సంప్రదాయబద్ధంగా రావే... | avika new film with naga sourya | Sakshi
Sakshi News home page

సంప్రదాయబద్ధంగా రావే...

Published Fri, May 2 2014 10:46 PM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

సంప్రదాయబద్ధంగా రావే... - Sakshi

సంప్రదాయబద్ధంగా రావే...

 ‘ఉయ్యాలా జంపాలా’ఫేం అవికా, నాగశౌర్య జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ- ‘‘పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్దంగా, పూర్తిస్థాయి వినోదంగా ఉంటుందీ సినిమా. నాగశౌర్య, అవికా పోటీపడి నటిస్తున్నారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 13 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అని తెలిపారు. జూన్, జూలైల్లో కూర్గ్, పాండిచ్చేరిల్లో జరిగే మూడో షెడ్యూల్‌లో ఈ చిత్రం పాటలను చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. సీనియర్ నరేశ్, రావురమేశ్, వెన్నెల కిశోర్, ప్రగతి, అనితాచౌదరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, సంగీతం: కేఎం రాధాకృష్ణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement