సముద్రంలో కాజల్‌ దంపతుల అడ్వెంచర్స్‌.. | Kajal Aggarwal and Gautam Kitchlu Snorkelling Session in Maldives | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న కాజల్‌ హనీమూన్‌ ఫోటోలు

Nov 16 2020 3:36 PM | Updated on Nov 16 2020 6:38 PM

Kajal Aggarwal and Gautam Kitchlu Snorkelling Session in Maldives - Sakshi

కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌-గౌతమ్‌ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్‌ చేస్తూ... అభిమానుల చేత వావ్‌ అనిపిస్తున్నారు కాజల్‌. తాజాగా సముద్రంలో తాము చేసిన అడ్వెంచర్‌లకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు కాజల్‌. అద్భుతమైన కోట్స్‌తో మూడు పోస్టుల్లో స్నార్‌కెలింగ్‌ సెషన్‌కు సంబంధించి మొత్తం ఆరు ఫోటోలని షేర్‌ చేశారు కాజల్‌. మొదటి పోస్ట్‌లో దంపతులిద్దరూ స్విమ్‌ చేస్తున్న ఫోటోలని.. ‘ప్రపంచం ఒక సముద్రం. అందులో మనం అలలం. కొందరు సర్ఫ్‌ చేయాలనుకుంటారు.. కొందరు డైవ్‌ చేయాలనుకుంటారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. (చదవండి: మజా మాల్దీవ్స్‌)


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరో పోస్ట్‌లో ‘ఒంటరిగా సముద్రం ఒడ్డున ఉండండి. అక్కడ మీకు మీ ఉనికిలో లేని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’ అంటూ రెండు ఫోటోలని షేర్‌ చేయగా.. చివరి పోస్ట్‌లో ‘సముద్రం అంటే నాకు ఎంతో ప్రేమ. నీలం వర్ణం అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఎంతో ప్రశాంతంగా.. ప్రకాశవంతంగా.. జారిపోతూ ఉంటుంది. కొద్దిగా భయం కూడా’ అంటూ మరో రెండు ఫోటోలని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ అండర్‌ వాటర్‌ స్కూబా డైవింగ్‌, స్విమ్మింగ్‌ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవే కాక కొద్ది రోజుల క్రితం భర్తతో అండర్‌ వాటర్‌, చేపల మధ్య హనీమూన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట)

తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లూను అక్టోబర్‌ 30వ తేదీన కాజల్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భార‌తీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కాజల్‌ మాల్దీవుల నుంచి తిరిగి రాగానే కొద్దిరోజుల క్వారంటైన్‌ అనంతరం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement