నాకెవరి సాయం అవసరంలేదు! | More on Amala Paul-Vijay divorce: Now, claims of actress being | Sakshi
Sakshi News home page

నాకెవరి సాయం అవసరంలేదు!

Published Wed, Dec 28 2016 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

నాకెవరి సాయం అవసరంలేదు! - Sakshi

నాకెవరి సాయం అవసరంలేదు!

ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉండే తారల్లో నటి అమలాపాల్‌ చేరారు. ఈమెను ఇంతకు ముందు కథానాయకిగానే మాట్లాడుకునేవారు.ఇప్పుడు అధికంగా దర్శకుడు విజయ్‌కు దూరం అయిన భార్యగానూ చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న రెండేళ్లలోనే విజయ్‌ నుంచి విడిపోయి పెద్ద చర్చకే దారి తీసిన నటి అమలాపాల్‌. విజయ్, అమలాపాల్‌ ఇద్దరూ విడాకుల కోసం కోర్డులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టిన అమలాపాల్‌ తను భర్త నుంచి విడిపోవడానికి విధిని కారణంగా చూపుతున్నారు. దీని గురించి ఇంతకు ముందు చాలా తన వెర్షన్‌ను చెప్పుకొచ్చినా తాజాగా మరోసారి ప్రస్తావించారు. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుందంటున్న అమలాపాల్‌ మాట్లాడుతూ తనకు యోగా అంటే చాలా ఇష్టం అన్నారు. తన స్నేహితురాళ్లతో కలిసి నిత్యం యోగా చేస్తానన్నారు. తనకు కష్టకాలంలో ఆధ్యాత్మిక చింతన చాలా శక్తిని కలిగిస్తుందన్నారు. అందువల్ల మనశ్శాంతి కోసం తనకెవరి సాయం అక్కర్లేదన్నారు.

తనకు కలిగిన లోటు( భర్తకు దూరం అవ్వడం) భర్తీ చేయలేనిదేనని, శోకకరమైనదేనని పేర్కొన్నారు. అయితే ఇలాంటిది ఎవరికైనా జరగవచ్చునని, ఎవరికీ సంపూర్ణమైన జీవితం కలగదని అన్నారు. వ్యక్తిగతం గానూ, వృత్తిపరంగానూ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. ఇవన్నీ తాను యవ్వన వయసులోనే గ్రహించానని చెప్పారు. ఈ విషయంలో తాను శక్తిమంతురాలినేనని అన్నారు. విడిపోవడం అన్నది బాధాకరమే అయినా ఇప్పుడు ఇద్దరం ఎవరి స్థానాల్లో  వారు సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే అన్నిటికీ ఇదే పరిష్కారం అని భావించడం లేదని, ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. దాన్ని తెలివిగా ఎంచుకుని సంతోషంగా ఉండాలన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా బిజీగా ఉన్నానని, నటుడు బాబీసింహా, ప్రసన్నలతో కలిసి తిరుట్టుప్పయలే–2, ధనుష్‌కు జంటగా వీఐపీ–2, వడచెన్నై, విష్ణువిశాల్‌తో ఒక చిత్రం, అదే విధంగా కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నట్లు అమలాపాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement