![Just Posing Anand Mahindra SharesThrowback Pic From His Honeymoon - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/anand%20mahindra_Honeymoon%20pic.jpg.webp?itok=H33gafKH)
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్‌లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు)
ఈ సందర్బంగా టెక్‌మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్‌లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్‌ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి)
అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్‌లైన్‌లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా.
ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment