ఉన్నత విద్య పట్టా పొందాకే మూడు ముళ్లు అనుకున్నారు ఆ ప్రేమికులు. అందుకోసం మూడేళ్లు వేచి ఉన్నారు. ప్రియుడు అనుకున్నట్లు పట్టా సాధించాడు. దీంతో ఆ ప్రేమికురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇరువురు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైందీ దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన ఓ ప్రేమికుల జంట. వారి కోరికను ఇరు కుటుంబాల వారు పెద్ద మనస్సుతో పచ్చ జెండా ఊపారు. అయితే వారిద్దరు కలిసి ఏడుగులు నడవడం దేవుడికి మాత్రం అందుకు ఇష్టపడినట్లు లేదు. దాంతో వివాహమై హనిమూన్ వెళ్తున్న వారిని అనంతలోకాలకు సాగనంపాడు.
దక్షిణాఫ్రికాలోని భారతీయ భారతీయ సంతతికి చెందిన మెడికల్ టెక్నాలజీస్ట్ అశీల్ రెడ్డి, దీపికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ క్రమంలో పెద్దలు వారిద్దరికి ఆదివారం వివాహం చేశారు. దాంతో కొత్త దంపతులు సరికొత్త ఆశలతో హనిమూన్కు కారులో బయలుదేరారు. అయితే వారు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో కొత్త జంటతోపాటు ఎదురు వాహనంలోని యువకుడు అక్కడికక్కడే మరణించారు. అంగరంగ వైభవంగా జరిగిన అశీల్ రెడ్డి, దీపికల వివాహమై అప్పుడే అనంతలోకాలకు చేరుకోవడంతో ఇరుకుటుంబాల వారితో బంధుమిత్రలు తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు. అయితే ఆ దుర్ఘటనలో ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.