
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్‌ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్‌లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment