Vidyullekha Ramans Wedding Photos Goes Viral: లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్ ఇటీవల మెట్టినింట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక ఈ నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. తమిళ, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇప్పటివరకు వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు.
తాజాగా విద్యుల్లేక పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ లెహంగాలో పెళ్లికూతురిగా విద్యుల్లేక ముస్తాబవగా, సంజయ్ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇటీవల భర్త క్లిక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇక పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేక. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment