Naga Sourya
-
సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకటరాయుళ్ల పట్టివేత
-
హీరో నాగ శౌర్యతో ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రీతూ వర్మ
‘‘వరుడు కావలెను’ చిత్రం టీజర్, ట్రైలర్ చూసి కొందరు ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. మంచి భావోద్వేగాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ఎంటర్టైనర్’’ అని రీతూ వర్మ అన్నారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. చదవండి: Vijay Devarakonda: విజయ్‌కి 40 నుంచి 50 వరకు రిలేషన్షిప్స్ ఉండేవి: ఆనంద్ ఈ సంద ర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారు ఈ సినిమా కథ చెప్పగానే బాగా నచ్చేసింది. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఈ మూవీలో నేను చేసిన భూమి పాత్ర అలాంటిదే.. నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది. సెట్స్‌లో అడుగుపెట్టాక మేల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ అనే తేడా ఉండదు.. అందరితో సౌకర్యంగా పని చేస్తాను. మా జంట (నాగశౌర్య–రీతూ) బాగుందని చాలామంది చెబుతుంటే రిలీజ్‌కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టుంది. చదవండి: ‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి.. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పటివరకు నాకు డ్యాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. ఈ సినిమాలో ‘దిగు దిగు...’ అనే మాస్ సాంగ్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం శర్వానంద్‌తో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నాను. తమిళ్లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అన్నారు. పెళ్లెప్పుడు అని అడగ్గా.. ‘‘ఇంకా రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు. అయినా అప్పుడప్పుడూ పెళ్లి మాట ఎత్తకుండా ఉండరు (నవ్వుతూ)’’ అన్నారు రీతూ వర్మ. -
ఈ వారం ఓటీటీ, థీయేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక దసరా తర్వాత వెండితెరపై చిన్న సినిమాల హవా కొసాగుతోంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన చిత్రాలు ఇప్పుడు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకోస్తోన్న ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. వరుడు కావలేను నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆకాశ్ పూరీ ‘రొమాంటిక్’ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ముంబై బ్యూటీ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న రొమాంటిక్ థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో అలరించనున్నారు. అనిల్ ఇనమడుగు ‘తీరం’ అనిల్ ఇనమడుగు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్ వైజీటీ మరో హీరో. క్రిస్టెన్ రవళి, అపర్ణ కథానాయికలు. యం శ్రీనివాసులు నిర్మంచిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు జంటల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, రొమాంటిక్‌గా తెరక్కించాడు అనిల్. రావణ లంక క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది, దీంతో అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ చిత్రంలో మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జై భజరంగి 2 కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’ చిత్రానికి సీక్వెల్‌గా ఏ. హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిరంజన్ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ విడుదలైంది. ఓటీటీలో జీ5 ►ఆఫత్ ఈ ఇష్క్(హిందీ) అక్టోబరు 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► హమ్ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29 అమెజాన్ ప్రైమ్ ► డైబుక్(హిందీ) అక్టోబరు 29 నెట్‌ఫ్లిక్స్ ►లాభం(తమిళం) అక్టోబరు 24 ► ఆర్మీ ఆఫ్ దీవ్స్ , అక్టోబరు 29 -
నాగశౌర్యతో జతకట్టనున్న ఆకాష్ పూరీ భామ!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హీరో నాగశౌర్య నటించిన ‘అశ్వథ్థామ’ విడుదలై సూపర్ హిట్ సాధించింది. ‘అశ్వథ్దామ’ హిట్‌తో జోరుమీదున్న నాగశౌర్య తెలుగులో వరస సినిమాలకు సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మాస్ దర్శకుడు పూరిజగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి ‘రోమాంటిక్’ భామ కేతిక శర్మ నటిస్తున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శక-నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. (చదవండి: నాగశౌర్య లుక్ అదుర్స్) ఆకాష్ పూరితో నటించిన తన మొదటి సినిమా ‘రోమాంటిక్’ విడుదల కాకముందే మరో సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ ముంబై భామ. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాకుముందే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. -
నాగశౌర్య లుక్ అదుర్స్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ప్రీ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ది గేమ్ విల్ నెవర్ బీ ది సేమ్’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో దీనిని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య మునుపెన్నడు చూడని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు . లవర్ బాయ్‌లా కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు. బాడీ షేప్ బాగుందంటూ కితాబిస్తున్నారు. చదవండి: ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు! This can't be any better. My dear bro @IamNagaShaurya you are unmatchable.. Wishing the entire team of #NS20 all the best ! https://t.co/5CrjOtWeQ8 — Rohith Nara (@IamRohithNara) July 27, 2020 ఇక అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా నాగశౌర్య కొత్త సినిమా ప్రీ లుక్‌పై స్పందిస్తున్నారు. నారా లోహిత్ ‘లుక్ డిఫరెంట్, ఇంకా నువ్వు బెటర్ అవ్వాల్సింది ఏం లేదు. నీతో ఎవరు మ్యాచ్ అవలేరు. టీం అందరికి ఆల్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ‘ఇది చూస్తుంటే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు దర్శకుడు శేఖర్ కమ్ముల ‘నారాయణదాస్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. On Narayan Das Ji’s Birthday, delighted to launch the Superb FIRST LOOK of @IamNagashaurya’s next #NS20. Wishing the entire team a grand success!#NarayanDas #RamMohan @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 #KetikaSharma @kaalabhairava7 #NS20FirstLook pic.twitter.com/F245JJZ6b1 — Sekhar Kammula (@sekharkammula) July 27, 2020 -
అందుకే ఆ ట్యాటూ వేయించుకున్నా
‘‘నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. ‘లవర్ బాయ్’ ట్యాగ్ మాత్రమే ఇష్టపడను. అన్నీ లవ్‌స్టోరీలే చేసుకుంటూపోతే రోజూ ఒకలాంటి పనే చేస్తున్న భావన కలగడం సహజం. ప్రతిరోజూ సెటికి వెళ్లడం హీరోయిన్‌కి రోజా పువ్వు ఇవ్వడం, పాటలు పాడటమే చేస్తున్నట్టుంది. హీరోయిన్లు మారుతున్నారు కానీ అదే పువ్వు ఇస్తున్నట్టుంది. శౌర్య ఇది కూడా చేస్తాడు అని ‘అశ్వథ్థామ’ సినిమా నిరూపిస్తుంది’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ సమకూర్చి హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణతేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ►ప్రస్తుతం అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యల ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. విజయవాడ, సంగారెడ్డి, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రదేశాలు తిరిగి బాధిత కుటుంబాలతో కలసి చాలా విషయాలు మాట్లాడాను. కథ రాయడం పూర్తయ్యేసరికల్లా నాకు జీవితంలో చాలా విషయాలపై అవగాహన వచ్చిందనే ఫీలింగ్ కలిగింది. అందుకే ‘ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అని ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను ►ఇందులో విలన్ పాత్ర మాత్రమే కల్పితం. మిగతా సంఘటనలన్నీ మా పరిశోధనలో తెలిసినవి, విన్నవే ఉంటాయి. విలన్ పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. అతన్ని ఎదుర్కోవడానికి హీరో పవర్‌ఫుల్‌గా ఉండాలి. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు తప్పు అని చెప్పింది అశ్వథ్థామ ఒక్కడే. ఈ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బావుంటుంది అని పెట్టాం. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పవన్‌కల్యాణ్‌గారి ‘గోపాల గోపాల’ సినిమాలో డైలాగ్‌తో ఈ సినిమా మొదలవుతుంది ►తమిళ సినిమాలు ‘రాక్షసన్, ఖైదీ, ఖాకీ’ తరహాలో ఈ సినిమా ఉంటుంది. చాలా నిజాయితీగా ఈ కథ చెప్పాం. సినిమా నచ్చి జిబ్రాన్ నేపథ్య సంగీతం అందిస్తా అన్నారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకలాంటి నిశ్శబ్దం ఇంటిని చుట్టేస్తుంది. ‘నర్తనశాల’ ఫ్లాప్ తర్వాత ఆరునెలలు అలాంటి నిశ్శబ్దంలోనే ఉన్నాను. మా అమ్మానాన్నలు కష్టపడి నిర్మిస్తే వాళ్లు తలెత్తుకోకుండా చేశానే అనే ఫీలింగ్ ఉంది. వాడికి హిట్ ఇవ్వలేదు అని వాళ్లు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ దర్శకుడికి ఇచ్చిన మాట కోసం ఆ సినిమా చేశాను. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని నమ్ముతాను ►‘నర్తనశాల’ సినిమా తర్వాత మళ్లీ కొత్తవాళ్లతో సినిమా ఎందుకు అన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సమయంలో నేనూ కొత్తవాణ్నే. కానీ నన్ను నమ్మి సినిమా అవకాశం ఇచ్చారు కదా. అవకాశం ఇచ్చే వీలు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ ప్రోత్సహించాలని నమ్ముతాను ►ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చేస్తున్నాను. అందులో 7 గెటప్స్‌లో కనిపిస్తాను. ఆ తర్వాత నందినీ రెడ్డి, సౌజన్య దర్శకత్వంలో సినిమాలు చేస్తాను. ప్రస్తుతం సినిమాలతోనే ప్రేమలో ఉన్నాను. ఓ లవ్‌స్టోరీ రాస్తున్నాను. మా బ్యానర్లోనే నిర్మిస్తాం. ఈ సినిమాలో నేను నటించను. బయట హీరో చేస్తారు. ‘అశ్వథ్థామ’ కథ చాలా ఎమోషనల్‌గా ఉండటంతో మానసికంగా శ్రమ అనిపించేది. కానీ అవుట్‌పుట్ సంతృప్తికరంగా అనిపించింది. అందుకే రిలీజ్ కాకముందే ‘అశ్వథ్థామ’ అని గుండెల మీద ట్యాటూ వేయించుకున్నాను. -
అమ్మకు నచ్చిందనే అందుకు ఒప్పుకున్నా..
సాక్షి, సినిమా : ప్రేమమ్ అంటూ మలయాళ సినీ వనంలో వికసించిన తమిళ నటి సాయిపల్లవి. ఆ చిత్రంలోని మలర్ పాత్ర సాయిపల్లవికి అనూహ్య పేరు తెచ్చిపెట్టింది. అంతే వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమను ఆకర్షించేసింది. అక్కడ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆ తరువాత నటించిన ఎంసీఏ చిత్రం కూడా వర్కౌట్ కావడంతో సాయిపల్లవికి తెలుగులో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. తాజాగా కరు చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది. దర్శకుడు విజయ్ తెరకెక్కించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో నటించడం గురించి సాయిపల్లవి తెలుపుతూ.. కరు చిత్రంలో తాను ఒక బిడ్డకు తల్లిగా నటించానని చెప్పింది. తమిళంలో మంచి కథా చిత్రం ద్వారా పరిచయం కావాలని ఎదురుచూశానని, అలాంటి సమయంలో దర్శకుడు విజయ్ కరు చిత్ర కథను చెప్పారని ఈ చిత్రంలో నటించడానికి నిరాకరించానని చెప్పింది. ఆ తరువాత విజయ్ తన అమ్మను కలిసి కథ వినిపంచారని, అమ్మకు కరు చిత్ర కథ తెగ నచ్చేసిందని అంది. దీంతో కరు చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. ఇలాఉండగా సాయిపల్లవి కరు చిత్ర షూటింగ్లో పలు షరతులు విధించి యూనిట్ వర్గాలను ఇబ్బందులకు గురి చేసిందని, తనకు చాలా అసౌకర్యాన్ని కలిగించిందని ఆ చిత్ర కథానాయకుడు నాగశౌర్య బహిరంగంగానే ఆరోపణలు గుప్పించాడన్నది గమనార్హం. అంతేకాదు రెండు మూడు చిత్రాల సక్సెస్‌నే తలకెక్కించేసుకుందనే ప్రచారం జోరందుకుంది. కేరీర్ సక్సెస్ బాటలో పయనిస్తుండగా ఇలాంటి ఆరోపణలు మంచిదికాదని సాయిపల్లవి గ్రహిస్తే మంచిదంటున్నారు సినీ వర్గాలు. -
మేకప్ వేసుకోకపోవడానికి కారణం అదే
సాక్షి, సినిమా : నటి సాయిపల్లవి మలయాళ సినిమా ప్రేమమ్‌లో మలర్ టీచర్‌గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’తో యువతను ఫిదా చేశారు. ఫిదా, ఎంసీఏ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. సాయిపల్లవి దాదాపు మేకప్ లేకుండా నటించేందుకే ఇష్టపడుతుంటారు. ఆ విషయం ఆమె సినిమాలు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు గల కారణాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. తన తొలి సినిమా ‘ప్రేమమ్’ దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ ఆమెను సహజంగా నటించమని ప్రోత్సహించినట్లు తెలిపారు. అలాగే తనతో కలిసి పనిచేసిన అందరు దర్శకులూ తన ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని పేర్కొన్నారు. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా ఇలా చేస్తున్నట్లు చెప్పారు. విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా , సాయిపల్లవి కథానాయికగా నటించిన ‘కణం’, సినిమా మార్చి 9న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి-2, సూర్యతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తోంది. -
నాగశౌర్యకు కాస్ట్లీ గిఫ్ట్.. ఎవరిచ్చారంటే!
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ విజయానందంలో తల్లి, నిర్మాత ఉషా ముల్పూరి నాగశౌర్యను సర్ప్రైజ్ చేశారట. ఆమె ఓ కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఆమె నాగశౌర్యకు పోర్షే 718 కెమెన్ అనే కారును కొనిచ్చారట. కారు విలువ దాదాపుగా రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. నాగశౌర్య తన ఇంటి వద్ద కారుతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నాగశౌర్య మదర్ ‘ఛలో’ సినిమాకు నిర్మాత. ఈ మూవీ బాక్సాఫిస్ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘ఛలో’ చిత్రానికి వెంకీ కుడుముల డైరెక్టర్. హీరోయిన్గా రష్మికా మండన్న నటించింది. ఈ సినిమాను చాలా వినోదాత్మకంగా రూపొందించారు. ‘కణం’ తమిళ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించారు. హీరోయిన్గా సాయిపల్లవి నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఆయనతో చేయడానికి నో చెప్పిన సాయిపల్లవి.!
తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి మొదట నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్ ఆంటోని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్. సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియా ఆవిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక టీ.నగర్‌లోని ఓ నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. తాను అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేశానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. తన తొలి చిత్రాన్ని (ప్రేమమ్ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామన్నారు. ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవే అని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్ అన్నారు. -
అంత మెచ్యూర్టీ ఇంకా రాలేదు
‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్ అని నమ్ముతాను. ‘ఛలో’ సినిమాలో ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉందనిపించింది. వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను’’ అన్నారు రష్మికా మండన్న. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కథానాయిక రష్మిక మాట్లాడుతూ– ‘‘డిగ్రీ కంప్లీట్ చేయడానికి బెంగళూరు వచ్చా. ఆ టైమ్‌లోనే కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో నటించే చాన్స్ వచ్చింది. అలా నా సినీ ప్రయాణం స్టారై్టంది. ‘కిర్రిక్ పారీలో నా యాక్టింగ్ చూసి ‘ఛలో’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు దర్శక–నిర్మాతలు. ఐరా క్రియేషన్స్ ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎ్రంటీ ఇస్తున్నందుకు హ్యాపీ. షూటింగ్ స్పాట్లో చాలా ఎంజాయ్ చేశా. ‘ఛలో’ యాప్ట్ టైటిల్ అని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అనుకుంటారన్న నమ్మకం ఉంది. షూటింగ్‌కి ముందు రోజే దర్శకులు వెంకీగారు డైలాగ్స్ పేపర్స్ ఇచ్చేవారు. డైరెక్టర్‌కు థ్యాంక్స్. ప్రిపేరై లొకేషన్‌కి వెళ్లెదాన్ని. సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడింది. భవిష్యత్‌లో నేను చేయబోయే చిత్రాలకు సొంత డబ్బింగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాగశౌర్య మోస్ట్ కంఫర్టబుల్ హీరో. షూటింగ్ టైమ్‌లో చాలా హెల్ప్ చేశారు. ఎవరినైనా ఇన్స్పైరింగ్గా తీసుకునేంత మెచ్యూర్టీ నాలో ఇంకా రాలేదు. కానీ హీరోయిన్ అనుష్కా శెట్టి వర్కింగ్ స్టైల్ అండ్ కమిట్మెంట్ నాకు ఇన్స్పైరింగ్లా అనిపిస్తాయి. ప్రజెంట్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. కన్నడలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
మెగా వేడుక
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ నీహారిక. మెగా బ్రదర్ ముద్దుల తనయ అయినా నీహా ఇప్పటికే బుల్లితెరపై తన టాలెంట్‌ని నిరూపించేసుకున్నారు. ‘ఒక మనసు’ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నారు. రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుకకు ముహూర్తం ఖరారైంది. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 18న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
ఆ సలహా ఇళయరాజా గారిదే : రమేశ్ వర్మ
‘‘ ‘వీర’ తర్వాత ఓ లవ్‌స్టోరీ చేద్దామనిపించి కథ రాసుకున్నా. ఆ కథతో నాగశౌర్యను హీరోగా పరిచయం చేద్దామనుకున్నా. కానీ అప్పట్లో కొత్త హీరో నాగ శౌర్యతో అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. కానీ నేను ఎప్పటికైనా నాగశౌర్యతోనే చేయాలనుకున్నా. ఇన్నాళ్లకు కుదిరింది’’ అని దర్శకుడు రమేశ్‌వర్మ చెప్పారు. నాగశౌర్య, పల్లక్ లల్వానీ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అబ్బాయితో అమ్మాయి ’ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రమేశ్ వర్మ చెప్పిన విశేషాలు... ♦ నిజానికి నేను అప్పట్లో నాగశౌర్య కోసం రాసుకున్న కథకు, ‘గుండెజారి గల్లంతయ్యిందే’కు పోలికలున్నాయి. అందుకే ఆ కథను పక్కనపడేసి, కొత్తగా ‘అబ్బాయితో అమ్మాయి’ కథ రెడీ చేసుకున్నా. మంచి నిర్మాతలు అండగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ♦ సోషల్ మీడియా అంతా మంచి కోసమే అని నా ఫీలింగ్. కానీ చాలామంది ఊహకూ, వాస్తవానికీ తేడా గమనించడం లేదు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల సాయంతో ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడే ఇద్దరు స్నేహితుల కథ ఇది. ప్రేమ అనేది లవర్స్‌కే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా ముడిపడి ఉంటుందని ఈ చిత్రం ద్వారా చెబుతున్నా. ♦ సంగీత దర్శకులు ఇళయరాజా గారితో నాకు మంచి అనుబంధం ఉంది. అసలు ఆయనకు నేను మొదట ‘వస్తా నీ వెనుక’ కథ వినిపించాను. ఆ తర్వాత ‘అబ్బాయితో అమ్మాయి’ కథ కూడా నేరేట్ చేశాను. ముందు ఈ సినిమా చేయమని ఆయన సలహా ఇచ్చారు. అలా ఈ సినిమా ప్రారంభించి, పూర్తి చేయడానికి ప్రధాన కారకులు ఇళయరాజా గారే. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయ మని ఆయన సూచించారు. దాంతో అక్కడా రిలీజ్ చేస్తున్నాం. ♦ త్వరలో ఓ ప్రముఖ హీరోతో ఓ లవ్‌స్టోరీ ప్లాన్ చేస్తున్నా. ‘ఇదేదో బాగుందే చెలి’ అనే టైటిల్ అనుకుంటున్నా. 2016 మార్చి నుంచి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. -
పాటల కోసం కుస్తీలు
‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో రెండు పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్, మ్యూనిచ్ వెళ్లారు. విపరీతమైన మంచు వర్షం. రోజూ లొకేషన్కెళ్లడం, ఖాళీగా తిరిగి వచ్చేయడం. మధ్యలో ఎప్పుడైనా వర్షం రాకపోతే పాట షూట్ చేసేవాళ్లు. హీరో నాగశౌర్య ఓకే కానీ, హీరోయిన్ పలక్ లల్వానీ మాత్రం చలికి తట్టుకోలేక ఒకటి, రెండుసార్లు స్పృహ తప్పి పడిపోయింది కూడా. ఎక్కడెక్కడి నుంచో చెక్క ముక్కలు ఏరుకొచ్చి, మంట లేసి ఆ చలి నుంచి తప్పించు కున్నారు. ఆ రోజు కొండలు, గుట్టలు దాటి బాగా ఎత్తై లొకేషన్‌కు వెళ్లారు. వర్షం మొదలైంది. ఎంతసేపటికీ ఆగడం లేదు. ఆ వర్షంలో కిందికి రావడం రిస్కు. ఒకవేళ అక్కడే ఉందామనుకుంటే డేంజరస్. లక్కీగా ఓ గంటసేపు వర్షం ఆగింది. దీంతో వీళ్లు తిరిగి రాగలిగారు. ఇన్ని కుస్తీలు చేసి, ఎట్టకేలకు ఆ రెండు పాటలు పూర్తి చేశారు. రమేశ్‌వర్మ దర్శకత్వంలో వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమేరా శ్యామ్ కె. నాయుడు. -
పొయిటిక్ లవ్
సోషల్ వరల్డ్‌లో ఓపెన్‌గా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న యువతరం రియల్ వరల్డ్‌లోకి వచ్చేసరికి అంత ఓపెన్‌గా ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ఫ్యూజన్గా సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుతం ట్రెండ్‌ని ఆవిష్కరిస్తూ రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగ శౌర్య, పల్లక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సంగీత జ్ఞాని ఇళయారాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేయనున్నారు. ఈలోపు నేటి నుంచి శుక్రవారం వరకూ విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, వరంగల్‌లో ఒక్కో పాటను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. రమేశ్ వర్మ చాలా ట్రెండీగా, పొయిటిక్గా తెరకెక్కించారు. ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యాం కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి. -
ఇదే తొలిసారి!
-
‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది
‘‘కెరీర్లో ఎప్పటికైనా నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. అలాగే... ప్రముఖ దర్శకులందరితో పనిచేయాలనుంది’’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. ఆయన కథానాయకునిగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుస లాడే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని నాగశౌర్య ఆనందం వెలిబుచ్చారు. సినిమా అవకాశాలకోసం తిరిగి తిరిగి చివరి ప్రయత్నంగా ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నానని, మంచి పాత్రతో ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని నాగశౌర్య తెలిపారు. కెరీర్‌ని జాగ్రత్తగా మలచుకోవాలనుకుంటున్నానని, ప్రస్తుతం సాయి కొర్రపాటి నిర్మాణంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా చేస్తున్నానని, రాజమౌళి సహాయకుడు కోటి ఈ సినిమాకు దర్శకుడని, అలాగే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా చేస్తున్నానని శౌర్య చెప్పారు. -
సంప్రదాయబద్ధంగా రావే...
‘ఉయ్యాలా జంపాలా’ఫేం అవికా, నాగశౌర్య జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ- ‘‘పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్దంగా, పూర్తిస్థాయి వినోదంగా ఉంటుందీ సినిమా. నాగశౌర్య, అవికా పోటీపడి నటిస్తున్నారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 13 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అని తెలిపారు. జూన్, జూలైల్లో కూర్గ్, పాండిచ్చేరిల్లో జరిగే మూడో షెడ్యూల్లో ఈ చిత్రం పాటలను చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. సీనియర్ నరేశ్, రావురమేశ్, వెన్నెల కిశోర్, ప్రగతి, అనితాచౌదరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, సంగీతం: కేఎం రాధాకృష్ణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు. -
వారాహి వారి రెండు సినిమాలు
‘ఈగ’, ‘అందాల రాక్షసి’ నిర్మాత సాయి కొర్రపాటి ఒకేసారి రెండు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఓ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా, మరో చిత్రానికి గోగినేని శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రాల పూజాకార్యక్రమాలు వారాహి సంస్థ కార్యాలయంలో జరిగాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. కల్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని అవసరాల శ్రీనివాస్ చెప్పారు. గోగినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని, ఈ చిత్రానికి సిల్లీ మాంక్స్ సినిమా సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి కుటుంబసభ్యులు, సిల్లీ మాంక్స్ సినిమా సీఈఓ సంజయ్‌రెడ్డి పాల్గొన్నారు.