ఎవరు నేర్పారో!
మనుషులు, పక్షులే కాదు.. జలచరాలు కూడా వలసవాదులే. చేపలు ఉప్పునీటి నుంచి మంచి నీటిలోకి, మంచి నీటి నుంచి ఉప్పు నీటిలోకి వలస వెళ్తుంటాయి. ఈ వలసలను సదరు జలపుష్పాలు హనీమూన్‌గా భావిస్తాయేమో కానీ.. ఈ కాలాన్నే అవి తమ ప్రత్యుత్పత్తికి అను వుగా భావిస్తాయి. గుడ్లు పెట్టి పొదుగుతాయి.
గుడ్లు పొదిగిన తర్వాత పుట్టుకొచ్చే చేపపిల్లలు మాత్రం తిరిగి వాటి సొంత నెలవుకు వెళ్లిపోతాయి. ఉప్పునీటిలో పుట్టినవి మంచి నీటిలోకి.. మంచినీటిలో పుట్టినవి ఉప్పునీటిలోకి క్యూ కడతాయి. అప్పుడే పుట్టిన ఈ మీనాలకు ఆ దారి ఎలా తెలుస్తుందన్నది మాత్రం దేవ రహస్యమే! ఈ మర్మాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా.. వీటికి ఈ విషయం ఎవరు నేర్పారో మాత్రం కనుక్కోలేకపోతున్నారు.