ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట! | baby moon tour after pregnency | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట!

Published Fri, Aug 26 2016 9:58 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట! - Sakshi

ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట!

సాక్షి,వీకెండ్: కొత్తగా పెళ్లైన జంట ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కుటుంబానికి, స్నేహితులకి, బంధువులకు మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచానికే దూరంగా దాంపత్య జీవితాన్ని గడపడానికి వెళ్లే ట్రిప్‌ హనీమూన్‌ అని మనకి తెలుసు. అదే విధంగా ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ ‘పుట్టు’కొచ్చింది. దీనిని నగరవాసులు బేబీమూన్‌ అని పిలుస్తున్నారు.  
                                                                    – శిరీష చల్లపల్లి

పెళ్లయిన తర్వాత కొన్ని రోజులో, కొన్ని నెలలో మాత్రమే ప్రైవసీ... ఆ తర్వాత ఉద్యోగాలు, బాధ్యతలు, బంధాలు, చిక్కుముడులు... మళ్లీ అంతా రొటీన్‌ లైఫ్‌సై్టల్‌. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ అయ్యాక.. మళ్లీ దంపతుల జీవితాల్లోకి కొత్త వెలుగొస్తుంది. వారి మధ్యలోకి తమ ప్రతిరూపం రానుందని తెలిసిన తర్వాత ఒకరికొకరు మరోసారి చాలా క్లోజ్‌నెస్‌ ఫీలవుతారు. అయితే రొటీన్‌ లైఫ్‌ స్టైల్‌ కారణంగా ఇది కూడా కొన్ని రోజులకే పరిమితమై పోతుంటుంది.

అలా అవడం మంచిది కాదని, బిడ్డ గర్భంలో రూపుదిద్దుకుంటున్న తొలినాళ్లలో భార్యాభర్తల మధ్య మరింత గాఢమైన ప్రేమ పూర్వక దాంపత్యం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం భార్యాభర్తలు మరోసారి ప్రణయ యాత్ర చేయడం మంచిదంటున్నారు. దీనికే ఇప్పుడు బేబీమూన్‌ అని పేరు కూడా పెట్టారు.

పిల్ల చంద్రుడి కోసం...
డెలివరీకి ముందు వెళ్లి గడిపే రొమాంటిక్‌ అండ్‌ ప్రైవేట్‌ ట్రిప్‌ బేబీమూన్‌ సాక్షిగా ‘రావోయి చందమామ... మా ఇంటిలోకి అడుగిడుమా’ అంటూ లాలిపాటలు పాడుతున్నారు దంపతులు. తమకు నచ్చే ప్రశాంతమైన, ఫేవరేట్‌ ప్లేస్‌కి వెళ్లి దంపతులు క్వాలిటీ టైమ్‌ గడిపేలా చేసే ఈ బేబీమూన్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో దంపతుల మధ్య నెలకొనే ‘చిక్కని’ అనుబంధంతో పుట్టే పిల్లల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు.

‘ఆమె’ జాగ్రత్త...
ప్రెగ్నెన్సీతో ఉండగా దూర ప్రయాణం అనేది కొంచెం క్లిష్టతరమైనదే. గర్భిణులకు డీహైడ్రేషన్‌ సమస్య ఉంటుంది. కాబట్టి వాటర్‌ బాటిల్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం అవసరం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీరపు టెంపరేచర్‌ ఎన్నో రకాలుగా ఛేంజ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి సింగిల్‌ పీస్‌ డ్రెస్సెస్, స్ట్రెచ్‌వెర్‌ని ఎక్కువగా ప్రిఫర్‌ చేయాలి. శాలువ, స్వెటర్లు సైతం క్యారీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మెడికల్‌ హిస్టరీ, అవసరమైన మెడిసిన్స్, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ సైతం దగ్గర ఉంచుకోవాలి.

మేమిద్దరం..ముగ్గురమై..
రెగ్యులర్‌గా లీడ్‌ చేసే నార్మల్‌ లైఫ్‌సై్టల్‌కి భిన్నంగా ‘మనమిద్దరమే ఉన్నామా..’ అన్నట్టుగా ప్రశాంతతను అందించే ఐలాండ్స్‌ ప్రదేశాలను ఈ బేబీమూన్‌కి ఎంచుకుంటున్నారు. ఈ సమయంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేరెంటల్‌ స్పా అండ్‌ మసాజ్‌లు, యోగా థెరపీలు, ఆరోగ్యకరమైన ఆహారం... వంటివి ప్రత్యేకంగా డిజైన్‌ చేసి మరీ అందిస్తున్నాయి కొన్ని ప్యాకేజ్‌లు.

నిపుణుల సూచనలు...
బేబీమూన్‌కి ప్రకృతి సిద్ధంగా ఉండే పరిసరాలు, స్వచ్ఛమెన గాలి, నీరు లభించే ప్రదేశాలు ఎంచుకోవాలి. మన దేశంలో అయితే గోవా, ఊటీ, ఆగ్రా, సిమ్లా, కేరళ... వంటి ప్రాంతాలు నప్పుతాయి. అదే విధంగా హోటల్‌ లేదా గెస్ట్‌హౌస్‌ దగ్గరలో ఏదైనా ఆస్పత్రి వసతి అందుబాటులో ఉండేట్లు ప్లాన్‌ చేసుకోవడం అవసరం. ఖర్చు పెట్టేంత బడ్జెట్‌ చేతిలో ఉన్నప్పటికీ తాము ఉండే ప్లేస్‌ నుంచి మరీ ఎక్కువ దూరాలు వెళ్లాలనుకోవడం మంచి ఆలోచన కాదు. ఈ ట్రిప్‌ను పూర్తిగా పుట్టబోయే బిడ్డను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేసుకోవాలి. సైట్‌ సీయింగ్, అడ్వెంచర్స్, ఎంజాయ్‌ చేయడానికో వెళ్తున్నాం..

అనుకోకుండా కేవలం పుట్టబోయే బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. వారిద్దరి మధ్య ఒక కొత్త మెంబర్‌ వస్తుందని గుర్తుంచుకొని, తనను ఎలా వెల్‌కమ్‌ చేయాలి, ఎలా ఆనందంగా పెంచాలి, వారిద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్‌ ఇంకా బాగా ఎలా పెంపొందించుకోవాలి.. అనే ప్లానింగ్‌కు కూడా ఇది మంచి టైమ్‌ అని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement