VIP2
-
నో రెస్ట్... ఓన్లీ వర్క్
– ధనుష్ ‘పిల్లలకు ఆడుకోవడం ఎంత ఇష్టమో.. నాకు పని చేయడమంటే అంత ఇష్టం. చేసే పనిని ఎంజాయ్ చేయాలనుకుంటా. నాకసలు రెస్ట్ అవసరం లేదు. పని చేయడమే రిలాక్సేషన్’’ అని హీరో ధనుష్ అన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించిన ‘వీఐపీ 2’ ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ధనుష్ మాట్లాడుతూ– ‘‘రఘువరన్ బీటెక్’ సినిమా తెలుగులో మంచి హిట్ అవడంతో సీక్వెల్‌ను రెండు భాషల్లోనూ తీశాం. ‘వీఐపీ 2’లో వినోదం, భావోద్వేగాలు, మాస్ అంశాలన్నీ ఉంటాయి. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్‌గా ‘వీఐపీ 2’ కరెక్ట్ అనిపించింది. తమిళ్లో మా సినిమాకి వసూళ్లు బాగున్నాయి. కానీ, క్రిటిక్స్ వేరేలా రాశారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయాలనుకున్నాం. కానీ, తెలుగులో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చేయలేదు. తమిళంలో ఆ డేట్ దాటితే తర్వాత మంచి డేట్ లేదని అక్కడ రిలీజ్ చేశాం. ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్ రాశా. కానీ, సినిమా ఎలా మొదలుపెట్టాలో క్లారిటీ లేదు. సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్‌గా ఉంటాయి. అందుకే డైరెక్టర్‌గా సౌందర్య బెటర్ అనిపించింది. నేను డైరెక్ట్ చేసిన ‘పవర్‌పాండి’ని తెలుగులో డబ్ చేస్తాం. ‘మారి 2’ తెలుగు, తమిళ భాషల్లో తీయనున్నాం’’ అన్నారు. సౌందర్యా రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారితో (నాన్న) పనిచేయాలని ఎవరికైనా ఉంటుంది. తొలి సినిమాకే నాకా అవకాశం రావడం అదృష్టం. ధనుష్సార్ కూడా మంచి యాక్టర్. వారిని డైరెక్ట్ చేయడం నేను ఎంజాయ్ చేశా. డైరెక్టర్ అంటే డైరెక్టరే. అందులో ఆడ, మగ అనే తేడా ఉండదు. బంధుప్రీతి అన్నది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కానీ, ఏ రంగంలో అయినా ప్రతిభ ఉంటేనే మనం నిలబడగలం’’ అన్నారు. -
ధనుష్ అబద్దం చెప్పారు: సీనియర్ నటి
తమిళసినిమా: నటుడు ధనుష్ అబద్దం చెప్పారని బాలీవుడ్ భామ కాజోల్ అన్నారు. హిందీలో క్రేజీ కథానాయికిగా వెలుగొందుతున్న సమయంలోనే ఈ బ్యూటీ మిన్సార కణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయాన్ని సాధించినా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించలేదు. కాగా చాలా కాలం తరువాత నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ 2 చిత్రంతో మరో సారి కోలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కాజోల్ ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అది నిజం కాదని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ధనుష్ స్పష్టం చేశారు. ఇందులో కాజోల్‌ది తన పాత్రతో సమాంతరంగా సాగే ప్రధాన పాత్ర అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్ మాట్లాడుతూ తాను ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి సాహసించడం లేదన్నారు. అప్పుడేప్పుడో మిన్సార కణవు చిత్రంలో నటించాననీ, దీంతో వీఐపీ 2 చిత్రంలో నటించడానికి తాను చాలా నెర్వెస్‌గా ఫీలయ్యానన్నారు. భాష తెలియకపోవడమే అందుకు కారణం అని అన్నారు. ఈ చిత్రం కోసం ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు తన ఇంటికి వచ్చి తమిళంలో మాట్లాడటం గురించి చాలా నేర్పించారన్నారు. తమిళ భాష ఫోభియో నుంచి వారే తనను తప్పించారని చెప్పారు. అయినా తమిళంలో సంభాషణలు చెప్పడానికి బుర్ర బద్దలు కొట్టుకున్నానన్నారు. కొంచెం తమిళం, ఎక్కువ ఆంగ్లం భాషల్లో డైలాగులు చెప్పెశాననీ అన్నారు. అయితే తాను తమిళంలో డైలాగులు బాగా చెప్పానని నటుడు ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు అబద్ధం చెప్పారనీ వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీఐపీ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని, ధనుష్ చాలా మంచి యాక్టర్ అని ప్రశంసించారు. సౌందర్యరజనీకాంత్ స్క్రిప్ట్ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. ఇందులో ఈమె కార్పోరేట్ సంస్థ అధికారిణి వసుంధర పాత్రలో నటించారు. కాగా ఈ చిత్ర హిందీ వెర్షన్ కోసం ధనుష్, కాజోల్‌పై ప్రమోషన్ గీతాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం విశేషం. -
నాలో ఫైర్ రగులుతోంది: నటి
చెన్నై: తనలో ఫైర్ రగులుతోందని అంటోంది నటి అమలాపాల్. దర్శకుడు విజయ్‌తో వివాహరద్దు తరువాత ఈ అమ్మడి సినిమా జీవితం గురించి కంటే వ్యక్తిగత జీవితం గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతోంది. అయితే సినిమాలూ తక్కువేమి కాదు. చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. నటుడు ధనుష్‌తో నటించిన వీఐపీ 2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తిరుట్టుపయలే 2, మలయాళ చిత్రం అంటూ చాలానే చేతిలో ఉన్నాయి. కాగా, వివాహ రద్దు తరువాత అమలాపాల్ అవకాశాలతో పాటు గ్లామర్‌ను బాగా ఇంప్రూవ్ చేసుకుందని చెప్పవచ్చు. చాలా స్లిమ్‌గా తయారైన ఈ మలయాళీ అమ్మడు మెరుగుపరచుకున్న అందాలతో ప్రత్యేక ఫోటో సెషన్ చేసుకుని ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వేలాదిమంది ఆ ఫోటోలను లైక్ చేస్తున్నారు. దీని గురించి అమలాపాల్ స్పందిస్తూ నటిగా తనలో ఫైర్ అంతకంతకు రగులుతోందని పేర్కొంది. అందులో భాగమే తన అందాలకు మెరుగులని అంది. తాజాగా తన తాజా ఫోటోలను ట్విట్టర్లో ఫోస్ట్ చేసి మరో సారి తన జాణ తనాన్ని చూపించుకుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
నాకెవరి సాయం అవసరంలేదు!
ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉండే తారల్లో నటి అమలాపాల్ చేరారు. ఈమెను ఇంతకు ముందు కథానాయకిగానే మాట్లాడుకునేవారు.ఇప్పుడు అధికంగా దర్శకుడు విజయ్‌కు దూరం అయిన భార్యగానూ చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న రెండేళ్లలోనే విజయ్ నుంచి విడిపోయి పెద్ద చర్చకే దారి తీసిన నటి అమలాపాల్. విజయ్, అమలాపాల్ ఇద్దరూ విడాకుల కోసం కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టిన అమలాపాల్ తను భర్త నుంచి విడిపోవడానికి విధిని కారణంగా చూపుతున్నారు. దీని గురించి ఇంతకు ముందు చాలా తన వెర్షన్‌ను చెప్పుకొచ్చినా తాజాగా మరోసారి ప్రస్తావించారు. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుందంటున్న అమలాపాల్ మాట్లాడుతూ తనకు యోగా అంటే చాలా ఇష్టం అన్నారు. తన స్నేహితురాళ్లతో కలిసి నిత్యం యోగా చేస్తానన్నారు. తనకు కష్టకాలంలో ఆధ్యాత్మిక చింతన చాలా శక్తిని కలిగిస్తుందన్నారు. అందువల్ల మనశ్శాంతి కోసం తనకెవరి సాయం అక్కర్లేదన్నారు. తనకు కలిగిన లోటు( భర్తకు దూరం అవ్వడం) భర్తీ చేయలేనిదేనని, శోకకరమైనదేనని పేర్కొన్నారు. అయితే ఇలాంటిది ఎవరికైనా జరగవచ్చునని, ఎవరికీ సంపూర్ణమైన జీవితం కలగదని అన్నారు. వ్యక్తిగతం గానూ, వృత్తిపరంగానూ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. ఇవన్నీ తాను యవ్వన వయసులోనే గ్రహించానని చెప్పారు. ఈ విషయంలో తాను శక్తిమంతురాలినేనని అన్నారు. విడిపోవడం అన్నది బాధాకరమే అయినా ఇప్పుడు ఇద్దరం ఎవరి స్థానాల్లో వారు సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే అన్నిటికీ ఇదే పరిష్కారం అని భావించడం లేదని, ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. దాన్ని తెలివిగా ఎంచుకుని సంతోషంగా ఉండాలన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా బిజీగా ఉన్నానని, నటుడు బాబీసింహా, ప్రసన్నలతో కలిసి తిరుట్టుప్పయలే–2, ధనుష్‌కు జంటగా వీఐపీ–2, వడచెన్నై, విష్ణువిశాల్‌తో ఒక చిత్రం, అదే విధంగా కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నట్లు అమలాపాల్ తెలిపారు.