హనీమూన్‌లో స్కూబా డైవింగ్ | Amala Paul tries out scuba diving during her honeymoon | Sakshi
Sakshi News home page

హనీమూన్‌లో స్కూబా డైవింగ్

Published Sat, Jun 28 2014 1:20 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

హనీమూన్‌లో స్కూబా డైవింగ్ - Sakshi

హనీమూన్‌లో స్కూబా డైవింగ్

నవ దంపతులు ఏకాంతంగా ఎంజాయ్ చెయ్యడానికి హనిమూన్‌కు వెళుతుంటారు. నటి అమలాపాల్ తన భర్త, దర్శకుడు విజయ్‌తో హనీమూన్‌కు వెళ్లి స్కూబా డైవింగ్‌లో ఎంజాయ్ చేశానంటున్నారు. విజయ్, అమలాపాల్ ప్రేమలో మునిగి తేలి ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నవ దంపతులు హనీమూన్‌ను మాల్‌దీవుల్లో గడిపొచ్చారు. ఈ ట్రిప్‌లో తాము తీసుకున్న కొన్ని ఫొటోలను అమలాపాల్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు.

వీటికి పలువురి నుంచి అభినందనలతో పాటు విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేశారు. హనిమూన్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నటి అమలాపాల్ తన అనుభవాన్ని పంచుకుంటూ స్త్రీకి పరిపూర్ణ జీవితం వివాహంతోనే వస్తుందన్నారు. అలాగే పెళ్లి తర్వాత మహిళలో దాగి ఉన్న ప్రతిభను కనుగొనవచ్చునన్నారు. తన వరకు క్రీడ అంటే చాలా ఆసక్తి అని తెలిపారు. హనీమూన్ సమయంలో తన క్రీడాసక్తిని సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు.

స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందిన తాను మాల్‌దీవుల్లోని నదిలో ఈది పరవశం పొందానన్నారు. ఇది తనకు ఒక స్వర్గ లోకంగా అనిపించిందని పేర్కొన్నారు. నిజానికి తాను స్విమ్మింగ్ క్రీడాకారిణినని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లినప్పుడు కూడా స్విమ్మింగ్ క్రీడల్లో పాల్గొన్నానని అమలాపాల్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement