నాలో ఫైర్‌ రగులుతోంది: నటి | amala paul photos going to viral on social media | Sakshi
Sakshi News home page

నాలో ఫైర్‌ రగులుతోంది: నటి

Published Sat, Jun 10 2017 8:01 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

నాలో ఫైర్‌ రగులుతోంది: నటి - Sakshi

నాలో ఫైర్‌ రగులుతోంది: నటి

చెన్నై: తనలో ఫైర్‌ రగులుతోందని అంటోంది నటి అమలాపాల్‌. దర్శకుడు విజయ్‌తో వివాహరద్దు తరువాత ఈ అమ్మడి సినిమా జీవితం గురించి కంటే వ్యక్తిగత జీవితం గురించే సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతోంది. అయితే సినిమాలూ తక్కువేమి కాదు. చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. నటుడు ధనుష్‌తో నటించిన వీఐపీ 2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తిరుట్టుపయలే 2, మలయాళ చిత్రం అంటూ చాలానే చేతిలో ఉన్నాయి.

కాగా, వివాహ రద్దు తరువాత అమలాపాల్‌ అవకాశాలతో పాటు గ్లామర్‌ను బాగా ఇంప్రూవ్‌ చేసుకుందని చెప్పవచ్చు. చాలా స్లిమ్‌గా తయారైన ఈ మలయాళీ అమ్మడు మెరుగుపరచుకున్న అందాలతో ప్రత్యేక ఫోటో సెషన్‌ చేసుకుని ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు వేలాదిమంది ఆ ఫోటోలను లైక్‌ చేస్తున్నారు. దీని గురించి అమలాపాల్‌ స్పందిస్తూ నటిగా తనలో ఫైర్‌ అంతకంతకు రగులుతోందని పేర్కొంది. అందులో భాగమే తన అందాలకు మెరుగులని అంది. తాజాగా తన తాజా ఫోటోలను ట్విట్టర్‌లో ఫోస్ట్‌ చేసి మరో సారి తన జాణ తనాన్ని చూపించుకుందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement