![Honeymoon Horror: I Mistakenly Blew Myself Up On Honeymoon](/styles/webp/s3/article_images/2024/08/11/family.jpg.webp?itok=7Lja5o7s)
హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుని భార్యకు ఓ పీడకలను అందించాడు. ఇలాంటి సర్‌ఫ్రైజ్ ఏ భర్తి ఇంతవరకు ఇచ్చి ఉండడేమో..!. కానీ ఇలాంటి భయానక పరిస్థితి ఏ భార్యకు ఎదురుకాకూడదు. ఈ ఆ ఘటన నుంచి ఆ భార్య ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు కూడా.
అసలేం జరిగిందంటే..కెనడాకు చెందిన నూతన వధూవరులు లెవీ స్టాన్‌ఫోర్డ్, భార్య అమీ హనీమూన్‌కు వెళ్లారు. అతను తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్లాడు. 23 ఏళ్ల లెవీ తన హనీమూన్ గుర్తుండిపోయేలా చేయడానికి, భార్య అమీని ఆకట్టుకోవడానికి చక్కటి ప్లాన్ వేశాడు. ఐతే లెవీ చిన్నతనంలో గ్రామంలో పెరగడంతో అతడికి పేలుడు పదార్థాలు జీవితంలో ఓ భాగం కూడా. అందువల్ల ఒక పరికరాన్ని సిద్ధం చేశాడు.
ఇది సరస్సులో పేలి ఒక అందమైన నీటి ఫౌంటైన్‌ని సృష్టిస్తుంది. అదే చేద్దాం అనుకున్నాడు లెవీ. అంతేగాదు ఆ పేలుడు శబ్దాన్ని రికార్డు చేయమని తన సోదరుడకి కూడా చెప్పాడు. అతను పరికరాన్ని నీటిలోకి విసిరేద్దాం అనుకుంటుండగా..ఇంకా 60 సెకన్లు ఉందనంగా దురదృష్టవశాత్తు..చేతిలోనే అది పేలిపోయింది. లెవీ ఆ భయానక ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. రక్తంలో తడిసిపోయి బట్టలన్నీ ఊడిపోయాయి. చచ్చిపోతున్నంత బాధను అనుభవించాడు. శరీరమంతా గాయలమయం అయిపోయింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మునుపటిలా ఆర్బరిస్ట్‌గా పనిచేయలేకపోయాడు.
అయితే అతడి ప్రియురాలు, అమీ మాత్రం అతడిని వదిలి వెళ్లిపోలేదు. ఈ చేదు ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యింది. ఈ ఘటనలో లెవీ ఎడమ చేయి కోల్పోవడమే గాక చాలా భాగాలకు తొడ చర్మాన్ని కత్తిరించి అతికించడం జరిగింది. చెప్పాలంటే శరీరం అంతా గాయాలతో చిందరవందరగా ఉంది. అయినా అతడి భార్య లెవీ వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాచుకుంది. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించింది అమీ. అయితే ఈ చేదు ఘటన తర్వాత ఇరువురు వాదులాడుకోలేదని, భగవంతడు ప్రసాదించిన రెండో జీవితాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేశామని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు లెవీ.
ఇప్పుడు ఆ జంటకు నలుగురు పిల్లలు కూడా. ప్రస్తుతం అతడు ఈ ఘటనతో మోటివేషనల్ స్పీకర్, కమెడియన్, ఎంటర్‌టైనర్‌గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి మరుపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని చేసే పనులు మర్చిపోలేని పీడకలలా విధి మార్చేసినా..తట్టుకుని నిలబడి తమ బాంధవ్యాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంది ఈ జంట. పైగా పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలిచి ఎందరిగో స్ఫూర్తినిచ్చారు. ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పింది ఈ జంట.
(చదవండి: సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!)
Comments
Please login to add a commentAdd a comment