అమ్మకు నచ్చిందనే అందుకు ఒప్పుకున్నా..  | Sai Pallavi talk about Karu movie | Sakshi
Sakshi News home page

అమ్మకు నచ్చిందనే అందుకు ఒప్పుకున్నా.. 

Published Thu, Mar 15 2018 9:25 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Sai Pallavi talk about Karu movie - Sakshi

సాయిపల్లవి(ఫైల్‌)

సాక్షి, సినిమా :  ప్రేమమ్‌ అంటూ మలయాళ సినీ వనంలో వికసించిన తమిళ నటి సాయిపల్లవి. ఆ చిత్రంలోని మలర్‌ పాత్ర సాయిపల్లవికి అనూహ్య పేరు తెచ్చిపెట్టింది. అంతే వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమను ఆకర్షించేసింది. అక్కడ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆ తరువాత నటించిన ఎంసీఏ చిత్రం కూడా వర్కౌట్‌ కావడంతో సాయిపల్లవికి తెలుగులో పిచ్చ క్రేజ్‌ వచ్చేసింది. తాజాగా కరు చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది. దర్శకుడు విజయ్‌ తెరకెక్కించిన ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. 

ఈ చిత్రంలో నటించడం గురించి సాయిపల్లవి తెలుపుతూ.. కరు చిత్రంలో తాను ఒక బిడ్డకు తల్లిగా నటించానని చెప్పింది. తమిళంలో మంచి కథా చిత్రం ద్వారా పరిచయం కావాలని ఎదురుచూశానని, అలాంటి సమయంలో దర్శకుడు విజయ్‌ కరు చిత్ర కథను చెప్పారని ఈ చిత్రంలో నటించడానికి నిరాకరించానని చెప్పింది. ఆ తరువాత విజయ్‌ తన అమ్మను కలిసి కథ వినిపంచారని, అమ్మకు కరు చిత్ర కథ తెగ నచ్చేసిందని అంది. దీంతో కరు చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. ఇలాఉండగా సాయిపల్లవి కరు చిత్ర షూటింగ్‌లో పలు షరతులు విధించి యూనిట్‌ వర్గాలను ఇబ్బందులకు గురి చేసిందని, తనకు చాలా అసౌకర్యాన్ని కలిగించిందని ఆ చిత్ర కథానాయకుడు నాగశౌర్య బహిరంగంగానే ఆరోపణలు గుప్పించాడన్నది గమనార్హం. అంతేకాదు రెండు మూడు చిత్రాల సక్సెస్‌నే తలకెక్కించేసుకుందనే ప్రచారం జోరందుకుంది. కేరీర్‌ సక్సెస్‌ బాటలో పయనిస్తుండగా ఇలాంటి ఆరోపణలు మంచిదికాదని సాయిపల్లవి గ్రహిస్తే మంచిదంటున్నారు సినీ వర్గాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement