
సెట్లో కంగనా
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇందులో యంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే చెన్నైలో ప్రారంభం అయింది. జయలలిత సీయంగా ఉన్న సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణలో పాల్గొంటున్న ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కంగనా. ‘‘తలైవి’ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు విజయ్‌గారితో ఓ సన్నివేశం గురించి సంభాషిస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండొచ్చు, కానీ సినిమా సెట్లో ఉన్నంత సంతోషంగా నేనెక్కడా ఉండలేను’’ అన్నారు కంగనా.
Comments
Please login to add a commentAdd a comment