Director Vijay
-
కొత్త డైరెక్టర్లకు నాగార్జున అవకాశం ఇస్తే.. ఎలా ఉంటుందంటే..!
-
ఘనంగా కపట నాటక సూత్రధారి ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిలీజ్ ఎప్పుడంటే..?
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించారు. రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు అందించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి , నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి నన్ను హీరోగా ఎంపిక చేసినందుకు దర్శకుడికి, నిర్మాతకి కృతజ్ఞతలు. కపట నాటక సూత్రధారి గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడలేదు. నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన్ను, ఆయన కథను నమ్మి ఈ సినిమాను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ క్రాంతి. కథ మీద నమ్మకం తోనే ఈ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. నిజంగా అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం ఆయన అదృష్టమన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. కథ వినగానే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనిపించింది. దర్శకుడు కథ చెప్పిన విధానం, తెరకెక్కించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. హీరో విజయ్ శంకర్ ఈ సినిమాతో బాగానే ఆకట్టుకుంటాడు. అన్ని విభాగాల టెక్నిషియన్స్ చాలా బాగా పని చేశారు. టైటిల్ చాలా బాగుందని, ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్‌ను ఎలా వదిలేశారనిపించిందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. -
సెట్లోనే సంతోషంగా ఉంటా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇందులో యంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే చెన్నైలో ప్రారంభం అయింది. జయలలిత సీయంగా ఉన్న సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణలో పాల్గొంటున్న ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కంగనా. ‘‘తలైవి’ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు విజయ్‌గారితో ఓ సన్నివేశం గురించి సంభాషిస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండొచ్చు, కానీ సినిమా సెట్లో ఉన్నంత సంతోషంగా నేనెక్కడా ఉండలేను’’ అన్నారు కంగనా. -
త్వరలో సెట్స్ మీదకు ‘అమ్మ’ బయోపిక్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌పై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు తెలుగు, తమిళ చిత్రాల దర్శక నిర్మాతలు అమ్మ కథను వెండితెర మీద చూపించేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. తాజాగా ఓ నిర్మాణ సంస్థ అమ్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విబ్రి మీడియా సంస్థ జయలలిత బయోపిక్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రకటనను విడుదల చేసి విబ్రి మీడియా ఎంతో ప్రభావవంతమైన మహిళ నేత జీవిత చరిత్రను రూపొందించటం గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ బయోపిక్ సినీ రాజకీయ రంగాల్లో ఆమె సాధించిన విజయాలకు ఓ నివాళిగా రూపొదిస్తున్నట్టుగా తెలిపారు. సినిమాను ఆమె జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24 ప్రారంభిస్తామని అదే రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. మదారసీ పట్టణం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అవార్డ్విన్నింగ్ దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటించనున్నారని వెల్లడించారు. గత పదేళ్లుగా ఎన్నో టెలివిజన్ షోస్‌ను నిర్మించిన విబ్రి మీడియా ప్రస్తుతం 1983 వరల్డ్‌కప్ నేపథ్యంలో 83 సినిమాతో పాటు ఎన్టీఆర్ జీవిత కథ ఆధరంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. -
అమ్మకు నచ్చిందనే అందుకు ఒప్పుకున్నా..
సాక్షి, సినిమా : ప్రేమమ్ అంటూ మలయాళ సినీ వనంలో వికసించిన తమిళ నటి సాయిపల్లవి. ఆ చిత్రంలోని మలర్ పాత్ర సాయిపల్లవికి అనూహ్య పేరు తెచ్చిపెట్టింది. అంతే వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమను ఆకర్షించేసింది. అక్కడ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆ తరువాత నటించిన ఎంసీఏ చిత్రం కూడా వర్కౌట్ కావడంతో సాయిపల్లవికి తెలుగులో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. తాజాగా కరు చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది. దర్శకుడు విజయ్ తెరకెక్కించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో నటించడం గురించి సాయిపల్లవి తెలుపుతూ.. కరు చిత్రంలో తాను ఒక బిడ్డకు తల్లిగా నటించానని చెప్పింది. తమిళంలో మంచి కథా చిత్రం ద్వారా పరిచయం కావాలని ఎదురుచూశానని, అలాంటి సమయంలో దర్శకుడు విజయ్ కరు చిత్ర కథను చెప్పారని ఈ చిత్రంలో నటించడానికి నిరాకరించానని చెప్పింది. ఆ తరువాత విజయ్ తన అమ్మను కలిసి కథ వినిపంచారని, అమ్మకు కరు చిత్ర కథ తెగ నచ్చేసిందని అంది. దీంతో కరు చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. ఇలాఉండగా సాయిపల్లవి కరు చిత్ర షూటింగ్లో పలు షరతులు విధించి యూనిట్ వర్గాలను ఇబ్బందులకు గురి చేసిందని, తనకు చాలా అసౌకర్యాన్ని కలిగించిందని ఆ చిత్ర కథానాయకుడు నాగశౌర్య బహిరంగంగానే ఆరోపణలు గుప్పించాడన్నది గమనార్హం. అంతేకాదు రెండు మూడు చిత్రాల సక్సెస్‌నే తలకెక్కించేసుకుందనే ప్రచారం జోరందుకుంది. కేరీర్ సక్సెస్ బాటలో పయనిస్తుండగా ఇలాంటి ఆరోపణలు మంచిదికాదని సాయిపల్లవి గ్రహిస్తే మంచిదంటున్నారు సినీ వర్గాలు. -
సాయిపల్లవి నో అంది!
తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్ చెప్పారు. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గానూ నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్ ఆంటోని ముఖ్యపాత్రలను పోషించారు. శ్యామ్.సీఎస్ సంగీతబాణీలు కట్టిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి మాట్లాడుతూ అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేసిన నటిని తానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి చేర్చారని అన్నారు. తన తొలి చిత్రాన్నే (ప్రేమమ్ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పగా ఎప్పుడు చేసినా ఈ కథను లైకా సంస్థకే చేయాలని ఆ సంస్థ అధినేత అన్నారని చెప్పారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామని, ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవినేనని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్ అన్నారు. కరు చిత్ర ఆడియో ఆవిష్కరణ దృశ్యం -
ఆయనతో చేయడానికి నో చెప్పిన సాయిపల్లవి.!
తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి మొదట నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్ ఆంటోని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్. సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియా ఆవిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక టీ.నగర్‌లోని ఓ నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. తాను అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేశానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. తన తొలి చిత్రాన్ని (ప్రేమమ్ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామన్నారు. ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవే అని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్ అన్నారు. -
సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి
కిడారి చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించి చక్కని హావభావాలతో తమిళ ప్రేక్షకులను అలరించిన నటి నిఖిలవిమల్. ఈ అమ్మడికిప్పుడు నటుడు సిబిరాజ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. సిబిరాజ్ నటించిన కట్టప్పావ కానోమ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. బాస్ ఫిలింస్ పతాకంపై నిర్మాత విజయ్ కే.సెల్లయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు విజయ్Š. దురై శిష్యుడు, పలు వాణిజ్య ప్రకటనలు రూపొందించిన వినోద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నటించడానికి నటి నిఖిలవిమల్ చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట. దీని గురించి ఈ బ్యూటీ చెబుతూ ఇంతకు ముందు నటించిన చిత్రంలో తనను గ్రామీణ యువతిగా చూసిన తమిళ ప్రేక్షకులు ఈ చిత్రంలో సిటీ గర్ల్‌గా చూడబోతున్నారని చెప్పింది.యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒకే కార్యాలయంలో పని చేసే కళాకారులుగా తాను, సిబిరాజ్ నటించనున్నామని తెలిపింది. సామాజిక సమస్య ఇతివృత్తంగా రూపందనున్న మంచి కథా చిత్రంలో తానూ ఒక భాగం కానుండడం గర్వంగా ఉందని చెప్పింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ త్వరలో కశ్మీర్లో ప్రారంభం కానుందని, ఆ తరువాత పొల్లాచ్చి, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
నా దృష్టంతా నటనపైనే!
చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన నటి అమలాపాల్. అదే విధంగా ఎంత తక్కువ కాలంలో దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే వేగంగా ఆయన నుంచి విడిపోయి వార్తల్లోకెక్కారు. భర్త నుంచి దూరమైన అమలాపాల్‌కు తొలి అవకాశం కల్పించింది నటుడు ధనుష్. ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో అమలాపాల్ ప్రధాన భూమికను పోషించారు. ఆ తరువాత వడచెన్నై, వీఐపీ–2 చిత్రాల్లో ధనుష్ తనకు జంటగా నటించే అవకాశాలను అమలాపాల్కే కల్పించారు. దీంతో ధనుష్‌తో అమలాపాల్ చెట్టాపట్టాల్ అంటూ రకరకాల ప్రచారాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటికి నటి అమలాపాల్ చాలా ఘాటుగానే స్పందించారు. ఇలాంటి వదంతులు పుట్టించడం నీచమైన చర్చగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ తన మంచి కోరే ధనుష్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. తాను, విజయ్ విడిపోకూడదని భావించిన వారిలో నటుడు ధనుష్ ఒకరనీ పేర్కొన్నారు. ఈ విషయంలో ధనుష్ చర్చలు జరిపి విజయ్‌తో కలిసి జీవించడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పారు. అలాంటి ఆయనతో తనను కలుపుతూ మాట్లాడడం శోచనీయమన్నారు. ఇలాంటి వదంతులు జీర్ణించుకోలేని అసత్యాలని అన్నారు. వివాహరద్దుకు స్త్రీలనే బాధ్యులుగా చేయడం, వారిపైనే నేరం మోపడం సరికాదని అమలాపాల్ అన్నారు. జీవితంలో ఏదీ నిరంతరం కాదని, వివాహరద్దుకు సిద్ధం అవుతానని ఊహించనే లేదని అమలాపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. -
నాకెవరి సాయం అవసరంలేదు!
ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉండే తారల్లో నటి అమలాపాల్ చేరారు. ఈమెను ఇంతకు ముందు కథానాయకిగానే మాట్లాడుకునేవారు.ఇప్పుడు అధికంగా దర్శకుడు విజయ్‌కు దూరం అయిన భార్యగానూ చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న రెండేళ్లలోనే విజయ్ నుంచి విడిపోయి పెద్ద చర్చకే దారి తీసిన నటి అమలాపాల్. విజయ్, అమలాపాల్ ఇద్దరూ విడాకుల కోసం కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టిన అమలాపాల్ తను భర్త నుంచి విడిపోవడానికి విధిని కారణంగా చూపుతున్నారు. దీని గురించి ఇంతకు ముందు చాలా తన వెర్షన్‌ను చెప్పుకొచ్చినా తాజాగా మరోసారి ప్రస్తావించారు. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుందంటున్న అమలాపాల్ మాట్లాడుతూ తనకు యోగా అంటే చాలా ఇష్టం అన్నారు. తన స్నేహితురాళ్లతో కలిసి నిత్యం యోగా చేస్తానన్నారు. తనకు కష్టకాలంలో ఆధ్యాత్మిక చింతన చాలా శక్తిని కలిగిస్తుందన్నారు. అందువల్ల మనశ్శాంతి కోసం తనకెవరి సాయం అక్కర్లేదన్నారు. తనకు కలిగిన లోటు( భర్తకు దూరం అవ్వడం) భర్తీ చేయలేనిదేనని, శోకకరమైనదేనని పేర్కొన్నారు. అయితే ఇలాంటిది ఎవరికైనా జరగవచ్చునని, ఎవరికీ సంపూర్ణమైన జీవితం కలగదని అన్నారు. వ్యక్తిగతం గానూ, వృత్తిపరంగానూ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. ఇవన్నీ తాను యవ్వన వయసులోనే గ్రహించానని చెప్పారు. ఈ విషయంలో తాను శక్తిమంతురాలినేనని అన్నారు. విడిపోవడం అన్నది బాధాకరమే అయినా ఇప్పుడు ఇద్దరం ఎవరి స్థానాల్లో వారు సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే అన్నిటికీ ఇదే పరిష్కారం అని భావించడం లేదని, ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. దాన్ని తెలివిగా ఎంచుకుని సంతోషంగా ఉండాలన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా బిజీగా ఉన్నానని, నటుడు బాబీసింహా, ప్రసన్నలతో కలిసి తిరుట్టుప్పయలే–2, ధనుష్‌కు జంటగా వీఐపీ–2, వడచెన్నై, విష్ణువిశాల్‌తో ఒక చిత్రం, అదే విధంగా కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నట్లు అమలాపాల్ తెలిపారు. -
అవును విడిపోతున్నాం: హీరోయిన్ భర్త
చెన్నై: తన భార్య అమలాపాల్ నుంచి విడాకులు తీసుకోనున్నట్టు తమిళ దర్శకుడు విజయ్ తెలిపాడు. తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించాడు. తమ వివాహ బంధం ఈవిధంగా ముగుస్తుందని తాను ఊహించలేదన్నాడు. 'మేము విడిపోతున్నామంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. మేము విడిపోవడానికి అసత్య కారణాలు సాకుగా చూపుతున్నారు. ఈ ప్రచారం అవాస్తవం. మేము విడిపోవాలనుకున్న మాట నిజమే. దీనికి కారణం ఎవరికీ తెలియదు. నాకొక్కడికే తెలుసు' అని విజయ్ అన్నాడు. పెళ్లైన తర్వాత సినిమాల్లో నటించొద్దని అమలాపాల్ కు తాము అడ్డు చెప్పలేదని తెలిపాడు. 'నా సామాజిక బాధ్యత పట్ల చాలా జాగ్రత్తగా ఉంటా. నేను ఇప్పటివరకు 9 సినిమాలకు దర్శకత్వం వహించాను. నా సినిమాల్లో మహిళల పాత్రలను హుందాగా, ఆత్మగౌరవం ఉట్టిపడేట్టు చూపిస్తుంటాను. అలాంటిది నా భార్య స్వేచ్ఛను ఎలా అడ్డుకుంటాను. పెళ్లైన తర్వాత సినిమాల్లో నటిస్తానని అమల అంటే నేను అడ్డుచెప్పలేదు. మేము వద్దన్నామని వచ్చిన వార్తల్లో వాస్తవం లేద'ని విజయ్ పేర్కొన్నాడు. విజయ్, అమలాపాల్ 2014, జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. -
అవును... వాళ్లిద్దరూ విడిపోయారు
ప్రేమించి, పెళ్లి చేసుకున్న దర్శకుడు విజయ్, నటి అమలాపాల్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని స్పష్టం అయ్యింది. విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విజయ్, అమలాపాల్ విడిపోయారని ఆయన ప్రకటించారు. దర్శకుడు విజయ్ కూడా ఒక భేటీలో అమలాపాల్ ప్రస్తావన అనవసరమనీ, తన తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకుంటాననీ అనడం గమనార్హం. విజయ్‌కి ఇష్టం లేకపోయినా అమలాపాల్ మళ్లీ నటించడమే వారి మధ్య మనస్పర్థలకు కారణం అని తెలుస్తోంది. అతని తల్లిదండ్రులకు కూడా అమలాపాల్ నటించడం ఇష్టం లేదట. ప్రస్తుతం ధనుష్ సరసన అమలాపాల్ ‘వడచెన్నై’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ముందు ఈ చిత్రంలో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. అయితే, సమంత నిరాకరించడంతో అమలాపాల్‌ని అడగడం, ఆమె అంగీకరించడం జరిగింది. విజయ్, అమలాపాల్ పెళ్లి 2014లో జరిగింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడిపోవడం చర్చనీయాంశమైంది. -
నేను నటిస్తా బ్రదర్
సుమారు పుష్కర కాలం తరువాత ప్రభుదేవా తమిళంలో నటిస్తున్న చిత్రం దేవి. ఆయనకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. సైవం, ఇదు ఎన్న మాయం చిత్రాల తరువాత చిన్న గ్యాప్ తీసుకుని ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న దేవి చిత్రం విడుదల తేదీని యూనిట్ వర్గాలు ఖరారు చేశారు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన చిత్రం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌తో చిన్న భేటీ. ప్ర: దేవి చిత్రం గురించి చెప్పండి? జ: దేవి విభిన్న హారర్ కథా చిత్రం. ముంబయిలో నివశించే తమిళ యువకుడు ప్రభుదేవా మంచి మోడ్రన్‌గా ఉండే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. అలాంటిది పక్కా గ్రామీణ యువతి భార్య అవుతుంది. ఈ నేపథ్యంలో జరిగే సంఘటనలే దేవి చిత్రం. ప్ర: వారానికి రెండు హారర్ చిత్రాలు వస్తున్న సందర్భంలో మీరూ ఆ ట్రెండ్‌కు మారారా? జ: నిజం చెప్పాలంటే దెయ్యాల కథల సీజన్, హారర్ చిత్రాల ట్రెండ్‌కు ముందే తయారు చేసుకున్న కథ ఇది. సరైన టీమ్ సెట్ కాకపోవడంతో చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుదేవా వచ్చి చేరారు. నాలుగేళ్లుగా తయారు చేసుకున్న కథ నలభై రోజుల్లో చిత్రీకరణతో పూర్తి అయింది. ఇంతకు ముందెప్పుడూ చూడని హారర్ కథా చిత్రంగా దేవి ఉంటుంది. ప్ర: ప్రభుదేవా పెద్ద దర్శకుడు. ఆయన్ని ఎలా ఇందులో నటించడానికి ఒప్పించారు? జ: మొదటిలో నాకు అలాంటి భయం కలిగింది. చిత్రంలో తమన్నా పాత్రకే ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి కథలో ప్రభుదేవా నటిస్తారా అన్న సంశయం కలిగింది. ధెర్యం చేసి ప్రభుదేవాకు కథ చెప్పాను. బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. నేను నటిస్తానంటూ ఆయన నుంచి బదులు వచ్చింది. ఇందులో ఒక పాటకు మీరే నృత్య దర్శకత్వం వహించాలని కోరగా 12 ఏళ్ల తరువాత తమిళంలోకి వస్తున్నాను.చిత్రం బాగా రాావడానికి ఏం చేయమన్నా చేస్తాను అని అన్నారు. ప్ర: ఆ చిత్రం కోసం తమన్నాను పూర్తిగా మార్చేశారటగా. జ: టైటిల్ రోల్ ఆమెదే. పక్కా గ్రామీణ యువతిగా మారిపోయారు. ఆమె మేకప్‌కే గంటన్నర పట్టేది. ప్ర: హాలీవుడ్ కథా రచయిత పాల్ ఆరోన్ ఈ కథలోకి ఎలా వచ్చారు? జ: నిజానికి ఈ చిత్రానికి ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. సైవం చిత్రానికి సౌండ్ మిక్సింగ్ కోసం లాస్ఎంజిల్స్ వెళ్లినప్పుడు ఆయన తన ఇన్ టూ టిప్ చిత్ర పని కోసం అక్కడికి వచ్చారు. అప్పుడు పరిచయమయ్యారు. సినిమాకు సంబంధించిన విషయాలు చాలా చర్చించుకునేవాళ్లం.అలా దేవి చిత్ర కథలో ఆయన భాగస్వామ్యం చాలా ఉంది. -
పెళ్లి చేసుకున్న భావనే లేదు
పెళ్లి చేసుకున్న భావనే లేదంటున్నారు నటి అమలాపాల్. అనతికాలంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ మైనా కుట్టి అంత తొందరగానే నటనకు విరామం ఇచ్చి దర్శకుడు విజయ్ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసి మళ్లీ నటనకు రెడీ అయ్యారు. అంతేకాదు మరోపక్క చిత్ర నిర్మాణ బాధ్యతలు మోయడానికి సిద్ధమయ్యారు. తను నటిగా కొనసాగడం గురించి అమలాపాల్ మాట్లాడుతూ ఇప్పుడు తాను కళ్లు మూసుకుని చిత్రాలు అంగీకరించడం లేదన్నారు. సామాజిక స్పృహ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సూర్య సరసన నటిస్తున్న హైకూ అలాంటిదేనని చెప్పారు. కొన్ని పాత్రలు నిజజీవిత అనుభవం లేనిదే నటించడం కష్టమన్నారు. ఇక తన వివాహ జీవితం గురించి చెప్పాలంటే అసలు పెళ్లి అయిన భావనే లేదన్నారు. ఒక స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్లుందని అమలాపాల్ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే తాను గర్భం దాల్చానా? అని చాలా మంది అడుగుతున్నారనీ, ఈ విషయం గురించి అంత ఆసక్తి ఎందుకో తనకర్థం కావడం లేదని అన్నారు. అలా అమ్మ స్థానం పొందినప్పుడు తనే అందరికీ తెలియజేస్తానని చెప్పారు. అన్నట్టు ఈ భామ మరోసారి ఇళయదళపతితో కలిసి నటించారు. ఇంతకు ముందు తలైవా చిత్రంలో విజయ్‌కు జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాతే దర్శకుడు విజయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరోసారి ఇళయదళపతితో కలిసి నటించారు. అయితే ఇది చిత్రం కాదు, ఒక వాణిజ్య ప్రకటన. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ కమర్శియల్ యాడ్ త్వరలో వెండితెర, బుల్లితెరలపైకి రానుంది. -
నిర్మాతగా అమలాపాల్
మైనా కుట్టి అమలాపాల్ జీవిత పయ నం అనూహ్య మలుపులతో సాగుతోందని చెప్పవచ్చు. హీరోయిన్గా కోలీవుడ్‌లో సిం ధు సమ వెలి చిత్రంతో పలు విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో తదుపరి అవకాశం వస్తుందో? రాదో? అన్న సందేహంతో గడిపారు. అలాంటిది మైనా చిత్రం నటిగా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా అవకాశాలు అమలాపాల్‌ను స్టార్ హీరోయిన్ను చేసేశాయి. అలా లైమ్‌టైమ్‌లో ఉండగానే ద ర్శకుడు విజయ్‌తో ప్రేమ, పెళ్లి ఇవి అనూ హ్య పరిణామాలే. వివాహానంతరం నటన కు దూరం అవుతారని ఎవరూ ఊహించలే దు. అలాంటిది చిన్నగ్యాప్ తరువాత సూర్య సరసన ఐక్యూ చిత్రంలో అతిథి పాత్రలో మె రవనుండడం అనుకోని పరిణామమే. తాజా గా మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. అదే నిర్మాత బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకోనుండడం ఎస్. అమలాపాల్ నిర్మాతగా తన భర్త విజయ్ గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో చిత్రం నిర్మించనున్నారు. ఇంతకుముందు సైవం, ప్రస్తుతం నైట్‌షో చిత్రాల నిర్మాణ సంస్థ థింక్ బిగ్ స్టూడియో బాధ్యతలను విజయ్ తండ్రి ఏఎల్ అలగప్పన్తో కలిసి అమలాపాల్ పంచుకుంటున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ప్రకాష్‌రాజ్, శ్రేయారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జాతీయస్థాయిలో గౌరవం లభించే విధంగా చిత్ర కథ, కథనాలు ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. తాను నిర్మిస్తున్న తొలి చిత్రమే జాతీయస్థాయి గుర్తింపు పొందే చిత్రంగా రూపొందనుండడం సంతోషంగా ఉంది. ప్రియదర్శన్, సంతోష్ శివన్, ప్రకాష్‌రాజ్, శ్రేయారెడ్డి లాంటి వారు పని చేయడం చిత్రానికి పక్కబలం అని అమలాపాల్ అన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవుతుందని ఈ సందర్భంగా అమలాపాల్ తెలిపారు. -
ఆర్యతో మరోసారి
మదరాసు పట్టణం చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర హీరో ఆర్య. దర్శకుడు విజయ్ తాజాగా మరోసారి కలసి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయం గురించి ఆర్య తెలుపుతూ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు. ఇది ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా ఉంటుందన్నారు. హీరోయిన్‌తో సహా ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ఇంకా జరగలేదన్నారు. ప్రస్తుతం విజయ్ విక్రమ్ ప్రభు హీరోగా ఇది ఎన్న మాయం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఆర్యతో చిత్రం ఉంటుంది. అదే విధంగా ఆర్య ప్రస్తుతం రాజేష్ ఎం.దర్శకత్వంలో వాసువుం..శరవణయుం ఒన్నా పడిచ్చవంగ చిత్రంలోను అనుష్కతో సైజ్ జీరో అనేద్విభాషా చిత్రంలోను నటిస్తున్నారన్నది గమనార్హం. -
హనీమూన్‌లో స్కూబా డైవింగ్
నవ దంపతులు ఏకాంతంగా ఎంజాయ్ చెయ్యడానికి హనిమూన్‌కు వెళుతుంటారు. నటి అమలాపాల్ తన భర్త, దర్శకుడు విజయ్‌తో హనీమూన్‌కు వెళ్లి స్కూబా డైవింగ్‌లో ఎంజాయ్ చేశానంటున్నారు. విజయ్, అమలాపాల్ ప్రేమలో మునిగి తేలి ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నవ దంపతులు హనీమూన్‌ను మాల్దీవుల్లో గడిపొచ్చారు. ఈ ట్రిప్‌లో తాము తీసుకున్న కొన్ని ఫొటోలను అమలాపాల్ ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. వీటికి పలువురి నుంచి అభినందనలతో పాటు విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేశారు. హనిమూన్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నటి అమలాపాల్ తన అనుభవాన్ని పంచుకుంటూ స్త్రీకి పరిపూర్ణ జీవితం వివాహంతోనే వస్తుందన్నారు. అలాగే పెళ్లి తర్వాత మహిళలో దాగి ఉన్న ప్రతిభను కనుగొనవచ్చునన్నారు. తన వరకు క్రీడ అంటే చాలా ఆసక్తి అని తెలిపారు. హనీమూన్ సమయంలో తన క్రీడాసక్తిని సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందిన తాను మాల్దీవుల్లోని నదిలో ఈది పరవశం పొందానన్నారు. ఇది తనకు ఒక స్వర్గ లోకంగా అనిపించిందని పేర్కొన్నారు. నిజానికి తాను స్విమ్మింగ్ క్రీడాకారిణినని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లినప్పుడు కూడా స్విమ్మింగ్ క్రీడల్లో పాల్గొన్నానని అమలాపాల్ వెల్లడించారు.