ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్ | Old Age Home couple ties the knot in Assam | Sakshi
Sakshi News home page

ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్

Published Fri, May 22 2015 4:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్

ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్

గువాహటి: వృద్ధాశ్రమంలో ఉంటున్న ఇద్దరు వృద్ధులు వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు మేఘాలయ రాజధానిలోని షిల్లాంగ్కు హనీమూన్కు కూడా వెళ్లారు. శాంతను కుమార్ దాస్(73) మంజు సిన్హా రాయ్(63) గువాహటిలో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 'వాళ్లిద్దరి మధ్య తొలిచూపులోనే ప్రేమ చిగురించింది. వృద్ధాశ్రమంలోకి రాగానే వారిమధ్య బంధం ఏర్పడింది. కానీ మాకు మాత్రం ఈ మధ్యకాలంలో మూడు నెలల కిందట తెలిసింది. దీంతో మేం వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించాం' అని ఓల్డేజ్ హోమ్ కార్యదర్శి మోనికా శర్మ తెలిపింది.

కుమార్ దాస్ సొంత ప్రాంతం కరీంగంజ్ జిల్లా. పదవీ విరమణ పొందిన ఇంజినీర్ గా ఉండి ఆయన భార్య చనిపోవడంతో 2012 ఈ ఓల్డేజ్ హోంకు వచ్చాడు. ఇక మంజు సిన్హా రాయ్ది సమీపంలోని లాల్ గణేశ్ ప్రాంతం. ఆమె కూడా 2012లోనే ఓల్డేజ్ హోంకు వచ్చింది. వారిద్దరికీ పిల్లలు లేరు. వారి వివాహానికి దాదాపు రెండు వేలమంది హాజరై ఆశీర్వదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement