హనీమూన్ యాత్ర మధ్యలో వెళ్లిపోయాడు.. | Honeymoon fight: Man walks off plane, leaves wife behind | Sakshi
Sakshi News home page

హనీమూన్ యాత్ర మధ్యలో వెళ్లిపోయాడు..

Published Sat, Dec 19 2015 12:41 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

హనీమూన్ యాత్ర మధ్యలో వెళ్లిపోయాడు.. - Sakshi

హనీమూన్ యాత్ర మధ్యలో వెళ్లిపోయాడు..

ఢిల్లీ: వివాహం అనంతరం కొత్త దంపతులు  సంతోషంగా హనీమూన్కు బయలుదేరారు. అయితే ఎమైందో ఏమో తిరుగు ప్రయాణంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అసహనానికి గురైన భర్త మధ్యలోనే ఫ్లైట్ దిగి వెళ్లిపోయాడు. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా లక్నోకు చెందిన కొత్త దంపతుల హనీమూన్ యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

హనీమూన్ను సంతోషంగా గడుపుదామని గోవాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విమానం గోవా నుండి లక్నోకు వస్తుండగా కొత్త దంపతులు గొడవపడ్డారు. అంతే పాట్నా విమానాశ్రయంలో ఫ్లైట్ ఆగగానే కొత్తపెళ్లికొడుకు దిగి వెళ్లిపోయాడు.విమాన ప్రయాణంలో ప్రయాణికులు గమ్య స్థానానికి చేరక ముందే మధ్యలోనే దిగిపోవడానికి అనుమతించరు.  విమాన సిబ్బంది సరిగా తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ప్రయాణికుడు ప్రయాణం మధ్యలోనే వెళ్లిపోయాడని అధికారులనుండి విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఇండిగో విమాన ప్రతినిధులు మాట్లాడుతూ విమానం గమ్య స్థానానికి చేరక ముందే ఇలా మధ్యలో దిగిపోయే ప్రయాణికులు చాలా అరుదు అని వ్యాఖ్యానించారు. అయితే అతని వివరాలు తెలపడానికి మాత్రం నిరాకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement