసారి చాలా క్లోజ్‌నెస్ ఫీలవుతారు. అయితే రొటీన్ లైఫ్ స్టైల్ కారణంగా ఇది కూడా కొన్ని రోజులకే పరిమితమై పోతుంటుంది. అలా అవడం మంచిది కాదని, బిడ్డ గర్భంలో రూపుదిద్దుకుంటున్న తొలినాళ్లలో భార్యాభర్తల మధ్య మరింత గాఢమైన ప్రేమ పూర్వక దాంపత్యం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం భార్యాభర్తలు మరోసారి ప్రణయ యాత్ర చేయడం మంచిదంటున్నారు. దీనికే ఇప్పుడు బేబీమూన్ అని పేరు కూడా పెట్టారు. పిల్ల చంద్రుడి కోసం... డెలివరీకి ముందు వెళ్లి గడిపే రొమాంటిక్ అండ్ ప్రైవేట్ ట్రిప్ బేబీమూన్ సాక్షిగా ‘రావోయి చందమామ... మా ఇంటిలోకి అడుగిడుమా’ అంటూ లాలిపాటలు పాడుతున్నారు దంపతులు. తమకు నచ్చే ప్రశాంతమైన, ఫేవరేట్ ప్లేస్‌కి వెళ్లి దంపతులు క్వాలిటీ టైమ్ గడిపేలా చేసే ఈ బేబీమూన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో దంపతుల మధ్య నెలకొనే ‘చిక్కని’ అనుబంధంతో పుట్టే పిల్లల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు. ‘ఆమె’ జాగ్రత్త... ప్రెగ్నెన్సీతో ఉండగా దూర ప్రయాణం అనేది కొంచెం క్లిష్టతరమైనదే. గర్భిణులకు డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. కాబట్టి వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం అవసరం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీరపు టెంపరేచర్ ఎన్నో రకాలుగా ఛేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సింగిల్ పీస్ డ్రెస్సెస్, స్ట్రెచ్వెర్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. శాలువ, స్వెటర్లు సైతం క్యారీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మెడికల్ హిస్టరీ, అవసరమైన మెడిసిన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ సైతం దగ్గర ఉంచుకోవాలి. మేమిద్దరం..ముగ్గురమై.. రెగ్యులర్‌గా లీడ్ చేసే నార్మల్ లైఫ్సై్టల్కి భిన్నంగా ‘మనమిద్దరమే ఉన్నామా..’ అన్నట్టుగా ప్రశాంతతను అందించే ఐలాండ్స్ ప్రదేశాలను ఈ బేబీమూన్‌కి ఎంచుకుంటున్నారు. ఈ సమయంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేరెంటల్ స్పా అండ్ మసాజ్‌లు, యోగా థెరపీలు, ఆరోగ్యకరమైన ఆహారం... వంటివి ప్రత్యేకంగా డిజైన్ చేసి మరీ అందిస్తున్నాయి కొన్ని ప్యాకేజ్‌లు. నిపుణుల సూచనలు... బేబీమూన్‌కి ప్రకృతి సిద్ధంగా ఉండే పరిసరాలు, స్వచ్ఛమెన గాలి, నీరు లభించే ప్రదేశాలు ఎంచుకోవాలి. మన దేశంలో అయితే గోవా, ఊటీ, ఆగ్రా, సిమ్లా, కేరళ... వంటి ప్రాంతాలు నప్పుతాయి. అదే విధంగా హోటల్ లేదా గెస్ట్‌హౌస్ దగ్గరలో ఏదైనా ఆస్పత్రి వసతి అందుబాటులో ఉండేట్లు ప్లాన్ చేసుకోవడం అవసరం. ఖర్చు పెట్టేంత బడ్జెట్ చేతిలో ఉన్నప్పటికీ తాము ఉండే ప్లేస్ నుంచి మరీ ఎక్కువ దూరాలు వెళ్లాలనుకోవడం మంచి ఆలోచన కాదు. ఈ ట్రిప్‌ను పూర్తిగా పుట్టబోయే బిడ్డను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకోవాలి. సైట్ సీయింగ్, అడ్వెంచర్స్, ఎంజాయ్ చేయడానికో వెళ్తున్నాం.. అనుకోకుండా కేవలం పుట్టబోయే బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. వారిద్దరి మధ్య ఒక కొత్త మెంబర్ వస్తుందని గుర్తుంచుకొని, తనను ఎలా వెల్కమ్ చేయాలి, ఎలా ఆనందంగా పెంచాలి, వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇంకా బాగా ఎలా పెంపొందించుకోవాలి.. అనే ప్లానింగ్‌కు కూడా ఇది మంచి టైమ్ అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కృష్ణన్ చెప్పారు. -
'మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలు'
కరీంనగర్: తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంత్రులకు అధికారం లేక డమ్మీలుగా ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనకు రెండేళ్లతో హనిమూన్ ముగిసిందన్నారు. మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలైందని అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా శాసనసభను కేసీఆర్ నాశసనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో హరించుపోయిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాదే అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ భగీరథ పథకాల్లో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
ఆయన లేకుండా హనీమూన్‌కి వెళ్లి..
బాలీవుడ్ 'క్వీన్' గుర్తుందా! ఆ సినిమాలో ఒంటరిగా హనీమూన్ కి వెళ్లే యువతిగా కంగనా రనౌత్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు క్వీన్ లాంటిదే ఓ మహిళ నిజజీవిత గాథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన హుమా.. వాళ్లాయన లేని లోటును ఫీలవుతూ దిగిన ఫొటోలు ఫొటోలు వైరల్ అయ్యాయి. పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన హుమా, అర్సలాన్ దంపతులు తమ రెండో హనీమూన్ కోసం చారిత్రక గ్రీస్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కూడా అత్తమామల్ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. అయితే గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో కథ 'క్వీన్' తరహా మలుపు తిరిగింది. అత్తమామలు కూడా ఉన్నప్పటికీ ప్రియమైన భర్త తోడు లేని లోటును ప్రతిక్షణం ఫీలవుతూ హుమా పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు దిగింది. -
స్టార్ క్రికెటర్ హనిమూన్ ముచ్చట్లు
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, రితిక సజదేహ్ దంపతులు హనిమూన్ కు యూరప్ కు వెళ్లారు. గతేడాది డిసెంబర్ లో వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు. వరుస టోర్నమెంట్లతో తీరిలేకుండా గడిపిన రోహిత్ విశ్రాంతి దొరకడంతో యూరప్ లోని కాప్రిలో హనిమూన్ ప్లాన్ చేసుకున్నాడు. తన హనిమూన్ కు సంబంధించిన విషయాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు రోహిత్. 'ఎట్టకేలకు హనిమూన్ కు సమయం చిక్కింది. మేము ప్రయాణించిన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానంలో సదుపాయాలు సూపర్ గా ఉన్నాయి. లాంగ్ జర్నీ చేసి రోమ్ లో దిగాం. ఎతిహాద్ ఎయిర్ వేస్ సిబ్బంది సేవలతో అలసట తెలియలేదు. కాప్రి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయ'ని ట్విటర్ లో కామెంట్లు పెట్టాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేఆప్ కు చేరకపోవడంతో రోహిత్ శర్మకు ముందుగానే సెలవులు దొరికాయి. -
హనీమూన్ లో విషాదం..
బ్యాంకాక్: హనీమూన్ కోసం భర్తతో పాటు విదేశానికి వెళ్లగా అక్కడ విషాదం చోటుచేసుకుంది. బ్రిటన్ కు చెందిన మోనికా ఒ.కార్నర్ తన భర్తతో థాయ్ లాండ్ కు వెళ్లింది. అక్కడ జరిగిన బోట్ ప్రమాదంలో కొత్త జంటలో భార్య, మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కో సమూయ్ తీరంలో పడవలో భార్యాభర్తలు గురువారం సాయంత్రం షికారుకు బయలుదేరారు. వీరితో పాటు మరికొందరు పర్యాటకులు ఉన్నారు. 32 మంది టూరిస్టులు, నలుగురు సిబ్బందితో బోట్ బయలుదేరగా వాతావరణం అనుకూలించకపోవడంతో బోట్ మునిగిపోయిందని కెప్టెన్ గా సనన్ సీకాకియా వ్యవహరించారు. పడవ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి చాలా మందిని త్వరగానే రక్షించినట్లు సమాచారం. జర్మనీకి చెందిన వ్యక్తితో పాటు, హాంకాంగ్ కు చెందిన యువతి కూడా మృతిచెందారని టూరిస్ట్ పోలీసులు వెల్లడించారు. వివాహం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చిన మరో జంట కూడా ఈ ఘటనలో తప్పిపోయారని వారి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని బోటు కెప్టెన్ చెప్పారు. పూజా పార్నెల్, మోనికా భర్తల వివరాలు తమకు అందుబాటులో లేవని వెల్లడించారు. -
చలో ఫారిన్ టూర్!
♦ అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న భారతీయ టూరిస్టులు ♦ కొందరికి ఖర్చు లెక్కలేదు; పొదుపుతో మరికొందరు ♦ ఏటా 1.8 కోట్ల మంది టూరిజానికి; 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా పెళ్లైన జంట. హనీమూన్‌కు భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాలతో పాటు క్వీన్స్‌లాండ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్ వంటివన్నీ చుట్టేశారు. ఇంతకీ ఆ టూర్‌కు సదరు జంట ఖర్చుపెట్టిందెంతో తెలుసా? అక్షరాలా యాభై లక్షలు. మరో జంటను తీసుకుంటే... వారి ఆదాయం తక్కువ. కానీ వారూ కేరళలోని మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చారు. పొదుపుగా... రైల్లో వెళ్లి అక్కడ చక్కగా వారం రోజులుండి వచ్చారు. ఖర్చు రూ.50వేలు మించలేదు. ఈ రెండు ఉదాహరణలూ చూశాక అనిపించేదొక్కటే. భారతీయులు పర్యటనలకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారని మొదటి సంఘటన చెబితే... పర్యటనలకు వెళ్లే ఆర్థిక స్థోమత నిజంగా లేనప్పటికీ కొంచెం కొంచెం పొదుపు చేసుకుని కూడా వెళుతున్నారని తెలుస్తుంది. మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలూ చెప్పేదొక్కటే. దేశంలో ఇపుడు పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు విదేశాలకు విహార యాత్రలంటే నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చేది. దీంతో వెళ్లేవారు కూడా తక్కువే ఉండేవారు. ఇపుడంతా ఇన్స్టంట్. ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చినా, లేదా ప్రసార మాధ్యమాల్లో ఆకట్టుకునే ప్రకటన చూసినా వెంటనే క్రెడిట్ కార్డు స్వైప్ చేయటమో, బ్యాంకుల్ని సంప్రదించటమో చేస్తున్నారు. బ్యాంకులు కూడా ముందు పర్యటనకు వెళ్లి వచ్చేసి... ఆ తరువాత సదరు మొత్తాన్ని తీరిగ్గా ఈఎంఐలలో కట్టే ఆఫర్లు అందిస్తున్నాయి. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ గనక మరింత సరళతరమైతే విదేశీ టూర్లు ఇంకా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సేద తీరాల్సిందే...! విదేశీ టూర్లు ఒకప్పుడు సంపన్నులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు మధ్యతరగతి వారూ ఆసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఆదాయాలు పెరగటంతో పాటు టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటు ధరల్లోకి వచ్చాయి. కంపెనీలు సైతం అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీలు తయారు చేస్తున్నాయి. అందుకే విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి’’ అని ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వివిధ దేశాల్లోని దర్శనీయ ప్రాంతాలను సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసి ఇట్టే ఆకర్షితులవుతున్నారని, ఒత్తిడి నుంచి కాసింత ఉపశమనం కోసం విహార యాత్రలు, సాహస యాత్రలు, షాపింగ్‌కు దేశాలను దాటుతున్నారని ఆయన చెప్పారు. మరో కొత్త పోకడను చూస్తే... గతంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లి... అక్కడ బాగా ప్రాచుర్యం ఉన్న ప్రాంతాలనే చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలనూ చుట్టేసి వస్తున్నారు. అపార్ట్మెంట్, విల్లా, ఫామ్ హౌజ్ అద్దెకు తీసుకోవడం, గ్రామంలో బస చేయడం వంటివి పెరుగుతున్నాయి. సముద్ర ప్రయాణం చేస్తూ క్రూయిజర్‌లో సేద తీరటమూ ఈ మధ్య పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. భారతీయుల కోసం.. భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న వారిలో అత్యధికులు స్విట్జర్లాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, లండన్, యూఎస్లనే ఎంచుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐదే టాప్-5 డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి కూడా. ఇక దుబాయి, సీషెల్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, వియత్నాం, కంబోడియా, చైనా, బాలి, మెక్సికో, కెనడా తదితర ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే టూర్లు పెరుగుతున్నాయి. భారతీయులను ఆకట్టుకోవడానికి దుబాయిలో ప్రపంచంలోనే తొలి బాలీవుడ్ థీమ్ పార్క్ ఏర్పాటవుతోంది. అక్టోబరులో ఇది ప్రారంభం కానుంది. విహార యాత్రల కోసం భారత్ నుంచి ఏటా 1.8 కోట్ల మంది విదేశాలకు వెళ్తుండగా... 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. వ్యవస్థీకృత సంస్థల ద్వారా 25 శాతం మంది టూర్లను ఎంచుకుంటుండగా మిగిలిన వారు స్థానిక ఆపరేటర్లను సంప్రదించటం, కొందరు ఇంటర్నెట్ సాయంతో సొంతగా టూర్లను ఎంచుకోవటం వంటివి చేస్తున్నారు. కొందరు విమాన టిక్కెట్లు తీసుకుని... తాము చేరాలనుకున్న దేశం చేరాక... అక్కడే స్థానిక టూర్ ఆపరేటర్‌ను ఎంచుకుంటున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు టాప్ సిటీస్‌గా నిలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ వంటివి యాత్రికులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. కాకపోతే వీసా చార్జీలు మరింత తగ్గాల్సి ఉంది. కొన్ని దేశాల వీసాల కోసం ఎంబసీల చుట్టూ తిరిగే ఓపిక లేక చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ మరింత సరళతరమైతే విదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికమవుతుంది’’ అని ఓ ట్రావెల్ కంపెనీ అధిపతి అభిప్రాయపడ్డారు. వాయిదాల్లో చలో.. దేశంలోని టూర్ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న థామస్ కుక్ ద్వారా ఏటా లక్ష మంది విహార యాత్రలకు విదేశాలు చుట్టివస్తున్నట్లు జతిందర్ పాల్ సింగ్ చెప్పారు. ‘‘మేం నాలుగు కేటగిరీల్లో ప్యాకేజీలందిస్తున్నాం. అల్ట్రా లగ్జరీ విభాగంలో 3 శాతం మంది, ప్రీమియం 25 శాతం, వాల్యూ 35 శాతం, మిగిలినవారు బడ్జెట్ విభాగంలో వెళుతున్నారు’’ అని ఆయన చెప్పారు. ప్యాకేజీనిబట్టి ఒక జంటకు యూరప్ ట్రిప్‌కు వరుసగా రూ.4 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.79 వేలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. తాము వాయిదాల్లోనూ ప్యాకేజీలు అందిస్తున్నామని, దీనికి బాగా డిమాండ్ ఉందని తెలియజేశారు. -
నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది...
యూరాలజీ కౌన్సెలింగ్ నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. అప్పటి నుంచి తరచూ మూత్రంలో మంట, నొప్పి వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, హైదరాబాద్ మహిళలకు పెళ్లైన కొత్తలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. దీన్నే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. కలయిక సమయంలో యోనిమార్గంలోని సూక్ష్మక్రిములు మూత్రాశయంలోకి ప్రవేశించడం వల్ల ఇలా అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూడు రోజులు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది తగ్గిపోతుంది. మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా చాలా అవసరం. మా ఆవిడ వయసు 45 ఏళ్లు. నెల రోజల క్రితం మూత్రంలో రక్తం పడిపోయింది. అప్పటి నుంచి క్యాన్సరేమోనని ఆందోళన పడుతోంది. - మహేందర్‌రావు, మెదక్ మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, మూత్రవాహికలో రాళ్లు ఉండటం, క్యాన్సర్, టీబీ వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా రక్తం పోతుంది. ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకోడానికి స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కారణానికి తగిన చికిత్స చేస్తారు. ఒక్కోసారి రక్తం పడుతుండే ఈ లక్షణాన్ని చూసి ఇన్ఫెక్షన్గా భావించి, యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇది సరికాదు. కనీసం అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి... రాళ్లు, గడ్డలు లాంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ సనంద్ బాగ్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా మెడ, చెవుల భాగంలో దురద వస్తోంది. నా రోల్డ్‌గోల్డ్ చైన్ మెడకు ఆనే చోట ఈ దురద వస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది డర్మటైటిస్ కావచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: స్పర్శను బట్టి వచ్చే చర్మ వ్యాధి ఇది. ఇందులో చర్మం గులాబీ రంగుకు మారుతుంది. ఇది దురదను కలిగిస్తుంది. చికాకు, అలర్జీని కలిగిస్తుంది. రబ్బరు తొడుగుల వల్లగానీ లేదా ఆభరణాలోని కోబాల్ట్ వంటి లోహాలు ఈ జబ్బుకు కారణమవుతాయి. కొన్ని పరిమళ ద్రవ్యాలు, నగలు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల ఇది సంభవించవచ్చు. నుమ్యులార్ డర్మటైటిస్: నుమ్యులార్ డర్మటైటిస్లో నాణెం ఆకృతిలో మచ్చలు వస్తాయి. ఇవి కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా ఇది 55 నుంచి 65 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా ఉండటం, కొద్దిగా పొరలు తయారవ్వడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపు రంగులో కములుతుంది. తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిని సంతరించుకుంటాయి. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లలలో కనిపిస్తుంది. ముఖం, తల మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా ఉంటుంది. కనుబొమల వద్ద, ముక్కు పక్కల వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు. కారణాలు: కొన్ని రకాల మందులు జుట్టుకోసం వాడే రంగులు కుంకుమ మొదలైన పదార్థాల వల్ల డర్మటైటిస్ వస్తుంది. జంతుచర్మాలతో తయారైన ఉత్పాదనలు, రోల్డ్‌గోల్డ్ నగల వల్ల కూడా డర్మటైటిస్ రావచ్చు. డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్, క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి డీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అత్తగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండెదడ వంటివి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. హార్ట్ వాల్వ్‌లలో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు కారణాల గురించి దయచేసి తెలపండి. - సునీత, నందిగామ మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అత్తగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి.. 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4) అయోర్టిక్ వాల్వ్. వీటిలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్). వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల కూడా రావచ్చు. వాల్వ్ సమస్యలో లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ-గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు. వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాల్లో సమస్య తలెత్తితే ఈ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం. వాల్వ్స్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్. మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది టిష్యూ వాల్వ్స్ ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడమే మేలు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
హనీమూన్ యాత్ర మధ్యలో వెళ్లిపోయాడు..
ఢిల్లీ: వివాహం అనంతరం కొత్త దంపతులు సంతోషంగా హనీమూన్‌కు బయలుదేరారు. అయితే ఎమైందో ఏమో తిరుగు ప్రయాణంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అసహనానికి గురైన భర్త మధ్యలోనే ఫ్లైట్ దిగి వెళ్లిపోయాడు. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా లక్నోకు చెందిన కొత్త దంపతుల హనీమూన్ యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హనీమూన్‌ను సంతోషంగా గడుపుదామని గోవాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విమానం గోవా నుండి లక్నోకు వస్తుండగా కొత్త దంపతులు గొడవపడ్డారు. అంతే పాట్నా విమానాశ్రయంలో ఫ్లైట్ ఆగగానే కొత్తపెళ్లికొడుకు దిగి వెళ్లిపోయాడు.విమాన ప్రయాణంలో ప్రయాణికులు గమ్య స్థానానికి చేరక ముందే మధ్యలోనే దిగిపోవడానికి అనుమతించరు. విమాన సిబ్బంది సరిగా తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ప్రయాణికుడు ప్రయాణం మధ్యలోనే వెళ్లిపోయాడని అధికారులనుండి విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఇండిగో విమాన ప్రతినిధులు మాట్లాడుతూ విమానం గమ్య స్థానానికి చేరక ముందే ఇలా మధ్యలో దిగిపోయే ప్రయాణికులు చాలా అరుదు అని వ్యాఖ్యానించారు. అయితే అతని వివరాలు తెలపడానికి మాత్రం నిరాకరించారు. -
హనీమూన్‌కు వెళ్లడం లేదు: హర్భజన్
నేడు గీతా బాస్రాతో వివాహం న్యూఢిల్లీ: భారత జట్టు క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న స్పిన్నర్.. గురువారం తన స్నేహితురాలు గీతా బాస్రాను వివాహామాడనున్నాడు. జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టానని భజ్జీ అన్నాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పాడు. ‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన ఆశీస్సులతో నేటి నుంచి నా జీవితంలో కొత్త ఆధ్యాయం ప్రారంభమవుతుంది. అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఇప్పటికైతే హనీమూన్ ప్రణాళికలు లేవు. పెళ్లి తంతు ముగిశాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బరిలోకి దిగాలి. పీసీఏ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి’ అని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన బౌలింగ్ సంతృప్తినిచ్చిందని హర్భజన్ అన్నాడు. ‘తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కకపోవడంపై విరాట్‌తో మాట్లాడా. ప్రొటీస్ జట్టులో ముగ్గురు కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. నిజంగా జట్టు కూర్పు గురించి ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. అయితే టెస్టుల్లో చోటు కోసం పోరాడుతూనే ఉంటా’ అని హర్భజన్ వివరించాడు. -
ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్
గువాహటి: వృద్ధాశ్రమంలో ఉంటున్న ఇద్దరు వృద్ధులు వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు మేఘాలయ రాజధానిలోని షిల్లాంగ్‌కు హనీమూన్‌కు కూడా వెళ్లారు. శాంతను కుమార్ దాస్(73) మంజు సిన్హా రాయ్(63) గువాహటిలో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 'వాళ్లిద్దరి మధ్య తొలిచూపులోనే ప్రేమ చిగురించింది. వృద్ధాశ్రమంలోకి రాగానే వారిమధ్య బంధం ఏర్పడింది. కానీ మాకు మాత్రం ఈ మధ్యకాలంలో మూడు నెలల కిందట తెలిసింది. దీంతో మేం వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించాం' అని ఓల్డేజ్ హోమ్ కార్యదర్శి మోనికా శర్మ తెలిపింది. కుమార్ దాస్ సొంత ప్రాంతం కరీంగంజ్ జిల్లా. పదవీ విరమణ పొందిన ఇంజినీర్ గా ఉండి ఆయన భార్య చనిపోవడంతో 2012 ఈ ఓల్డేజ్ హోంకు వచ్చాడు. ఇక మంజు సిన్హా రాయ్‌ది సమీపంలోని లాల్ గణేశ్ ప్రాంతం. ఆమె కూడా 2012లోనే ఓల్డేజ్ హోంకు వచ్చింది. వారిద్దరికీ పిల్లలు లేరు. వారి వివాహానికి దాదాపు రెండు వేలమంది హాజరై ఆశీర్వదించారు. -
ఎవరు నేర్పారో!
మనుషులు, పక్షులే కాదు.. జలచరాలు కూడా వలసవాదులే. చేపలు ఉప్పునీటి నుంచి మంచి నీటిలోకి, మంచి నీటి నుంచి ఉప్పు నీటిలోకి వలస వెళ్తుంటాయి. ఈ వలసలను సదరు జలపుష్పాలు హనీమూన్‌గా భావిస్తాయేమో కానీ.. ఈ కాలాన్నే అవి తమ ప్రత్యుత్పత్తికి అను వుగా భావిస్తాయి. గుడ్లు పెట్టి పొదుగుతాయి. గుడ్లు పొదిగిన తర్వాత పుట్టుకొచ్చే చేపపిల్లలు మాత్రం తిరిగి వాటి సొంత నెలవుకు వెళ్లిపోతాయి. ఉప్పునీటిలో పుట్టినవి మంచి నీటిలోకి.. మంచినీటిలో పుట్టినవి ఉప్పునీటిలోకి క్యూ కడతాయి. అప్పుడే పుట్టిన ఈ మీనాలకు ఆ దారి ఎలా తెలుస్తుందన్నది మాత్రం దేవ రహస్యమే! ఈ మర్మాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా.. వీటికి ఈ విషయం ఎవరు నేర్పారో మాత్రం కనుక్కోలేకపోతున్నారు. -
లవ్ జర్నీ
హనీమూన్ కోసం 15 దేశాల్లో సైకిల్ సవారీ దేవరపల్లి చేరుకున్న ఫ్రాన్స్ దంపతులు ‘ప్రేమయాత్రలకు కొడెకైనాలు..కాశ్మీరాలు ఏలనో’.. అంటూ గుండమ్మకథలో ఏఎన్నార్, జమున ఆడిపాడిన యుగళగీతం తెలుగు శ్రోతల మదిలో ఎప్పటికీ మార్మోగుతుంటుంది. ఆ కథానాయికలు హనీమూన్ వద్దనుకున్నా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఓ చిన్నది, ఓ చిన్నోడు అలా అనుకోలేదు. వారి ‘ప్రేమ దేశాలు’ దాటి ప్రయాణిస్తోంది. విశ్వవ్యాప్తమై పరిమళిస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లయ్యాక హనీమూన్‌ను వినూత్నంగా జరుపుకోవాలనుకున్నారు. ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరిన వీళ్లిద్దరూ ఎన్నో దేశాల్లో తిరిగి ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. మంగళవారం దేవరపల్లి చేరుకున్న మాధ్యూ, మేలిస్ అబాడై దంపతులు స్థానిక బసంతి హోటల్లో విలేకరులకు అందించిన ఆసక్తికరమైన విశేషాలు వారి మాటల్లో.. 2014 జూలై 12న మాధ్యూ, మేలిస్ అబాడై వివాహం జరిగింది. జూలై 27న ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరారు. పదిహేను దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు 10 దేశాల్లో పర్యటించి 11వ దేశమైన భారతదేశం చేరుకున్నారు. ఈ ఏడాది జూలై 25 నాటికి యాత్ర పూర్తి చేసుకొని స్వదేశానికి వెళ్తారు. రోజుకు వంద కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు. ఇందుకు రోజుకు సుమారు రూ.1,000 ఖర్చవుతోంది. యాత్ర ముగిసేటప్పటికి మొత్తం రూ.4 లక్షలు ఖర్చవుతుంది. సైకిల్ ఖరీదు రూ.60 వేలు జర్మనీలో తయారైన సైకిల్‌ను రూ.60 వేలకు కొనుగోలు చేసి 15 దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆర్మేనియా నుంచి సైకిల్‌ను విమానంలో ముంబయికి తీసుకొచ్చారు. ముంబయి నుంచి సైకిల్‌పై కన్యాకుమారి, చెన్నై, శ్రీలంక వెళ్లారు. అక్కడినుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఇప్పటి వరకు థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, షార్జా, గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని దంపతులు తెలిపారు. ఫ్రాన్స్, యూరప్ దేశాల్లో వరి పంట ఉండదన్నారు. ఇక్కడి వ్యవసాయానికి, ఫ్రాన్స్ వ్యవసాయానికి తేడా ఉందన్నారు. జూన్ 27 నాటికి కోలకత్తా చేరుకొని యాత్రను ముగిస్తామని, అక్కడి నుంచి విమానంలో ఫ్రాన్స్ వెళ్తామని మాధ్యూ తెలిపారు. న్యాయవాదిగా పనిచేస్తున్న మేలిస్ అబాడైను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆయన తెలిపారు. దంపతులకు జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కైరం అప్పారావు వీడ్కోలు పలికారు. - దేవరపల్లి -
హనీమూన్‌కో తోడు కావాలి
‘‘కాబోయే ఆలి కాను పొమ్మంది... తేనెచంద్రుడి లీల తోడు రమ్మంది’’ అంటూ ఆహ్వానిస్తున్న అతగాడిని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. యుకెలోని లీసెస్టర్‌షైర్ వాసి జాన్ వైబ్రెడ్ (32)కి హనీమూన్ వెళ్లడానికి తోడు కావాలిట. ముక్కూ ముఖం తెలీనోడితో ఎవరైనా అలా వెళతారా? అని విస్తుపోకండి. తన ముక్కూ ముఖం చూపే ఫొటోతో పాటు తనెంత సరదా మనిషో ఎంత బాగా కంపెనీ ఇస్తాడో ఇ-బేలో ప్రత్యక్షంగా ప్రకటించుకుంటున్నాడు మన జాన్. ఇంతకీ కధ ఏమిటంటే... జాన్‌కి రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్న గాళ్‌ఫ్రెండ్‌తో పెళ్లి సెటిలైంది. మనోడు ఝామ్మని ఊహల్లో తేలిపోతూ... డొమినికన్ రిపబ్లిక్కి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. విలాసవంతమైన బస, ప్రయాణాలకు గాను తనకు, తన ఫియాన్సీకి చెరో 1050డాలర్లు చెల్లించుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ... గత క్రిస్మస్ ముందు ... ‘సరిజోడు కాదు నువ్వు... ఇక చాలు మన లవ్వు’ అంటూ సదరు కాబోయే సతి కాస్తా టాటా చెప్పేసింది. హతవిధీ అనుకున్న జాన్... తేరుకుని హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామంటే అప్పటికే సమయం మించి పోయింది. ట్రావెల్స్వారు క్యాన్సిల్ గీన్సిల్ జాన్తానై ఫుల్ మనీ రిటర్న్ చేయం భాయ్ అనేశారు. ఏమి చేయాలో పాలుపోని జాన్... గాళ్‌ఫ్రెండ్ టిక్కెట్ వేస్ట్ కాకూడదని ‘‘నేనొక 5 అ. 9 అం. ఎత్తులో స్లిమ్‌గా ఉండే, నల్లని వత్తయిన జుత్తు కలిగిన, హాస్యాన్ని పండించే అడ్వంచరస్ పర్సన్‌ని, క్రిమినల్ రికార్డూ లేదు. హనీమూన్ ట్రిప్‌కి నాతో తోడవుతారా?’’ అంటూ. ఇ-బేలో తన గాళ్‌ఫ్రెండ్ టిక్కెట్‌ని వేలానికి పెట్టాడు. దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ టిక్కెట్ అనూహ్యంగా 8వేల డాలర్లకు అమ్ముడైంది. తమ ఖర్చులకు పోను మిగిలిన మొత్తాన్ని కాన్సర్ వ్యాధి నివారణకు విరాళంగా ఇస్తానంటున్నాడీ సూపర్ లవర్. ఈ వెరైటీ హనీమూన్ ఫ్లయిట్ ఫిబ్రవరి 16న టేకాఫ్ తీసుకోనుంది. -
హనీమూన్‌కు విదేశాల కంటే స్వదేశమే బెస్ట్
న్యూఢిల్లీ: భారత్‌లో 60 శాతం కొత్త జంటలు హనీమూన్‌కు విదేశాల కంటే స్వదేశంలోని మనసుకు ఉల్లాసం కలిగించే ప్రాంతాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. 40 శాతం జంటలు మాత్రం విదేశాలకు వెళుతున్నాయి. దీనికి ఆర్థికం, సమయం కారణాలుగా సర్వేలో తేల్చారు. ‘హ్యాపీట్రిప్.కామ్’ఇటీవల నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. -
అతడి కోసం ఆమె
హృదయం: ‘పాశ్చాత్యులకు ఎమోషన్స్ ఉండవు’, ‘వివాహ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వరు’, ‘జీవిత భాగస్వామి కోసం త్యాగాలు చెయ్యరు’, ‘ఎవరి జీవితాలు వాళ్లవి’... ఇలాంటి అభిప్రాయాలు చాలానే ఉంటాయి మనకు. ఈ అభిప్రాయాలు నిజమే అవడానికి ఉదాహరణలు కూడా బోలెడు కనిపిస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన జాన్ - నికోలాల కథ తెలుసుకున్నాక, మన అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సిందే. తొలి చూపులోనే ప్రేమ గురించి వింటుంటాం. కంటుంటాం! కానీ జాన్ - నికోలాలది తొలిచూపు ప్రేమ కాదు, తొలిచూపు పెళ్లి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, తనే నా జీవిత భాగస్వామి అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడమే కాదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ పరస్పర అంగీకారంతో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. కొన్ని రోజులకే వాళ్లిద్దరి పెళ్లయిపోయింది. వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు. రెండు వారాలపాటు ప్రపంచాన్ని మరిచిపోయారు జాన్, నికోలా. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జీవిత కాలానికి సరిపడా అనుభూతులతో ఇంటికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత దైనందిన జీవితం మొదలైంది. ఇంట్లోనూ రోజూ హనీమూన్లాగే గడిచింది. ఓవైపు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూనే ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగించారు. కానీ, ఆ సంతోషానికి రెండు వారాల్లోనే తెరపడింది. ఓ రోజు జాన్ రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. షాక్ తిన్న నికోలా అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు. జాన్‌కు ట్యూమర్ ఉందని. అది ముదిరి క్యాన్సర్‌గా మారిందన్నాడు. ఇద్దరూ నిలువునా కూలిపోయారు. కొన్ని రోజులు గడిచాక, జాన్ ఎక్కువ కాలం బతకడన్న చేదు నిజాన్ని కూడా చెప్పారు వైద్యులు. అయినా చికిత్స మొదలుపెట్టారు. జాన్, నికోలాలకు ఆసుపత్రే ఇల్లయింది. జాన్ మృత్యు పోరాటం మొదలైంది. జాన్‌కు కూడా తన పరిస్థితి అర్థమైంది. చికిత్స సాగుతుండగా నికోలాను పిలిచి, తన జీవిత కాల కోరిక గురించి చెప్పాడు. తండ్రి కావడమే ఆ కోరిక. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నికోలాకు. అయినా దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. నిజానికి జాన్ పరిస్థితి చూస్తే, ఏ అమ్మాయీ తల్లి కావడం గురించి ఆలోచించదు. కానీ నికోలా జాన్ కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఎవరెంత వారించినా, వినకుండా తాను తల్లి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. వైద్యులకు విషయం చెబితే, జాన్‌కు కీమోథెరపీ చేశాక పిల్లలు పుట్టే అవకాశం తక్కువని భావించి, అతడి వీర్య కణాలు తీసుకున్నారు. వాటితో నికోలాను తల్లిని చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అది విజయవంతమైంది. ఆమె గర్భం దాల్చింది. స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్నది కవలలని కూడా తేలింది. అయితే ఇంత సంతోషకరమైన వార్త తెలిసేసరికే జాన్ మృత్యువుకు మరింత చేరువైపోయాడు. కదల్లేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. అయినా భార్య ఆ సంగతి చెప్పగానే, చిన్న మూలుగు ద్వారా తన సంతోషాన్ని వెల్లడించాడు. అయితే ఆ వార్త వినడం కోసమే అన్ని రోజులు ఆగాడో ఏమో... అది తెలిసిన రెండో రోజుకే జాన్ ప్రాణాలు వదిలాడు. ప్రాణంలా ప్రేమించిన భర్త దూరమైనా, అతడి ఆఖరు కోరిక తీర్చడం కోసం గుండె దిటవు చేసుకుంది నికోలా. అతడి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తూ కడుపులోని చిన్నారుల్ని క్షేమంగా బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఐదు నెలలు గడిచాయి. అప్పుడామెకు ఆరో నెల. అంతా సవ్యంగా సాగిపోతుండగా, నికోలాకు వినికిడి సమస్య మొదలైంది. విపరీతమైన తలపోటు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే, మళ్లీ ఓ పిడుగులాంటి వార్త. ఆమెకు కూడా ట్యూమర్ ఉందన్నారు వైద్యులు. తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది నికోలా. అప్పటికే ఎంతో పోరాడిన తాను, ఇక పోరాటం చేయలేననుకుంది. కడుపులోని బిడ్డల్ని, జాన్‌ను తలుచుకుని కొన్ని రోజులపాటు ఏడ్చింది. దేవుణ్ని నిందించింది. కానీ చివరికి భర్త ఆఖరు కోరికను గుర్తుచేసుకుంది. కడుపును తడిమి చూసుకుంది. వాళ్లకోసమైనా బతకాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు అండగా నిలిచారు. అందరి సహకారంతో ట్యూమర్‌పై పోరాటం సాగించింది. ఆ పోరాటం సాగుతుండగానే, ఆమె ఇద్దరు పండంటి మగ కవలల్ని ప్రసవించింది. ఇప్పుడామెకు ప్రాణాపాయం తప్పింది. కానీ ట్యూమర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. పిల్లల్ని చూసుకున్నాక, ఆమెకు జీవితంపై మరింత ఆశ కలిగింది. జాన్ ఆలోచనలు తెలిసిన నికోలా... అతడి ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా జీవన పోరాటం సాగిస్తోంది. అంతేకాదు.. ట్యూమర్, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఓ ట్రస్టు ఆరంభించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తోంది. జాన్ తన ఆఖరు కోరిక గురించి చెప్పకపోయి ఉంటే... ఈపాటికి తాను కూడా మృత్యు ఒడికి చేరేదాన్నని, జాన్ కోసం, పిల్లల కోసం పోరాడటం వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని అంటుంది నికోలా. -
మా పెళ్లికి రండి... ఖర్చులు చెల్లించండి!
ధోరణి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడొక చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. మామూలుగానైతే, శుభలేఖలో ‘అందరికీ ఆహ్వానం’ ‘మీ రాక మాకు సంతోషకరం’ ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం... ఇలాంటి వాక్యాలతో పాటు- ‘పెళ్లి ఖర్చులకు మీ వంతుగా సహకారం అందించండి’ ‘హనీమూన్ ఖర్చులకు సహాయం అందించండి’ లాంటి వాక్యాలకు తోడు బ్యాంకు ఎకౌంట్ నంబర్ కూడా ఇస్తున్నారు. విశేషమేమిటంటే, ఇలాంటి పెళ్లిళ్లకు ఎవరూ ముఖం చాటేయడం లేదు. తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. శుభలేఖలో వినోదం ఖర్చులు సమర్పించిన వారు, విందు ఖర్చులు సమర్పించినవారు, బ్యాండు ఖర్చులు సమర్పించినవారు లాంటి కొత్త మాటలు కనిపిస్తున్నాయి. శుభలేఖలో ప్రచురించే ఖర్చుల జాబితాలో తమ పేరును చూసుకోవడానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. ‘‘ఇది ఖర్చు అనుకోవడం లేదు. నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను’’ అంటున్నాడు లెమన్స్ (ఫ్రాన్స్) పట్టణానికి చెంది మైఖేల్ అనే ఉద్యోగి. తన మిత్రుడి పెళ్లికి అయిన విందు ఖర్చును తానే భరించాడు. ఇటీవలే లండన్‌లో పెళ్లి చేసుకున్న జంట కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. పెళ్లి ఖర్చులు పోను అదనంగా కొంత డబ్బు మిగిలింది. ఆ మొత్తాన్ని ఒక అనాథాశ్రమానికి ఇచ్చారు. ఈ పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందిన వారు రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు. పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటున్న అయిదుగురిలో నలుగురు ఈ ధోరణినే అనుసరిస్తున్నారు. పెళ్లికి అవసరమైన ఖర్చులు భరించగలిగే స్థోమత ఉన్నప్పటికీ, ప్రముఖుల పెళ్లిళ్ల మాదిరిగా ఆడంబరంగా జరుపుకోవాలనుకునే వారు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘‘ఈ విధానం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు’’ అంటున్నాడు చార్లెట్ అనే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్. పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందినవారే రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు. -
హనీమూన్‌లో స్కూబా డైవింగ్
నవ దంపతులు ఏకాంతంగా ఎంజాయ్ చెయ్యడానికి హనిమూన్‌కు వెళుతుంటారు. నటి అమలాపాల్ తన భర్త, దర్శకుడు విజయ్‌తో హనీమూన్‌కు వెళ్లి స్కూబా డైవింగ్‌లో ఎంజాయ్ చేశానంటున్నారు. విజయ్, అమలాపాల్ ప్రేమలో మునిగి తేలి ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నవ దంపతులు హనీమూన్‌ను మాల్దీవుల్లో గడిపొచ్చారు. ఈ ట్రిప్‌లో తాము తీసుకున్న కొన్ని ఫొటోలను అమలాపాల్ ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. వీటికి పలువురి నుంచి అభినందనలతో పాటు విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేశారు. హనిమూన్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నటి అమలాపాల్ తన అనుభవాన్ని పంచుకుంటూ స్త్రీకి పరిపూర్ణ జీవితం వివాహంతోనే వస్తుందన్నారు. అలాగే పెళ్లి తర్వాత మహిళలో దాగి ఉన్న ప్రతిభను కనుగొనవచ్చునన్నారు. తన వరకు క్రీడ అంటే చాలా ఆసక్తి అని తెలిపారు. హనీమూన్ సమయంలో తన క్రీడాసక్తిని సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందిన తాను మాల్దీవుల్లోని నదిలో ఈది పరవశం పొందానన్నారు. ఇది తనకు ఒక స్వర్గ లోకంగా అనిపించిందని పేర్కొన్నారు. నిజానికి తాను స్విమ్మింగ్ క్రీడాకారిణినని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లినప్పుడు కూడా స్విమ్మింగ్ క్రీడల్లో పాల్గొన్నానని అమలాపాల్ వెల్లడించారు. -
హనీమూన్ల కోసమే దళితుల ఇళ్లకు
రాహుల్‌పై బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు లక్నో: హనీమూన్లు, విహార యాత్రల కోసమే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తుంటారని బాబా రాందేవ్ విమర్శించారు. ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఆయన అదృష్టం మరింత బాగుండేదని, ప్రధాని అయివుండేవారని శుక్రవారం వ్యాఖ్యానించారు. విదేశీ వనితను వివాహం చేసుకుంటే ప్రధాని పదవి చేజారి పోతుందని, ముందు ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత విదేశీ మహిళను పెళ్లి చేసుకోవచ్చని సోనియా చెబుతుండడంతో రాహుల్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారని బాబా ఎద్దేవా చేశారు. భారతీయ వనితను చేసుకోవడం రాహుల్‌కు ఇష్టం లేదని చెప్పారు. రాహుల్ బలవంతంగా ఒంటరి జీవితం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, తన వ్యాఖ్యలు వివాదమవుతాయని భావించిన బాబా.. దళితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానన్నారు. -
హనిమూన్‌కు వెళ్తు మృత్యు ఒడిలోకి....
ఉన్నత విద్య పట్టా పొందాకే మూడు ముళ్లు అనుకున్నారు ఆ ప్రేమికులు. అందుకోసం మూడేళ్లు వేచి ఉన్నారు. ప్రియుడు అనుకున్నట్లు పట్టా సాధించాడు. దీంతో ఆ ప్రేమికురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇరువురు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైందీ దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన ఓ ప్రేమికుల జంట. వారి కోరికను ఇరు కుటుంబాల వారు పెద్ద మనస్సుతో పచ్చ జెండా ఊపారు. అయితే వారిద్దరు కలిసి ఏడుగులు నడవడం దేవుడికి మాత్రం అందుకు ఇష్టపడినట్లు లేదు. దాంతో వివాహమై హనిమూన్ వెళ్తున్న వారిని అనంతలోకాలకు సాగనంపాడు. దక్షిణాఫ్రికాలోని భారతీయ భారతీయ సంతతికి చెందిన మెడికల్ టెక్నాలజీస్ట్ అశీల్ రెడ్డి, దీపికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ క్రమంలో పెద్దలు వారిద్దరికి ఆదివారం వివాహం చేశారు. దాంతో కొత్త దంపతులు సరికొత్త ఆశలతో హనిమూన్‌కు కారులో బయలుదేరారు. అయితే వారు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో కొత్త జంటతోపాటు ఎదురు వాహనంలోని యువకుడు అక్కడికక్కడే మరణించారు. అంగరంగ వైభవంగా జరిగిన అశీల్ రెడ్డి, దీపికల వివాహమై అప్పుడే అనంతలోకాలకు చేరుకోవడంతో ఇరుకుటుంబాల వారితో బంధుమిత్రలు తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు. అయితే ఆ దుర్ఘటనలో ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. -
దక్షిణం: బేబీమూన్‌కు రెడీయా?!
జీవితంలో గుర్తుండే అరుదైన విషయం హనీమూన్! ప్రపంచం మనల్ని, మనం ప్రపంచాన్ని వదిలేసిన ఏకాంతం అది. ఆ కబుర్లు, ఆ చేష్టలు, ఆ ముచ్చట్లు.. రాజు-రాణి ఒకరికొకరు సేవకులుగా తరించే ఆ మధుర క్షణాలు అలిఖిత ఆటోబయోగ్రఫీలో చెరగని క్షణాలు. అందుకే దాన్నెవరూ వదులుకోరు. సరే...గాని! మీరింకా అక్కడే ఆగిపోయారా... జీవితంలో కొత్త మార్పులు ఎంత వేగంగా వస్తున్నాయండీ! అవన్నీ తెలుసుకోకుంటే ఎలా? మనం నూరేళ్లు హాయిగా జీవించాలంటే... జీవితం దశలు దశలుగా మారుతూ ఉండాలి. బాల్యం, యవ్వనం, మధ్యవయసు, పెద్దరికం, వృద్ధాప్యం. ఇందులో ప్రీతిపాత్రమైన యవ్వనమే ఎప్పటికీ జ్ఞాపకం. అందులో మంచి జ్ఞాపకాలు ఒకటి హనీమూన్, రెండు బేబీమూన్. ఈ రెండోదేంటి? ఇంకా ఇండియాలో పూర్తిగా పాపులర్ కాలేదు గాని వచ్చేసింది. పెళ్లయిన తర్వాత దంపతులకు ఏకాంతం ఎంతో సుఖం. దాన్ని మాయం చేసేది పిల్లలు. రెండూ ఇష్టమైనవే. కానీ ఏదో ఒకటి వదులుకోవాలి. అలా ఏకాంతాన్ని వదులుకునే ముందు దాన్ని ఓ పరాకాష్టలో అనుభవించాలనే ఆలోచనే బేబీమూన్. ఇక నుంచి జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. పిల్లలయ్యాక ఏకాంతం అన్నది కొంచెం కష్టమే. బాధ్యతలు కూడా కుదరుగా ఉండనివ్వవు. అందుకే దాన్ని మరింతగా అనుభూతి చెందేందుకు పిల్లలు పుట్టబోయే రెండు నెలల ముందు వెళ్లేదే బేబీమూన్. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇద్దరూ ఊసులు చెప్పుకుంటూ గడిపి లోకాన్ని మరిచిపోతే అది జీవితకాల జ్ఞాపకాల ఆస్తి. కాబట్టి ఆ వెలకట్టలేని క్షణాలను మిస్ అవ్వద్దు. గర్భంతో ఉన్నపుడు ఆహ్లాదకరంగా గడిపే క్షణాలు బిడ్డకూ క్షేమమే. ఇంకా ఇది మీ భాగస్వామికి తెలియకముందే ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేయండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఇపుడు ఇండియాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో బేబీమూన్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా దీనికి ఏర్పాట్లు చేస్తున్నాయి. బేబీ మూన్ టిప్స్: కబుర్లు ఎంత చిలిపిగా ఉంటే అంత మంచిది తక్కువ ప్రయాణం చేసేలా దగ్గరలో ఉన్నవాటికి వెళ్లడం మంచిది బేబీమూన్ ఏడునెలల లోపే చేయాలి వాటర్ స్పోర్ట్స్, జాయ్ రైడ్స్ వద్దు ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది ప్రకృతి అందాలతో నిండిప్రదేశాలకు వెళ్లాలి. తక్కువగా తిరగండి ఇపుడు అంతర్జాతీయ ట్రావెల్స్ సంస్థలు దీన్ని ప్లాన్‌చేసి ఇస్తున్నాయి. గిఫ్ట్ ఐడియా ! పుట్టిన రోజు గిఫ్ట్ ఎక్స్పెక్టెడ్. పెళ్లి రోజు గిఫ్ట్ ఎక్స్పెక్టెడ్. వాలెంటైన్స్ డే కూడా ఊహించేదే. మరింత సర్ప్రైజ్ చేసి, మరింత ప్రేమ పంచాలనుకునేవారికి ఇంకా అవకాశాలున్నాయి. అదే...‘కిస్ డే’. ప్రేమ కూడా వెన్నెల వంటిదే. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ అన్నిసార్లు ఒకేలా కనిపించదు. అమావాస్యలా ఒకోసారి ఏమీ లేదనిపిస్తుంది. ఇంకోరోజు పున్నమి వెన్నైలై కురుస్తుంది. ప్రేమ కూడా ఒక భావోద్వేగమే. సందర్భాన్ని బట్టి అది వెలువడుతూ ఉంటుంది. అలాంటి ప్రేమ ఎక్స్ప్రెషన్ ‘ముద్దు’! జీవితంతో అంత కీలకమైన విషయానికి ఓ రోజు, ఒక గిఫ్టు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఇకనుంచి ‘కిస్ డే’ జరుపుకోండి. ఏరోజు జరుపుకోవాలి అని కంగారు పడక్కర్లేదు. ఆల్రెడీ దానికోరోజు ఉంది. అంతర్జాతీయ కిస్ డే ...జులై 6న జరుపుకుంటారు. అలాగే వాలెంటైన్స్ డే ముందు రోజు (ఫిబ్రవరి 13) ను కూడా ముద్దుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ప్రేమకు ముద్దు మొదటి మెట్టు! మీ హృదయబాంధవికి ఆ రోజున ఓ గిఫ్టు, ఓ ముద్దు... ముద్దుగా అందజేయండి. ప్రేమను విచ్చలవిడిగా గెలుచుకోండి! ఇంకో విషయం... ఆరోజు ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందా అని బుర్ర చించుకోనక్కర్లేదు. ఆల్రెడీ దానికి బహుమతులున్నాయి. హార్ట్ షేప్ పిల్లోపై ముద్దాడుతున్న టెడ్డీ బేర్, రెండు పెదవులపై కూర్చున్న టెడ్డీ బేర్ జంట, కిస్ మి పిల్లోస్ వంటివి అందుబాటులో ఉన్నాయి. - ప్రకాష్ చిమ్మల