babymoon
-
హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్‌కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్‌బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్‌తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
బేబీ బంప్‌తో దిష్టి తగిలేలా దీపికా! బేబీమూన్ కోసం లండన్‌కు (ఫోటోలు)
-
బేబీ మూన్ ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. పోస్ట్ వైరల్!
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితమే ప్రెగ్నెన్నీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) ఇప్పటికే ఇలియానా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది ఇలియానా. తాజాగా బేబీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. బీచ్ ఒడ్డున బేబీమూన్ మూమెంట్స్ అస్వాదిస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) కాగా.. ఇలియానా చివరిసారిగా రాపర్-సింగర్ బాద్షాతో కలిసి సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆమె చివరిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్లో కనిపించింది. ఆ తర్వాత రణదీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో కనిపించనుంది. -
ఘనంగా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్, శ్రీమతితో రామ్‌చరణ్ క్యూట్ ఫోటోలు
ఘనంగా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్, శ్రీమతితో రామ్‌చరణ్ క్యూట్ ఫోటోలు -
అమెరికాలో ఉపాసన-చెర్రీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన అమెరికాలో చెర్రీతో పాటు సందడి చేస్తున్నారు. తాజాగా ఉపాసన, రామ్ చరణ్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జంట బేబీమూన్ను ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్ బిజీ షెడ్యూల్లోనూ తన భార్య ఉపాసనతో కలిసి సరదాగా సముద్రంలో విహరించారు. షాపింగ్‌తో పాటు సముద్రంలో విహరిస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇంత బిజీగా ఉన్నప్పటికీ మా కోసం రామ్ చరణ్‌కు సమయం దొరికింది. డాల్ఫిన్స్, షార్క్స్ చూసేందుకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నా బకెట్ జాబితాలో ఇది టిక్ చేస్తున్నా.' అంటూ ఫోటోలు, వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ప్రెగ్నెన్సీతో బేబీమూన్ వెళ్లాల్సిందేనంట!
సాక్షి,వీకెండ్: కొత్తగా పెళ్లైన జంట ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కుటుంబానికి, స్నేహితులకి, బంధువులకు మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచానికే దూరంగా దాంపత్య జీవితాన్ని గడపడానికి వెళ్లే ట్రిప్ హనీమూన్ అని మనకి తెలుసు. అదే విధంగా ఇప్పుడు సరికొత్త ట్రెండ్ ‘పుట్టు’కొచ్చింది. దీనిని నగరవాసులు బేబీమూన్ అని పిలుస్తున్నారు. – శిరీష చల్లపల్లి పెళ్లయిన తర్వాత కొన్ని రోజులో, కొన్ని నెలలో మాత్రమే ప్రైవసీ... ఆ తర్వాత ఉద్యోగాలు, బాధ్యతలు, బంధాలు, చిక్కుముడులు... మళ్లీ అంతా రొటీన్ లైఫ్‌సై్టల్. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక.. మళ్లీ దంపతుల జీవితాల్లోకి కొత్త వెలుగొస్తుంది. వారి మధ్యలోకి తమ ప్రతిరూపం రానుందని తెలిసిన తర్వాత ఒకరికొకరు మరోసారి చాలా క్లోజ్‌నెస్ ఫీలవుతారు. అయితే రొటీన్ లైఫ్ స్టైల్ కారణంగా ఇది కూడా కొన్ని రోజులకే పరిమితమై పోతుంటుంది. అలా అవడం మంచిది కాదని, బిడ్డ గర్భంలో రూపుదిద్దుకుంటున్న తొలినాళ్లలో భార్యాభర్తల మధ్య మరింత గాఢమైన ప్రేమ పూర్వక దాంపత్యం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం భార్యాభర్తలు మరోసారి ప్రణయ యాత్ర చేయడం మంచిదంటున్నారు. దీనికే ఇప్పుడు బేబీమూన్ అని పేరు కూడా పెట్టారు. పిల్ల చంద్రుడి కోసం... డెలివరీకి ముందు వెళ్లి గడిపే రొమాంటిక్ అండ్ ప్రైవేట్ ట్రిప్ బేబీమూన్ సాక్షిగా ‘రావోయి చందమామ... మా ఇంటిలోకి అడుగిడుమా’ అంటూ లాలిపాటలు పాడుతున్నారు దంపతులు. తమకు నచ్చే ప్రశాంతమైన, ఫేవరేట్ ప్లేస్‌కి వెళ్లి దంపతులు క్వాలిటీ టైమ్ గడిపేలా చేసే ఈ బేబీమూన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో దంపతుల మధ్య నెలకొనే ‘చిక్కని’ అనుబంధంతో పుట్టే పిల్లల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు. ‘ఆమె’ జాగ్రత్త... ప్రెగ్నెన్సీతో ఉండగా దూర ప్రయాణం అనేది కొంచెం క్లిష్టతరమైనదే. గర్భిణులకు డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. కాబట్టి వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం అవసరం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీరపు టెంపరేచర్ ఎన్నో రకాలుగా ఛేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సింగిల్ పీస్ డ్రెస్సెస్, స్ట్రెచ్వెర్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. శాలువ, స్వెటర్లు సైతం క్యారీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మెడికల్ హిస్టరీ, అవసరమైన మెడిసిన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ సైతం దగ్గర ఉంచుకోవాలి. మేమిద్దరం..ముగ్గురమై.. రెగ్యులర్‌గా లీడ్ చేసే నార్మల్ లైఫ్సై్టల్కి భిన్నంగా ‘మనమిద్దరమే ఉన్నామా..’ అన్నట్టుగా ప్రశాంతతను అందించే ఐలాండ్స్ ప్రదేశాలను ఈ బేబీమూన్‌కి ఎంచుకుంటున్నారు. ఈ సమయంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేరెంటల్ స్పా అండ్ మసాజ్‌లు, యోగా థెరపీలు, ఆరోగ్యకరమైన ఆహారం... వంటివి ప్రత్యేకంగా డిజైన్ చేసి మరీ అందిస్తున్నాయి కొన్ని ప్యాకేజ్‌లు. నిపుణుల సూచనలు... బేబీమూన్‌కి ప్రకృతి సిద్ధంగా ఉండే పరిసరాలు, స్వచ్ఛమెన గాలి, నీరు లభించే ప్రదేశాలు ఎంచుకోవాలి. మన దేశంలో అయితే గోవా, ఊటీ, ఆగ్రా, సిమ్లా, కేరళ... వంటి ప్రాంతాలు నప్పుతాయి. అదే విధంగా హోటల్ లేదా గెస్ట్‌హౌస్ దగ్గరలో ఏదైనా ఆస్పత్రి వసతి అందుబాటులో ఉండేట్లు ప్లాన్ చేసుకోవడం అవసరం. ఖర్చు పెట్టేంత బడ్జెట్ చేతిలో ఉన్నప్పటికీ తాము ఉండే ప్లేస్ నుంచి మరీ ఎక్కువ దూరాలు వెళ్లాలనుకోవడం మంచి ఆలోచన కాదు. ఈ ట్రిప్‌ను పూర్తిగా పుట్టబోయే బిడ్డను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకోవాలి. సైట్ సీయింగ్, అడ్వెంచర్స్, ఎంజాయ్ చేయడానికో వెళ్తున్నాం.. అనుకోకుండా కేవలం పుట్టబోయే బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. వారిద్దరి మధ్య ఒక కొత్త మెంబర్ వస్తుందని గుర్తుంచుకొని, తనను ఎలా వెల్కమ్ చేయాలి, ఎలా ఆనందంగా పెంచాలి, వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇంకా బాగా ఎలా పెంపొందించుకోవాలి.. అనే ప్లానింగ్‌కు కూడా ఇది మంచి టైమ్ అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కృష్ణన్ చెప్పారు.